MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • RP Patnaik: 'గాజువాక పిల్ల' పాట వెనుక అంత విషాదం ఉందా.. ఆర్పీ పట్నాయక్ ఏం చెప్పారంటే.?

RP Patnaik: 'గాజువాక పిల్ల' పాట వెనుక అంత విషాదం ఉందా.. ఆర్పీ పట్నాయక్ ఏం చెప్పారంటే.?

RP Patnaik: సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తన కెరీర్‌లోని అద్భుతమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. 'చిత్రం', 'నువ్వు నేను' సినిమాల విజయం వెనుక ఉన్న రహస్యాలు, 'గాజువాక పిల్ల' పాట సృష్టించిన ట్రెండ్ గురించి ఈ ఇంటర్వ్యూలో వివరించారు. 

2 Min read
Author : Pavithra D
Published : Mar 18 2026, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కెరీర్‌లోని అద్భుతమైన జ్ఞాపకాలు
Image Credit : Screenshot

కెరీర్‌లోని అద్భుతమైన జ్ఞాపకాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్పీ పట్నాయక్ తనదైన శైలి ముద్ర వేశారు. ముఖ్యంగా దర్శకుడు తేజతో ఆయన చేసిన సినిమాలు సంగీత పరంగా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన తన సినీ ప్రయాణంలోని కొన్ని షాకింగ్, ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సక్సెస్ తర్వాత 'నో' చెప్పడం
Image Credit : Screenshot

సక్సెస్ తర్వాత 'నో' చెప్పడం

'చిత్రం' సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత నేను చాలా సినిమాలకు 'నో' చెప్పాల్సి వచ్చింది. దాదాపు 22 సినిమాలను వదులుకున్నాను అని చెప్పారు. కేవలం బడ్జెట్ వల్ల సినిమా హిట్ అవ్వదని, అద్భుతమైన కాన్సెప్ట్ ఉండాలని నమ్మేవారట. అయితే, ఈ తిరస్కరణల వల్ల పరిశ్రమలో తనకు గర్వం ఎక్కువనే ముద్ర కూడా పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Related Articles

Related image1
Chiranjeevi: అందుకే అంత రాత్రిలో చిరంజీవి సెట్‌కి వచ్చారు.. ఆయన్ని చూసి యూనిట్ అంతా షాక్.!
Related image2
Chiranjeevi: హిట్లర్ మూవీలో ఆ ఒక్క డైలాగ్ మేనరిజం రాసింది నేనే.. చిరంజీవి పిలిచి ఏమన్నారంటే.?
35
'నువ్వు నేను' ట్యూన్ 'జయం'లోకి ఎలా వచ్చింది.?
Image Credit : Screenshot

'నువ్వు నేను' ట్యూన్ 'జయం'లోకి ఎలా వచ్చింది.?

'నువ్వు నేను' సినిమాలోని ఒక సాంగ్ కాన్సెప్ట్ గురించి చెబుతూ, ఒకే సిట్యుయేషన్ కోసం రెండు ట్యూన్స్ రెడీ చేశామని తెలిపారు. అందులో ఒక ట్యూన్‌ను 'నువ్వు నేను' కోసం వాడగా, మిగిలిపోయిన మరో ట్యూన్‌ను తర్వాత 'జయం' సినిమాలో క్లైమాక్స్ సాంగ్ 'ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ' కోసం ఉపయోగించినట్లు వెల్లడించారు. అసలు ఆ ట్యూన్ కోసం రాసిన లిరిక్ 'గున్నమామిడి కొమ్మమీద గారాల గోరింక' అని ఆయన గుర్తు చేసుకున్నారు.

45
గాజువాక పిల్ల - ఒక విషాదకర సంఘటన
Image Credit : Screenshot

గాజువాక పిల్ల - ఒక విషాదకర సంఘటన

ఆర్పీ పట్నాయక్ కెరీర్‌లో 'గాజువాక పిల్ల' సాంగ్ ఒక సంచలనం. అయితే ఈ పాట గురించి ఆయన ఒక చేదు జ్ఞాపకాన్ని పంచుకున్నారు. ఒక పెళ్లి వేడుకలో ఈ పాట విన్న ఒక వ్యక్తి, ఆ కిక్కులో రాత్రంతా అదే పాటపై డ్యాన్స్ చేసి, అలసటతో మరణించాడనే షాకింగ్ విషయాన్ని ఆయన తెలిపారు. పాటను వినోదం కోసం వినాలి తప్ప, ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని ఆయన సూచించారు.

55
ఫోక్ టచ్ వెనుక కారణం
Image Credit : Screenshot

ఫోక్ టచ్ వెనుక కారణం

కాలేజీ పాటలకు ఫోక్ టచ్ ఇవ్వడంపై స్పందిస్తూ, రియలిస్టిక్ అప్రోచ్ కోసమే అలా చేశామని చెప్పారు. కాలేజీ స్టూడెంట్స్ అంటే ఎప్పుడూ పాష్‌గా, వెస్ట్రన్ సాంగ్స్ పాడుకుంటూ ఉండరని, తన చదువు పూర్తయ్యే వరకు తాను చూసిన రియాలిటీని పాటల్లో చూపించానని ఆర్పీ వివరించారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
Chiranjeevi: అందుకే అంత రాత్రిలో చిరంజీవి సెట్‌కి వచ్చారు.. ఆయన్ని చూసి యూనిట్ అంతా షాక్.!
Recommended image2
Chiranjeevi: హిట్లర్ మూవీలో ఆ ఒక్క డైలాగ్ మేనరిజం రాసింది నేనే.. చిరంజీవి పిలిచి ఏమన్నారంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved