MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 9th క్లాస్ ఫెయిల్ అయిన హీరోయిన్ కు ఇంగ్లీష్ నేర్పించి వెంకటేష్, నాగార్జున, ఎవరా హీరోయిన్?

9th క్లాస్ ఫెయిల్ అయిన హీరోయిన్ కు ఇంగ్లీష్ నేర్పించి వెంకటేష్, నాగార్జున, ఎవరా హీరోయిన్?

Venkatesh, Nagarjuna: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన హీరోయిన్.. కానీ చదువుకున్నది మాత్రం 9th క్లాస్ మాత్రమే. కానీ ఇంగ్లీష్ మాత్రం అద్భుతంగా మాట్లాడుతుంది. టాలీవుడ్ హీరోలు వెంకటేష్, నాగార్జున దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్న టాప్ హీరోయిన్ ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 28 2026, 08:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
9th క్లాస్‌ ఫెయిల్ అయిన హీరోయిన్
Image Credit : Asianet News

9th క్లాస్‌ ఫెయిల్ అయిన హీరోయిన్

సాధారణంగా హీరోయిన్లు అంటేనే ఇంగ్లీష్‌లో అదరగొడుతుంటారు. మాతృభాష వచ్చినా కూడా ఇంగ్లీష్‌లోనే మాట్లాడటం కొంతమందికి అలవాటు. ఉన్నత చదువులు చదువుకుంటూనే హీరోయిన్లుగా మారినవారు చాలామంది ఉన్నారు. కానీ ఓ నటి మాత్రం 9th క్లాస్‌ను మధ్యలోనే వదిలేసి హీరోయిన్ అయ్యింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగు వెలిగిన ఈ తార.. స్టార్ హీరోల సరసన మెరిసింది. తక్కువ చదువుకున్నా ఇంగ్లీష్ మాత్రం అనర్గళంగా మాట్లాడుతుంది. దానికి కారణం వెంకటేష్, నాగార్జున అని చెబుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నాగార్జున, వెంకటేష్‌లకు కృతజ్ఞతలు
Image Credit : our own

నాగార్జున, వెంకటేష్‌లకు కృతజ్ఞతలు

సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన నటీమణుల్లో ఖుష్బూ ఒకరు. బహుభాషా నటిగా, స్పష్టమైన ఉచ్చారణతో ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడే ఆమె ప్రతిభను చూసి చాలామంది ఫారెన్ లో చదువుకుని వచ్చిందేమో అని అనుకుంటారు. ఒక ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను 9వ తరగతిలోనే చదువును నిలిపివేశానని (discontinue) ఖుష్బూ వెల్లడించారు. పాఠశాల చదువు పూర్తికాకపోయినా అంతటి చక్కని ఇంగ్లీష్ ఎలా మాట్లాడగలుగుతున్నారనే ప్రశ్నకు ఖుష్బూ స్పందిస్తూ, తన భాషా నైపుణ్యానికి ప్రధాన కారణం టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగార్జున అని తెలిపారు.

34
ఖుష్బూను ప్రోత్సహించిన హీరోలు..
Image Credit : Asianet News

ఖుష్బూను ప్రోత్సహించిన హీరోలు..

తమిళంలో హీరోయిన్‌గా పరిచయమైన ఖుష్బూ.. తెలుగులో చేసిన మొదటి సినిమా వెంకటేష్‌తో, రెండవ సినిమా నాగార్జునతో జరిగింది. ఆ సమయంలో వెంకటేష్, నాగార్జున ఇద్దరూ అమెరికాలో చదువు ముగించుకుని భారతదేశానికి తిరిగివచ్చారు. అప్పట్లో ఖుష్బూ ఇంగ్లీష్ అంతగా బాగుండేది కాదట, కానీ వారిద్దరూ ఖుష్బూను నిరంతరం ఇంగ్లీష్‌లోనే మాట్లాడమని ప్రోత్సహించేవారట. షూటింగ్ గ్యాప్‌లో ఇంగ్లీష్‌లో మాట్లాడటం, తప్పులను సరిదిద్దడం లాంటివి చేసేవారట.

44
నాగార్జున ఇచ్చిన విలువైన బహుమతి..
Image Credit : Asianet News

నాగార్జున ఇచ్చిన విలువైన బహుమతి..

ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించడంలో పుస్తకాలు చదవడం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ విషయాన్ని నాగార్జున ఖుష్బూకు వివరించారు. ఆయన తనకు మొదటి ఇంగ్లీష్ నవలను బహుమతిగా ఇచ్చి, ఇంగ్లీష్ నవలలు చదవడం ప్రారంభించాలని సూచించారు. నాగార్జున ఇచ్చిన ఆ బహుమతే తనలో ఇంగ్లీష్‌పై ఇష్టాన్ని, నేర్చుకోవాలన్న తపనను పెంచిందని ఖుష్బూ గుర్తుచేసుకున్నారు. వెంకటేష్ మాటల్లో ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు వస్తుంటాయి.. వాటిని అనుసరించి తాను కూడా మాట్లాడటానికి ప్రయత్నించానని ఖుష్బూ అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
దగ్గుబాటి వెంకటేష్
అక్కినేని నాగార్జున
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja: 11 ఏళ్ళు తెలుగు నటిని ప్రేమించిన డైరెక్టర్ కి జయలలిత, వాణిశ్రీ వార్నింగ్.. ఏంటి ఈ బెదిరింపులు అంటూ
Recommended image2
Rashmi Gautam: ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన యాంకర్ రష్మీ గౌతమ్, నన్ను ఏమైనా అనండి కానీ...
Recommended image3
Bigg Boss Telugu 10: వీకెండ్ ఎలిమినేషన్ లో బిగ్ ట్విస్ట్.. ముఖేష్ త్యాగంతో మారిపోయిన సీన్...
Related Stories
Recommended image1
Aditya 369 Review: బాలకృష్ణకు గెస్ట్ రోల్ ఇద్దామనుకున్నారు.. అరవ హీరోతో చేయాల్సిన సినిమా.. ఆదిత్య 369 మూవీ రివ్యూ
Recommended image2
Babu Mohan: బాబు మోహన్ మంత్రి అవ్వడం తట్టుకోలేకపోయిన కోట శ్రీనివాసరావు, అసెంబ్లీలో ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved