MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Ramgopal Varma: తన దేశంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో భోరుమని ఏడుస్తున్న వర్మ హీరోయిన్

Ramgopal Varma: తన దేశంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో భోరుమని ఏడుస్తున్న వర్మ హీరోయిన్

Ramgopal Varma's heroine : ఇజ్రాయెల్ దాడులతో తన మాతృభూమి లెబనాన్ రక్తసిక్తం కావడంపై రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ మియా ఖలీఫా కన్నీటి పర్యంతమయ్యారు. యుద్ధం ఆపాలని కోరుతూ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 10 2026, 09:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
యుద్ధం ఆపండి ప్లీజ్.. కన్నీళ్లతో ప్రాధేయపడుతున్న మియా ఖలీఫా
Image Credit : X/RGVzoomin, Instagram/miakhalifa

యుద్ధం ఆపండి ప్లీజ్.. కన్నీళ్లతో ప్రాధేయపడుతున్న మియా ఖలీఫా

ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య వార్ మొదలైంది. ఈ హింసాత్మక పరిస్థితులపై లెబనీస్-అమెరికన్ మీడియా పర్సనాలిటీ, ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో నటించబోతుందనే ప్రచారంతో తెలుగువారికి సుపరిచితమైన మియా ఖలీఫా తీవ్రంగా స్పందించారు. తన దేశంపై జరుగుతున్న దాడులను చూసి ఆమె భోరున ఏడుస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇది ఎప్పుడు ఆగుతుందంటూ మియా ఖలీఫా కన్నీళ్లు
Image Credit : Instagram/miakhalifa

ఇది ఎప్పుడు ఆగుతుందంటూ మియా ఖలీఫా కన్నీళ్లు

మియా ఖలీఫా షేర్ చేసిన వీడియోలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంతో భయాందోళనతో కనిపిస్తున్నారు. తన మాతృభూమి అయిన లెబనాన్ పై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను చూసి తట్టుకోలేకపోతున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. "పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. మా కళ్లముందే దాడులు జరుగుతుంటే చూడటం ఎంతో బాధాకరంగా ఉంది. దీనిని వివరించడానికి నా దగ్గర పదాలు లేవు" అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

సోషల్ మీడియాలో కనిపిస్తున్న దృశ్యాలు తనను కలచివేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. నివాస ప్రాంతాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలో వందలాది దాడులు జరగడం దారుణమని ఆమె మండిపడ్డారు. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ, ఇలాంటి హింస కొనసాగడం ప్రజలను తీవ్రంగా కలవరపెడుతోందని ఆమె అన్నారు.

Related Articles

Related image1
YouTube : యూట్యూబ్ యూజర్లకు గట్టి షాక్.. కొత్త రూల్ చూస్తే తల బాదుకోవాల్సిందే !
Related image2
Vishwa : గిన్నెలు కడిగా.. ఆకలితో అలమటించా! ఇప్పుడు రూ. 50 కోట్ల సామ్రాజ్యం.. బిగ్ బాస్ విశ్వ సక్సెస్ స్టోరీ
34
ఇజ్రాయెల్, అమెరికాపై తీవ్ర విమర్శలు
Image Credit : Instagram/miakhalifa

ఇజ్రాయెల్, అమెరికాపై తీవ్ర విమర్శలు

మియా ఖలీఫా కేవలం తన బాధను పంచుకోవడమే కాకుండా, రాజకీయ విమర్శలు గుప్పించారు. ఈ దాడులను ఆమె ఉగ్రవాదంతో పోల్చారు. "రెండు దేశాలు ఒకరినొకరు మించి యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఉగ్రవాద, ఫాసిస్ట్ దేశాలు. వీరిపై ఒకరోజు హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఖచ్చితంగా విచారణ జరుగుతుంది" అని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ లెబనాన్‌పై భారీ దాడులకు దిగడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

44
లెబనాన్‌లో మారణహోమం
Image Credit : Getty

లెబనాన్‌లో మారణహోమం

ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో లెబనాన్ అతలాకుతలమైంది. లెబనాన్ పౌర రక్షణ విభాగం అందించిన వివరాల ప్రకారం.. బీరుట్, బెకా వ్యాలీ, మౌంట్ లెబనాన్, సిడాన్, దక్షిణ ప్రాంతాల్లోని గ్రామాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో కనీసం 254 మంది ప్రాణాలు కోల్పోగా, 1,100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ చరిత్రలో లెబనాన్‌పై జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇది ఒకటి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఈ దాడులను సమర్థించుకుంటూ, హిజ్బుల్లాకు చెందిన మౌలిక సదుపాయాలను నాశనం చేయడమే తమ లక్ష్యమని పేర్కొంది. దక్షిణ లెబనాన్‌ను వేరు చేసి, తమ సరిహద్దు నుంచి 30 కిలోమీటర్ల వరకు బఫర్ జోన్‌ను ఏర్పాటు చేసే వ్యూహంలో భాగంగానే ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
ప్రపంచం
యుద్ధం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image2
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image3
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Related Stories
Recommended image1
YouTube : యూట్యూబ్ యూజర్లకు గట్టి షాక్.. కొత్త రూల్ చూస్తే తల బాదుకోవాల్సిందే !
Recommended image2
Vishwa : గిన్నెలు కడిగా.. ఆకలితో అలమటించా! ఇప్పుడు రూ. 50 కోట్ల సామ్రాజ్యం.. బిగ్ బాస్ విశ్వ సక్సెస్ స్టోరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved