- Home
- Entertainment
- Rajamouli: రాజమౌళి ఫస్ట్ డైరెక్టర్‌గా చేసింది ఏంటో తెలుసా? స్టూడెంట్ నెం 1 కాదు.. ఎస్వీఆర్ రిజెక్ట్ చేయడంతో
Rajamouli: రాజమౌళి ఫస్ట్ డైరెక్టర్‌గా చేసింది ఏంటో తెలుసా? స్టూడెంట్ నెం 1 కాదు.. ఎస్వీఆర్ రిజెక్ట్ చేయడంతో
Rajamouli: రాజమౌళి తొలి సినిమాని ఎన్టీఆర్‌తో చేసిన విషయం తెలిసిందే. కానీ ఆయన డైరెక్ట్ చేసింది అది కాదు. ఓ లెజెండరీ నటుడితో ప్లాన్ చేశారు. కానీ.. ఏం జరిగిందంటే?

ఇండియన్ మూవీ లెక్కలు మార్చిన రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమాల్లో సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కాదు. సినిమా దశ దిశనే మార్చేశారు. భాష అనే తేడాని బ్రేక్ చేశారు. ఒక భాషలో తీసిన మూవీని ఇతర భాషల ఆడియెన్స్ కూడా చూడగలిగేలా చేశారు. పాన్ ఇండియా ట్రెండ్‌ని పరుగులు పెట్టించారు. ఇప్పుడు స్టార్ హీరోలంతా పాన్ ఇండియా చిత్రాలే చేస్తున్నారు. అందుకు కారణం జక్కన్న అనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఈ మూవీతో ఆయన సరికొత్త సంచలనాలు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఎక్కువ మంది ఆడియెన్స్ ఈ మూవీని చూసేలా ప్రయత్నిస్తున్నారు.
`స్టూడెంట్ నెం 1`తో డైరెక్టర్‌గా సినిమాల్లోకి ఎంట్రీ
రాజమౌళి కెరీర్‌ని చూస్తే ఆయనకు పరాజయమే లేదు. అపజయం ఎరుగని దర్శకుడిగా రాణిస్తున్నారు. `స్టూడెంట్ నెం.1` నుంచి అదే కొనసాగిస్తున్నారు. `సింహాద్రి`, `సై`,`ఛత్రపతి`, `విక్రమార్కుడు`, `యమదొంగ`, `మగధీర`, `మర్యాద రామన్న`, `ఈగ`, `బాహుబలి` 1-2, `ఆర్‌ఆర్‌ఆర్` వరకు వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. సునీల్‌తోనూ సినిమా తీసి హిట్ అందుకున్నారు. ఈగతోనూ మూవీ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. తన కెరీర్‌లో ఇప్పటి వరకు ఎన్టీఆర్, ప్రభాస్, నితిన్, సునీల్, నాని, రామ్ చరణ్, రవితేజ వంటి హీరోలతో పనిచేశారు. ఇప్పుడు మొదటిసారి మహేష్ బాబుతో చేస్తున్నారు. అయితే రాజమౌళి మొదటగా డైరెక్ట్ చేసింది ఎన్టీఆర్‌ని కాదు. లెజెండరీ నటుడు ఎస్వీఆర్ చేయాల్సిన సినిమాని జక్కన్న చేయాల్సి వచ్చింది.
`శాంతి నివాసం` సీరియల్‌తో దర్శకుడిగా మారిన రాజమౌళి
రాజమౌళి ప్రారంభంలో ఇండస్ట్రీలో అసిస్టెంట్‌గా చాలా సినిమాలకు పనిచేశారు. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద ఎడిటింగ్ డిపార్ట్మెంట్‌లో చేశారు. అలాగే ఏవీఎమ్ జీ రికార్డింగ్ థియేటర్ లో పనిచేశారు. ఆ తర్వాత దర్శకుడు క్రాంతి కుమార్ వద్ద `అమ్మ కొడుకు`, `సరిగమలు` చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేశారు. అట్నుంచి రాఘవేంద్రరావు వద్ద అసిస్టెంట్‌గా చేరారు. దర్శకేంద్రుడి పర్యవేక్షణలో పనిచేశారు. దర్శకుడిగా ట్రైన్ అయ్యారు. ఈ క్రమంలో మొదటగా రాజమౌళి `శాంతి నివాసం` సీరియల్‌ని డైరెక్ట్ చేయాల్సి వచ్చింది. అయితే దీనికో కథ ఉంది. రాఘవేంద్రరావు `శాంతినివాసం`ని సినిమాగా చేయాలనుకున్నారు.
ఎస్వీఆర్‌తో సినిమా చేయాలనుకున్న రాఘవేంద్రరావు
లెజెండరీ నటుడు ఎస్వీఆర్‌తో తన మొదటి సినిమాగా `శాంతినివాసం` చేయాలని రాఘవేంద్రరావు ఈ కథని రాసుకున్నారు. కానీ ఎస్వీఆర్‌తో మూవీ కుదరలేదు. ఆయన రిజెక్ట్ చేశారు. ఆ కథని అలానే ఉంచిన రాఘవేంద్రరావు సినిమా లైన్ చెప్పి 70 సీన్లుగా ఉన్న కథని 1500 సీన్లున్న సీరియల్‌గా చేయమన్నారు. దాన్ని రాజమౌళి చేయడం చూసి రాఘవేంద్రరావు ఫిదా అయ్యారు. ఇతనిలో మంచి టాలెంట్ ఉందని, మంచి డైరెక్టర్ ఉన్నాడని గమనించి ఆ తర్వాత స్టూడెంట్ నెం 1` ని రాజమౌళితో చేయించారు. ఈ చిత్రంతోనే దర్శకుడిగా రాజమౌళి, హీరోగా ఎన్టీఆర్ పరిచయం అయ్యారు. సినిమా సూపర్ హిట్ కావడంతో జక్కన్న జాతకమే మారిపోయింది. ఆ తర్వాత ఆయన తెలుగు సినిమా జాతకాన్నే మార్చేసిన విషయం తెలిసిందే.