- Home
- Entertainment
- 30 కోట్ల రెమ్యునరేషన్, 300 కోట్లకుపైగా ఆస్తులు, 4000 కోట్ల బడ్జెట్ సినిమా చేస్తున్నహీరో?
30 కోట్ల రెమ్యునరేషన్, 300 కోట్లకుపైగా ఆస్తులు, 4000 కోట్ల బడ్జెట్ సినిమా చేస్తున్నహీరో?
సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, వ్యాపారాల ద్వారా వందల కోట్ల ఆస్తులు సంపాదించిన ఓ హీరో.. 4000 కోట్ల బడ్జెట్ మూవీ చేస్తున్నాడు. ఆయన గ్యారేజీలో బెంట్లీ, రేంజ్ రోవర్, మెర్సిడెస్, ఆడి లాంటి ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నాయి.

రణబీర్ కపూర్ ఆస్తులు
బాలీవుడ్ టాప్ హీరోల్లో రణబీర్ కపూర్ ఒకడు. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, పెట్టుబడుల ద్వారా ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టాడు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం రణబీర్ ఆస్తుల విలువ సుమారు రూ.345 కోట్లు ఉంటుంది. అయితే ఇది కేవలం అంచనా మాత్రమే.
రణబీర్ ఏడాదికి రూ.30 కోట్లకు పైగా సంపాదిస్తున్నాడని సమాచారం. ఒక్కో సినిమాకు ఆయన భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటాడు. వరుస సినిమాలు, బ్రాండ్స్ ఆయన ఆదాయాన్ని అమాంతం పెంచుతున్నాయి.
లగ్జరీ కార్ల గ్యారేజ్
రణబీర్ సినిమాలతో పాటే ఆయన కార్ల కలెక్షన్ గురించి కూడా జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఆయన దగ్గర ఎన్నో ప్రీమియం, లగ్జరీ ఎస్‌యూవీ కార్లు ఉన్నాయి.
రణబీర్ గ్యారేజీలో బెంట్లీ కాంటినెంటల్ జీటీ వీ8, ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-ఏఎంజీ జీ63, ఆడి ఆర్8 లాంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఆడి ఏ8 ఎల్ తో పాటు మరికొన్ని లగ్జరీ కార్లలో కూడా ఆయన చాలాసార్లు కనిపించాడు.
రణబీర్ కపూర్ కార్ల కలెక్షన్
2024లో రణబీర్ గ్యారేజీలోకి బెంట్లీ కాంటినెంటల్ జీటీ వీ8 కారు వచ్చి చేరింది. దీని ధర సుమారు రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
ముంబై వీధుల్లో రణబీర్ ఈ డార్క్ కలర్ బెంట్లీ కారును నడుపుతూ చాలాసార్లు కనిపించాడు. దీంతో ఈ కారు ఆయన ఫేవరెట్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
మెర్సిడెస్-ఏఎంజీ, రేంజ్ రోవర్
పవర్‌ఫుల్ లగ్జరీ ఎస్‌యూవీలంటే రణబీర్‌కు చాలా ఇష్టం. ఆయన దగ్గర ఉన్న మెర్సిడెస్-ఏఎంజీ జీ63, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ కార్ల ధరలు వరుసగా రూ.2 కోట్లు, రూ.3 కోట్లకు పైనే ఉంటాయి.
వీటితో పాటు పెర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కారు ఆడి ఆర్8 కూడా రణబీర్ కార్ల కలెక్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
మరిన్ని లగ్జరీ కార్లు
ఇటీవలి రిపోర్ట్స్ ప్రకారం రణబీర్ దగ్గర మెర్సిడెస్-ఏఎంజీ ఎస్ఎల్ 55 4మ్యాటిక్, లెక్సస్ ఎల్ఎమ్ 350హెచ్, బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, ఆడి ఏ8 ఎల్, టయోటా వెల్‌ఫైర్ లాంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. మోడల్, షోరూమ్ ధరలను బట్టి వీటి రేట్లు మారుతూ ఉంటాయి.
స్టార్‌డమ్‌కు తగ్గ లైఫ్‌స్టైల్
బ్లాక్‌బస్టర్ సినిమాలు, లగ్జరీ ఆస్తులు, ఖరీదైన కార్లు.. ఇవన్నీ బాలీవుడ్‌లో రణబీర్ కపూర్ సాధించిన సక్సెస్‌కు నిదర్శనం. చేతిలో భారీ ప్రాజెక్టులు ఉండటంతో, ఆయన సంపాదన, ఆస్తుల వివరాలు తెలుసుకోవడానికి ఫ్యాన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ రామాయణ సినిమాలో నటిస్తున్నాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈసినిమా దాదాపు 4000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తునండగా.. కన్నడ రాకింగ్ స్టార్ యష్ రావణుడిగా నటిస్తున్నారు.

