MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajasekhar: విలన్‌ గా రాజశేఖర్‌ కన్ఫమ్‌.. ఇన్నాళ్లకి సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్‌ హీరో

Rajasekhar: విలన్‌ గా రాజశేఖర్‌ కన్ఫమ్‌.. ఇన్నాళ్లకి సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్‌ హీరో

హీరో రాజశేఖర్‌ తన కెరీర్‌లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు హీరోగా మెప్పించిన ఆయన విలన్‌గా తనలోని మరో యాంగిల్‌ ని ఈతరం ఆడియెన్స్ కి పరిచయం చేయబోతున్నారు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Oct 13 2025, 09:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చిరు, బాలయ్యలతో పోటీ పడ్డ రాజశేఖర్‌
Image Credit : youtube/great andhra

చిరు, బాలయ్యలతో పోటీ పడ్డ రాజశేఖర్‌

యాంగ్రి యంగ్‌ మేన్‌గా ఎదిగిన రాజశేఖర్‌ ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమని ఒక ఊపు ఊపేశారు. యాక్షన్‌ చిత్రాలతో ఉర్రూతలూగించారు. తిరుగులేని సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. అప్పట్లో రాజశేఖర్‌ సినిమాలు చిరంజీవి, బాలయ్య చిత్రాలకు పోటీగా ఆడేవంటే అతిశయోక్తి కాదు. చాలా సార్లు బాలయ్యతో బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డారు. చాలా సార్లు రాజశేఖర్‌ సక్సెస్‌ అయ్యారు కూడా. బాక్సాఫీసు వద్దే కాదు, కథలు, కాన్సెప్ట్ ల పరంగానూ పోటీ పడ్డారు. ఆకట్టుకున్నారు. హై ఎమోషనల్‌ మూవీస్‌ తో మెప్పించారు. మిగిలిన హీరోలు చేయలేని సాహసాలు రాజశేఖర్‌ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వరుస పరాజయాల్లో రాజశేఖర్‌
Image Credit : youtube/great andhra

వరుస పరాజయాల్లో రాజశేఖర్‌

అయితే రాను రాను రాజశేఖర్‌ క్రేజ్‌ పడిపోయింది. ఆయన సినిమాలు థియేటర్లలో ఆడకపోవడంతో కొంత డౌన్‌ అయ్యారు. డిఫరెంట్‌ మూవీస్‌తో తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నా, అవి ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో వెనకబడిపోతున్నాయి. చివరగా రాజశేఖర్‌ `పీఎస్‌వీ గరుడవేగ`తో హిట్‌ కొట్టారు. ఆ వెంటనే చేసిన `కల్కి` జస్ట్ యావరేజ్‌గా ఆడింది. కానీ స్టయిలీష్‌ మూవీగా మెప్పించింది. ఆ తర్వాత రాజశేఖర్‌ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతున్నాయి. చివరికి క్యారెక్టర్స్ వైపు కూడా టర్న్ తీసుకున్నారు. నితిన్‌ హీరోగా నటించిన `ఎక్స్ టార్డినరీ మ్యాన్‌` చిత్రంలో కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడకపోవడంతో మళ్లీ గ్యాప్‌ తీసుకున్నారు.

34
రౌడీ జనార్థన్‌లో రాజశేఖర్‌
Image Credit : Asianet News

రౌడీ జనార్థన్‌లో రాజశేఖర్‌

ఇదిలా ఉంటే ఇప్పుడు శర్వానంద్‌ హీరోగా చేస్తున్న ఓ మూవీలో రాజశేఖర్‌ కీలక పాత్రలో, ఆయనకు తండ్రిగా కనిపిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. కానీ ఇప్పుడు ఒక క్రేజీ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తాజాగా రాజశేఖర్‌ విలన్‌గా టర్న్ తీసుకుంటున్నాడట. ఆయన విజయ్‌ దేవరకొండ సినిమాలో విలన్‌గా నటిస్తున్నట్టు సమాచారం. రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో విజయ్‌ ఓ మూవీ చేస్తున్నారు. కీర్తిసురేష్‌ ఇందులో హీరోయిన్‌. దిల్‌ రాజు నిర్మించే ఈ మూవీ ఇటీవలే ప్రారంభమైంది. `రౌడీ జనార్థన్‌` అనే పేరుతో ఇది తెరకెక్కనుంది. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్‌ రస్టిక్ గా మూవీ సాగుతుందని తెలుస్తోంది.

44
విలన్‌గా టర్న్ తీసుకున్న రాజశేఖర్‌
Image Credit : our own

విలన్‌గా టర్న్ తీసుకున్న రాజశేఖర్‌

ఈ సినిమాతో హీరో రాజశేఖర్‌ విలన్‌గా టర్న్ తీసుకుంటున్నారట. పవర్‌ఫుల్‌ విలన్‌ రోల్‌లో ఆయన కనిపించబోతున్నారట. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆయన లుక్‌ ఉండబోతుందని తెలుస్తోంది. హీరోని డామినేట్‌ చేసే స్థాయిలో రాజశేఖర్‌ పాత్ర ఉంటుందని, అందుకే ఆయన ఈ సినిమా చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే రాజశేఖర్‌ హీరోగానూ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఓ రీమేక్‌లో నటించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. తమిళంలో హిట్‌ అయిన `లబ్బరు పందు`ని తెలుగులో రీమేక్‌ చేస్తున్నారని, ఇందులో వీఆర్‌ దినేష్‌ పాత్రలో రాజశేఖర్‌, అర్జున్‌ కళ్యాణ్‌ పాత్రలో విశ్వదేవ్‌ రాచకొండ నటిస్తున్నట్టు సమాచారం. రాజశేఖర్‌ కూతురు కూడా ఇందులో కనిపించబోతున్నట్టు టాక్. మొత్తంగా ఈ మూడు సినిమాలతో రాజశేఖర్‌ కమ్‌ బ్యాక్‌ కాబోతున్నట్టు టాక్. అంతేకాదు ఇకపై వరుసగా నెగటివ్‌ రోల్స్ కూడా చేసేందుకు రాజశేఖర్‌ నిర్ణయం తీసుకున్నారట. ఆ దిశగానే ప్లాన్స్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలయ్య పెద్ద మనసు, 43 కోట్ల విలువైన ఇంటిని త్యాగం.. ఎందుకంటే?
Recommended image2
Serial Killer Movies: లాస్ట్ మినిట్ వరకు ఉత్కంఠ రేపే టాప్ 5 సీరియల్ కిల్లర్ మూవీస్ ఇవే!
Recommended image3
సెకనుకు 10 లక్షలు.. 50 సెకన్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Rajamouli: రాజమౌళి ఫస్ట్ డైరెక్టర్‌గా చేసింది ఏంటో తెలుసా? స్టూడెంట్‌ నెం 1 కాదు.. ఎస్వీఆర్‌ రిజెక్ట్ చేయడంతో
Recommended image2
Mahesh babu: రీమేక్‌ అని ఇండస్ట్రీ హిట్‌ని మిస్‌ చేసుకున్న మహేష్‌.. లవర్‌ బాయ్‌ జాతకమే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved