- Home
- Entertainment
- Bigg Boss Telugu 9 : భరణి దగ్గర ఉండటానికే వచ్చిందా.. దివ్య బాండింగ్‌పై రమ్య మోక్ష హాట్ కామెంట్
Bigg Boss Telugu 9 : భరణి దగ్గర ఉండటానికే వచ్చిందా.. దివ్య బాండింగ్‌పై రమ్య మోక్ష హాట్ కామెంట్
Bigg Boss Telugu 9: వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు హౌజ్‌లో ఫైర్ బ్రాండ్‌ని ఓపెన్ చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు. వాదనలతో రెచ్చిపోతున్నారు. దివ్వెల మధురీ, రమ్య రచ్చ రచ్చ చేశారు.

బిగ్ బాస్ 9 హౌజ్‌లో వైల్డ్ కార్డ్స్ రచ్చ
బిగ్ బాస్ తెలుగు 9 ఆరో వారంలోకి విజయవంతంగా అడుగుపెట్టింది. ఐదో వారం ఆదివారం ఎపిసోడ్‌లో ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పటికే శ్రష్టి వర్మ, ప్రియా శెట్టి, మర్యాద మనీష్, హరిత హరీష్ ఎలిమినేట్ కాగా, ఈ ఆదివారం ఫ్లోరా సైనీ, శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. హౌజ్‌ని వీడిన వారిలో నలుగురు కామన్ మ్యాన్ కంటెస్టెంట్లు ఉన్నారు. ఇద్దరే సెలబ్రిటీలున్నారు. వారు కూడా మరీ డల్ గా ఉండటంతో తప్పించాల్సి వచ్చింది. ఇక ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆరుగురు కంటెస్టెంట్లని హౌజ్‌లోకి తీసుకొచ్చారు. దీంతో మళ్లీ 15 మందితో బిగ్ బాస్ హౌజ్ బ్యాలెన్స్ అయ్యింది.
కళ్యాణ్‌పై దివ్వెల మాధురీ ఫైర్.. అంతలోనే కన్నీళ్లతో డ్రామా
ఇక సోమవారం ఎపిసోడ్‌లో హౌజ్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు వచ్చీ రావడంతో హౌజ్‌లో ఫైర్ అంటించే ప్రయత్నం చేశారు. అందులో ముందు ఉంది దివ్వెల మాధురీ. ఆమె కిచెన్‌లో వంట చేసే విషయంలోనే కెప్టెన్ కళ్యాణ్‌ని ఏసుకుంది. కళ్యాణ్ ఆమెని పిలిచి మీతో మాట్లాడాలని అన్నాడు. కూర్చోపోతే చెప్పరా అంటూ వెటకారంగా రియాక్ట్ అయ్యింది మాధురీ. రేపటి నుంచి ఇలా ఉండదు, అంతా షెడ్యూల్ ప్రకారం ఉంటుందని కళ్యాణ్ చెప్పినప్పుడు ఆమె మరోసారి రెచ్చిపోయింది. దీంతో మీరు ఇలా మాట్లాడితే నేను కూడా వేరేలా మాట్లాడాల్సి వస్తుందని కౌంటర్ ఇచ్చాడు కళ్యాణ్. దీంతో రచ్చ షురూ అయ్యింది. ఇద్దరి మధ్య వాదన గట్టిగా జరిగింది. ఇందులో దివ్య కూడా ఇన్ వాల్వ్ అయ్యింది. ఆమె కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. భరణి సైతం ఇన్ వాల్వ్ అయ్యారు. మాధురీపై రివర్స్ ఎటాక్ చేయడంతో కాస్త తగ్గింది. అప్పటి వరకు ఫైర్ బ్రాండ్‌గా ఉంటానని చెప్పిన మాధురీ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. హౌజ్‌లో డ్రామా స్టార్ట్ చేసింది. దీంతో మాధురీ ఎంట్రీ సమయంలో ఇచ్చిన బిల్డప్ ఒక్క రోజులోనే నీరుగారిపోయినట్టయ్యింది.
రొమాంటిక్ యాంగిల్ బయటపెట్టిన రమ్య మోక్ష
ఆ తర్వాత ఇమ్మాన్యుయెల్ కాసేపు కామెడీ చేశారు. అటు పాత కంటెస్టెంట్లతో, ఇటు కొత్త కంటెస్టెంట్లతో కలిసిపోయాడు. సరదాగా నవ్వించే ప్రయత్నం చేశారు. రమ్య మోక్షతో ఆయన కన్వర్జేషన్ ఆకట్టుకుంది. ఇక గార్డెన్ ఏరియాలో కూర్చొని రీతూ బట్టలు పిండుతుంటే ఇమ్మాన్యుయెల్ రెచ్చిపోయాడు. ఆమెని ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. ఈ సరదా నుంచి షో సీరియస్‌గా మారింది. కొత్తగా వచ్చిన వారు హౌజ్‌లో రిలేషన్స్ గురించి, బాండింగ్స్ గురించి మాట్లాడారు. గుసగుసలాడారు. రమ్య మోక్ష ఏకంగా దివ్య గురించి షాకింగ్ కామెంట్ చేసింది. భరణితోనే ఉండటానికే ఆమె బిగ్ బాస్ కి వచ్చిందా అంటూ కామెంట్ చేసింది.
కన్నీళ్లు పెట్టుకున్న దివ్య
ఈ విషయాలను తలుచుకుని దివ్య ఎమోషనల్ అయ్యింది. భరణి, రాము, పవన్ ల వద్ద తన గోడు వెళ్లబోసుకుంది. హౌజ్‌లో చాలా మంది మధ్య బాండింగ్స్ ఉన్నాయి, అవేవీ మాట్లాడటం లేదు. నా గురించే మాట్లాడుతున్నారని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తనని టార్గెట్ చేయడంపై ఆమె బాధపడింది. దీంతో భరణి చిన్న విషయాలకే ఎందుకు ఏడుస్తున్నావని ఓదార్చే ప్రయత్నం చేశారు. రాము కూడా ఆమెకి సపోర్ట్ గా నిలిచారు.
ఆరో వారం నామినేట్ అయ్యింది వీరే
అనంతరం నామినేషన్ల ప్రక్రియస్టార్ట్ చేశారు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్లు బాల్‌ని పట్టుకుని తమకు నచ్చిన కంటెస్టెంట్ ని ఎంపిక చేసుకుని నామినేషన్ చేసే అవకాశం కల్పించాలి. అలా నిఖిల్ నాయర్ బాల్‌ని దక్కించుకుని తనూజకి ఇవ్వగా, ఆమె సుమన్ శెట్టి, రాము రాథోడ్‌లను నామినేట్ చేసింది. ఈ క్రమంలో సుమన్ శెట్టి ఆసక్తికర కామెంట్ చేశాడు. రాము రాథోడ్ కూడా పంచ్‌లతో రెచ్చిపోయాడు. ఈ ఇద్దరిలో సుమన్ శెట్టిని నామినేట్ చేస్తున్నట్టు నిఖిల్ వెల్లడించారు. రాముని తప్పించారు. అనంతరం రమ్య బాల్‌ని పట్టుకుని రాము రాథోడ్‌కి ఇచ్చింది. ఆయన రీతూ చౌదరీ, డీమాన్ పవన్‌లకు నామినేట్ చేశాడు. బెలూన్ టాస్క్ లో రీతూ పౌల్ గేమ్‌ని ప్రస్తావించి వారిని నామినేట్ చేయగా, రీతూ గట్టిగానే ఏకిపడేసింది. ఇందులో రమ్య.. పవన్ నామినేషన్‌ని ఉంచి, రీతూని తొలగించింది. రేపటి ఎపిసోడ్‌లో సంజనాకి ఆ ఛాన్స్ దక్కింది. ఆమె రీతూ, భరణిలను నామినేట్ చేసింది. భరణి రెచ్చిపోయాడు. మిగిలిన నామినేషన్స్ మంగళవారం ఎపిసోడ్ లో చూపించనున్నారు. ఎవరిని నామినేట్ చేయాలనేది మాధురీ ప్లాన్ చేసింది. చూడబోతుంటే హౌజ్‌ని ఆమె తన కంట్రోలలో నడిపించబోతుందని చెప్పొచ్చు. లీక్ అయిన సమాచారం ప్రకారం ఆరో వారం భరణి, సుమన్ శెట్టి, డీమాన్ పావన్, రాము రాథోడ్, తనూజ, దివ్య నామినేట్ అయినట్టు తెలుస్తోంది.