- Home
- Entertainment
- Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
బిగ్ బాస్ తెలుగు 10లో భాగంగా సోమవారం హౌస్ రణరంగాన్ని తలపించింది. ఇంటి సభ్యులు రెండు జట్లుగా విడిపోయి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఆడారు. ఈ క్రమంలో రెండు జట్ల మధ్య మాటల యుద్ధం జరిగింది.

బిగ్ బాస్ తెలుగు 10
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో 22వ రోజు హౌస్ లో సంచలన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంటి సభ్యుల మధ్య మాటల హద్దులు దాటాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడానికి కూడా వెనుకాడలేదు. ముందుగా కెప్టెన్ అపూర్వ ఇంటి మీటింగ్ పెట్టింది. తన రూల్స్ ఫాలో కావాలి అని ఆదేశించింది. దానికి ముఖేష్, త్రిగున్ అంగీకరించలేదు.
ముకేశ్, అపూర్వ మధ్య రచ్చ
ఆమె పెట్టిన కొన్ని నియమాలకు ముఖేష్ ఒప్పుకోలేదు. నువ్వు కెప్టెన్ కాబట్టి నీ ఇష్టం వచ్చింది చెబితే ఎవరూ చేయరు. మాకు చేయాలనిపించిందే చేస్తాం అంటూ ముఖేష్ గొడవ పడ్డాడు. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులని రెండు జట్లుగా విభజించారు. ఒక టీంలో వర్షిణి, ఝాన్సీ, రోహిత్, అపూర్వ, రామ్ ప్రసాద్,వంశి , అమన్, సుధీర్ ఉన్నారు. ఆ టీంకి టీం భైరవ అని పేరు పెట్టారు. మరో టీంలో షాలిని, సృష్టి, చరణ్, నరేష్, త్రిగుణ, ముఖేష్, దేబ్జానీ ఉన్నారు. ఈ టీంకి సప్త శక్తి అని పేరు పెట్టారు. బిగ్ బాస్ ఈ గేమ్ లో కొన్ని ఆయుధాలు ఇచ్చారు.
మగతనం కాదు అంటూ త్రిగుణ్ ఫైర్
కానీ ఒక టీమ్ సభ్యులు మరో టీమ్ కి చెందిన ఆయుధాల్ని దొంగిలించి దాచిపెట్టాలని ప్రయత్నించారు. ముందుగా నరేష్ ఆయుధాన్ని బలవంతంగా లాక్కున్నారు. టీమ్ భైరవలో ఉన్న రామ్ ప్రసాద. నరేష్ ఆయుధాన్ని తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పారు. తనకు అవసరం లేదని.. తన గేమ్ పై తనకు నమ్మకం ఉంది అని నరేష్ అన్నారు. అసలు అలా ఆయుధం బలవంతంగా తీసుకోవడం మగతనం కాదు అంటూ త్రిగుణ్.. టీం భైరవకి కౌంటర్ ఇచ్చాడు.
ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు
ఆ తర్వాత బిగ్ బాస్ రథాన్ని నిర్మించే టాస్క్ ఇచ్చారు. ఇందులో రౌండ్ 1లో ముందుగా బ్రిక్స్ సంపాదించాలి. ఈ టాస్క్ లో మాటల యుద్ధం హద్దులు దాటింది. షాలిని సీక్రెట్ గా బ్రిక్ దాస్తోంది అని అపూర్వ చెప్పడంతో రోహిత్, మరికొందరు వెంటనే వెళ్లి.. షాలినిపై అటాక్ చేశారు. అక్కడ రెండు టీమ్స్ ఫిజికల్ అయ్యారు. తనని అటాక్ చేసిన రోహిత్ పై కూడా షాలిని రెచ్చిపోయింది. ఆమెకి సపోర్ట్ గా త్రిగుణ్ రోహిత్ తో గొడవ పడ్డాడు. ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వు అంటూ రెచ్చిపోయాడు. అమ్మాయి విషయంలో జరిగిన సంఘటనని అడ్వాంటేజ్ తీసుకునే చీప్ క్యారెక్టర్ అంటూ రోహిత్ త్రిగుణ్ కి కౌంటర్ ఇచ్చారు.

