MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?

Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?

సూపర్‌ స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో రామ్‌ చరణ్‌ ఇండస్ట్రీ హిట్‌ కొట్టాడు. దీనితో ఆయన లైఫే మారిపోయింది. మరి ఆ సినిమా ఏంటి? ఆ కథేంటి అనేది తెలుసుకుందాం. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 15 2026, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో రామ్‌ చరణ్‌ ఇండస్ట్రీ హిట్‌
Image Credit : Asianet News

కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో రామ్‌ చరణ్‌ ఇండస్ట్రీ హిట్‌

సూపర్‌ స్టార్‌ కృష్ణ 1960 నుంచి సినిమాలు చేస్తూ వచ్చారు. ఆయన హీరోగా కెరీర్‌ పీక్‌ చూసినప్పుడు చిరంజీవి కనీసం ఇండస్ట్రీలో కూడా లేరు. 1980 నుంచి చిరంజీవి నటుడిగా జర్నీ స్టార్ట్ చేసి మూడేళ్లలోనే స్టార్‌ అయిపోయాడు. 1990 టైమ్‌లో కెరీర్‌లో పీక్‌ని చూశారు. ఆ సమయంలో కృష్ణ కూడా తిరుగులేని సూపర్‌ స్టార్‌గా రాణించారు. అయితే కృష్ణ చేయాల్సిన ఒక సినిమా రామ్‌ చరణ్‌ చేయడం విశేషం. సూపర్‌ స్టార్‌ రిజెక్ట్ చేసిన మూవీతో చరణ్‌ ఇండస్ట్రీ హిట్‌ని కొట్టాడు. రికార్డులు తిరగరాశారు. కలెక్షన్ల పరంగా టాలీవుడ్‌కి కొత్త మైల్‌ స్టోన్‌ని సెట్‌ చేశారు. మరి ఆ సినిమా ఏంటి? ఆ కథేంటనేది చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మగధీరతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన చరణ్‌
Image Credit : Asianet News

మగధీరతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన చరణ్‌

రామ్‌ చరణ్‌.. `చిరుత` మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2007లో విడుదలైంది. తొలి చిత్రంతోనే ఆకట్టుకున్నాడు చరణ్‌. ఆ తర్వాత `మగధీర`తో పెద్ద హిట్‌ని అందుకున్నాడు. 2009లో విడుదలైన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకుడు. దీనికి విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. ఇందులో కాజల్‌ హీరోయిన్‌గా నటించగా, శ్రీహరి కీలక పాత్ర పోషించారు. పునర్జన్మల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది వంద కోట్లకుపైగా వసూలు చేసింది. టాలీవుడ్‌లో వంద కోట్లు దాటిన తొలి చిత్రం ఇదే కావడం విశేషం. ఇండస్ట్రీ హిట్‌ అని చెప్పొచ్చు.

Related Articles

Related image1
Balakrishna Wife Background: బాలకృష్ణ భార్య వసుంధర దేవి బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిస్తే మతిపోతుంది.. పుట్టుకతోనే ఇంత రిచ్చా?
Related image2
Peddi 11 days Collections: వీకెండ్‌లో పెద్ది జోరు.. రామ్‌ చరణ్‌ సినిమా అరుదైన మైల్‌స్టోన్‌.. టోటల్‌ కలెక్షన్లు
35
మగధీర రిజెక్ట్ చేసిన కృష్ణ
Image Credit : Pinterest

మగధీర రిజెక్ట్ చేసిన కృష్ణ

ఇదిలా ఉంటే ఈ మూవీ సూపర్‌స్టార్‌ కృష్ణ చేయాల్సింది. 1996లో కృష్ణ `జగదేక వీరుడు` అనే సినిమా చేశాడు. ఇందులో సౌందర్య హీరోయిన్‌గా నటించింది. సాగర్‌ దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీకి మొదట అనుకున్న కథ వేరు. అదే `మగధీర` కథ. ఈ కథతో సినిమా చేయాలని భావించారు. విజయేంద్రప్రసాద్‌ కథ అందించారు. కానీ కృష్ణతోపాటు వారి టీమ్‌కి ఈ కథ పెద్దగా నచ్చలేదట. ఇది వర్కౌట్‌ కాదని చెప్పి పక్కన పెట్టారట. వేరే కథతో `జగదేక వీరుడు` అనే మూవీని రూపొందించారు. కానీ అది బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్‌ అయ్యింది. దీంతో ఈ కథని పక్కన పెట్టాడు విజయేంద్రప్రసాద్‌.

45
కృష్ణ నుంచి చరణ్‌కి మగధీర
Image Credit : Asianet News

కృష్ణ నుంచి చరణ్‌కి మగధీర

కానీ ఈ కథ గురించి తమ మధ్య చాలా సార్లు డిస్కషన్‌ జరిగిందట. రాజమౌళి కి తెలియడంతో ఇంత మంచి కథ ఎందుకు రిజెక్ట్ చేశారని రాజమౌళి ఆలోచించి కథలో మార్పులు చేశారట. దాన్ని మగధీరగా తయారు చేశారు. మొదట చిరంజీవితో అనుకున్నారట. మధ్యలో ఓ దర్శకుడు ఇన్‌వాల్వ్ అయి అది వద్దు అన్నారట. దీంతో మళ్లీ బ్యాక్‌ అయ్యారు. మళ్లీ రామ్‌ చరణ్‌ తో ఈ సినిమా చేశారు. ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు. అలా కృష్ణతో చేయాల్సిన మగధీర.. రామ్‌చరణ్‌కి వచ్చింది. ఆయన జీవితాన్నే మార్చేసింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి రామ్‌ చరణ్‌ ని స్టార్‌ని చేసింది.

55
పెద్దితో దుమ్ములేపుతున్న చరణ్‌
Image Credit : Asianet News

పెద్దితో దుమ్ములేపుతున్న చరణ్‌

ఇక రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది`లో నటించిన విషయం తెలిసిందే. బుచ్చిబాబుసానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్‌ 4న విడుదలైంది. ఇప్పటి వరకు మూడు వందల కోట్లు రాబట్టింది. ఇందులో చరణ్‌ క్రికెటర్‌గా, కుస్తీ వీరుడిగా, రన్నర్‌గా కనిపించారు. తమ ఊరు గుర్తింపు కోసం ఆయన చేసిన పోరాటమే ఈ మూవీ స్టోరీ. మిశ్రమ స్పందనతో డీసెంట్‌ కలెక్షన్లతో రన్‌ అవుతుంది. అయితే ఓవరాల్‌గా ఇది లాస్‌ ప్రాజెక్ట్ గానే ఉండబోతుందని టాక్‌.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
కృష్ణ ఘట్టమనేని
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image2
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Recommended image3
Tarun - Vadde Naveen: చిరు, బాలయ్య, పవన్ లకు పోటీ ఇచ్చిన కుర్ర హీరోలు.. ఒక్క సినిమాతో పతనం, అసలేం జరిగింది ?
Related Stories
Recommended image1
Balakrishna Wife Background: బాలకృష్ణ భార్య వసుంధర దేవి బ్యాక్‌ గ్రౌండ్‌ తెలిస్తే మతిపోతుంది.. పుట్టుకతోనే ఇంత రిచ్చా?
Recommended image2
Peddi 11 days Collections: వీకెండ్‌లో పెద్ది జోరు.. రామ్‌ చరణ్‌ సినిమా అరుదైన మైల్‌స్టోన్‌.. టోటల్‌ కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved