MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Paradise 5 Days Collections: సడెన్‌గా పడిపోయిన ప్యారడైజ్‌ కలెక్షన్లు.. నాని మూవీ హిట్‌ కావాలంటే ఎంత రావాలంటే?

Paradise 5 Days Collections: సడెన్‌గా పడిపోయిన ప్యారడైజ్‌ కలెక్షన్లు.. నాని మూవీ హిట్‌ కావాలంటే ఎంత రావాలంటే?

Paradise 5 Days Collections: నాని హీరోగా నటించిన `ది ప్యారడైజ్‌` మూవీ మొదటి వారాంతంలో అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. కానీ సోమవారం మాత్రం సడెన్‌గా పడిపోయింది. మరి ఐదు రోజుల్లో ఇది ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 29 2026, 07:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్యారడైజ్‌లో హైలైట్స్ ఇవే
Image Credit : X/@SLVCinemasOffl

ప్యారడైజ్‌లో హైలైట్స్ ఇవే

నాని, కయాదు లోహర్ జంటగా, దర్శకుడు శ్రీకాంత్‌ ఓడెల రూపొందించిన `ది ప్యారడైజ్‌` మూవీ మాస్‌, యాక్షన్‌ కమర్షియల్‌ మూవీగా వచ్చి ఆకట్టుకుంటోంది. అనేక నెగటివ్‌ కామెంట్స్ వచ్చినా,ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. నాని నటన, యాక్షన్‌, దర్శకుడు శ్రీకాంత్‌ ఓడెల టేకింగ్‌, విలక్షణ నటుడు మోహన్‌బాబు విలనిజం, తల్లి సెంటిమెంట్‌, కయాదు లోహర్‌ గ్లామర్‌ సినిమాలో హైలైట్‌గా నిలిచాయి. ప్రియదర్శి పాత్ర మరో హైలైట్‌గా చెప్పొచ్చు. దీనికితో అనిరుథ్‌ రవిచందర్‌ సంగీతం ప్లస్‌ అయ్యింది. అయితే సెంటిమెంట్‌, ఎమోషన్స్ పండలేదనే విమర్శలు వచ్చాయి. దర్శకుడు క్లారిటీ మిస్‌ అయ్యడని అంటున్నారు. ఓవరాల్‌గా ఈ చిత్రంపై యావరేజ్‌ టాక్‌ వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
పడిపోయిన సోమవారం కలెక్షన్లు
Image Credit : X/@SLVCinemasOffl

పడిపోయిన సోమవారం కలెక్షన్లు

కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన `ది ప్యారడైజ్‌` మూవీకి మొదటిరోజు దుమ్మలేపే కలెక్షన్లు వచ్చాయి. నాని కెరీర్‌లోనే అత్యధికం కావడం విశేషం. పాన్‌ ఇండియా హీరో రేంజ్‌లో ఈ చిత్రం రాబట్టింది. ఈ దెబ్బతో నాని లెక్క మారిపోయింది. అయితే ఇందులో టికెట్‌ రేట్ల పెంపు కూడా ఓ కారణమని చెప్పొచ్చు. ఏదేమైనా `ప్యారడైజ్‌` మూవీ బాక్సాఫీసుని షేక్‌ చేసింది. వీకెండ్‌ వరకు అదిరిపోయే వసూళ్లని రాబట్టిన ఈ చిత్రం సోమవారం మాత్రం భారీగా పడిపోయింది. అది ఒక స్థాయిని మించి పడిపోవడం ఆశ్చర్యపరుస్తుంది.

34
ఐదో రోజు కలెక్షన్లు
Image Credit : Asianet News

ఐదో రోజు కలెక్షన్లు

సోమవారం ఈ చిత్రం ఇండియాలో రూ.5.85కోట్ల గ్రాస్‌ని చేసింది. ఓవర్సీస్‌లో కేవలం రూ.75లక్షలు మాత్రమే చేసింది. అక్కడ కూడా భారీగా పడిపోయింది. ఆదివారంతో పోల్చితే ఈ మూవీ సోమవారం ఏకంగా 60-70శాతం పడిపోవడం ఆశ్చర్యపరుస్తోంది. టికెట్‌ రేట్లు ఎక్కువగానే ఉన్నా, ఈ స్థాయిలో డ్రాప్‌ కావడం ఆశ్చర్యపరుస్తోంది. ఇది టీమ్‌ని కూడా కలవరానికి గురి చేస్తోంది. మొత్తంగా సోమవారం ప్రపంచ వ్యాప్తంగా రూ.6.60కోట్ల గ్రాస్‌ రాబట్టింది. అయితే ఈ చిత్రానికి మేజర్‌గా కలెక్షన్లు నైజాం నుంచే వచ్చాయి. ఇక్కడ ఇది ఏకంగా రూ.50కోట్లు చేసింది. ఓవర్సీస్‌లో ముప్పై కోట్లు రాబట్టింది. కర్నాటకలో పది కోట్లు దాటింది. ఏపీలో తక్కువగా వచ్చాయి. హిందీలో కూడా డీసెంట్‌ నెంబర్స్ వచ్చాయి. తమిళనాడు, కేరళాలోనూ నాని కెరీర్‌లోనే బెటర్‌ కలెక్షన్లు రావడం విశేషం. మొత్తంగా ఈ మూవీ ఐదు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.144.85కోట్లు రాబట్టినట్టు సాక్నిల్క్ సైట్‌ వెల్లడించింది. టీమ్‌ చెప్పిన లెక్కల ప్రకారం ఇది ఆదివారంతోనే రూ.155కోట్లు చేసింది. సోమవారంతో రూ.160కోట్లు దాటుతుందని చెప్పొచ్చు.

44
ప్యారడైజ్‌ మూవీ హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రాబట్టాలంటే?
Image Credit : Asianet News

ప్యారడైజ్‌ మూవీ హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రాబట్టాలంటే?

ది ప్యారడైజ్‌ మూవీ సుమారు రూ.150కోట్లతో రూపొందింది. నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ రూపంలో దాదాపు రూ.80 నుంచి వంద కోట్లు వచ్చినట్టు సమాచారం. అందులో నెట్‌ ఫ్లిక్స్ సుమారు రూ.50 కోట్లకి తీసుకుందట. ఆడియోరైట్స్ రూపంలో మరో రూ.15కోట్లు వచ్చిందని సమాచారం. శాటిలైట్‌ రూపంలో బాగానే వచ్చిందట. ఇక థియేట్రికల్‌ రైట్స్ సుమారు వంద కోట్లుగా లెక్క కట్టారు. దీంతో రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ల టార్గెట్‌తో థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.70కోట్ల షేర్‌ని సాధించింది. ఇంకా ముప్పై కోట్ల షేర్‌ రావాలి. అంటే ఇంకా దాదాపు అరవై కోట్ల గ్రాస్‌ కలెక్ట్ చేయాలి. మరి సోమవారం డ్రాప్‌ని చూస్తుంటే ఆ టార్గెట్‌ని రీచ్‌ అవుతుందా అనేది సస్పెన్స్ గా మారింది. కష్టమనే ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ రేట్లు తగ్గితే ఏమైనా పుంజుకుంటుందా అనేది చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నాని (నటుడు)
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Related Stories
Recommended image1
Uday Kiran: చిరంజీవి అడ్డుపడుతున్నాడంటూ ఉదయ్‌ కిరణ్‌ ఆవేదన.. లవర్‌ బాయ్‌ నిజస్వరూపం బయటపెట్టిన నిర్మాత
Recommended image2
Venkatesh Remuneration: ఆదర్శ కుటుంబం మూవీకి వెంకటేష్‌ ఊహించని రెమ్యూనరేషన్‌.. ఏకంగా 3 రెట్లు ఎక్కువ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved