MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Vishwa : గిన్నెలు కడిగా.. ఆకలితో అలమటించా! ఇప్పుడు రూ. 50 కోట్ల సామ్రాజ్యం.. బిగ్ బాస్ విశ్వ సక్సెస్ స్టోరీ

Vishwa : గిన్నెలు కడిగా.. ఆకలితో అలమటించా! ఇప్పుడు రూ. 50 కోట్ల సామ్రాజ్యం.. బిగ్ బాస్ విశ్వ సక్సెస్ స్టోరీ

Bigg Boss Vishwa : యాక్టర్ విశ్వ కెరీర్‌లో ఎదుర్కొన్న అవమానాలు, ఆర్థిక కష్టాలు సంబంధించిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ గా మారింది. పెద్ది సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న బిగ్ బాస్ విశ్వ జీవితంలోని ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 10 2026, 08:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విశ్వ ఎమోషనల్ జర్నీ చూస్తే కన్నీళ్లు ఆగవు
Image Credit : Instagram/vishwaactor_official

విశ్వ ఎమోషనల్ జర్నీ చూస్తే కన్నీళ్లు ఆగవు

టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్నా రాణించలేక, వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పట్టుదలతో పైకి వచ్చిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో నటుడు విశ్వ ఒకరు. సీరియల్స్ ద్వారా పాపులర్ అయి, బిగ్ బాస్ సీజన్ 5 తో అందరి మనసులు గెలుచుకున్న విశ్వ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవితంలోని చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాడు గిన్నెలు కడిగా.. రేషన్ బియ్యం తిన్నా !
Image Credit : Instagram/vishwaactor_official

నాడు గిన్నెలు కడిగా.. రేషన్ బియ్యం తిన్నా !

విశ్వ సినీ ప్రయాణం సుమారు 24 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. పదో తరగతి పూర్తయిన వెంటనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన, విద్యార్థి వంటి సినిమాల్లో నటించారు. అయితే అదృష్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. తన తండ్రికి వ్యాపారంలో నష్టం రావడంతో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో బ్రతుకు తెరువు కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపినట్లు విశ్వ చెప్పారు. హోటల్‌లో పనివాళ్లు రాకపోతే స్వయంగా గిన్నెలు కడిగిన రోజులు ఉన్నాయనీ, తిండికి కూడా ఇబ్బంది పడి రేషన్ బియ్యం తిన్నామని చెబుతూ ఆయన కళ్ళనీళ్లు పెట్టుకున్నారు.

Related Articles

Related image1
Love song: ఈ పాటకు ఏ అమ్మాయైనా కరిగిపోవాల్సిందే.. ‘సొమ్మసిల్లి పోతున్నవే’ పాట పూర్తి లిరిక్స్ ఇవిగో
Related image2
AI అతిగా వాడుతున్నారా? జ్ఞాపకశక్తి మటాష్.. మీ మెదడుకు ఏం జరుగుతుందో తెలుసా?
35
ఇండస్ట్రీలో తొక్కేశారు.. తమ్ముడిపై ఆధారపడ్డా !
Image Credit : Instagram/vishwaactor_official

ఇండస్ట్రీలో తొక్కేశారు.. తమ్ముడిపై ఆధారపడ్డా !

టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో కొందరు తనను ఎదగకుండా తొక్కేశారని విశ్వ ఆరోపించారు. అవకాశాలు రాకుండా అడ్డుపడటంతో మానసికంగా ఎంతో కుంగిపోయానని, ఆ సమయంలో తన తమ్ముడు అండగా నిలిచాడని చెప్పారు. దాదాపు ఆరు నెలల పాటు తమ్ముడి సంపాదనపైనే తన ఇల్లు గడిచిందని, ఆ రోజులు తన జీవితంలో మర్చిపోలేని పాఠాలని ఆయన అన్నారు. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున ప్రోత్సాహంతో సీరియల్స్ లోకి అడుగుపెట్టిన విశ్వ, బుల్లితెరపై స్టార్ గా ఎదిగినా.. వెండితెరపై తన ముద్ర వేయాలనే కసిని మాత్రం కోల్పోలేదు.

45
బిగ్ బాస్ విశ్వ లవ్ స్టోరీ ఇదే.. టైంపాస్ మెసేజ్ కాస్తా పెళ్లికి దారితీసి
Image Credit : Instagram/vishwaactor_official

బిగ్ బాస్ విశ్వ లవ్ స్టోరీ ఇదే.. టైంపాస్ మెసేజ్ కాస్తా పెళ్లికి దారితీసి

విశ్వ తన భార్య శ్రద్ధతో ఉన్న అనుబంధం గురించి కూడా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సమయంలో శ్రద్ధకు విశ్వ అంటే ఇష్టం ఏర్పడింది. అయితే అప్పటికే ఒక బ్రేకప్ పెయిన్ లో ఉన్న విశ్వ, నిజమైన ప్రేమ ఉండదని నమ్మే స్థితిలో లేరు. మొదట్లో సరదాగా టైంపాస్ చేద్దామని ఫోన్ నంబర్ ఇస్తే, శ్రద్ధ మాత్రం వారం రోజుల్లోనే ప్రపోజ్ చేసిందట. ఆమె తన జీవితంలోకి వచ్చాకే అదృష్టం మారిందనీ, తన కోసం దేవుడు పంపిన ఏంజెల్ శ్రద్ధ అని విశ్వ ఎంతో ప్రేమగా చెప్పుకొచ్చారు.

55
రూ. 50 కోట్ల సామ్రాజ్యం.. పెద్ది తో విశ్వ గ్రాండ్ రీఎంట్రీ
Image Credit : Instagram/vishwaactor_official

రూ. 50 కోట్ల సామ్రాజ్యం.. పెద్ది తో విశ్వ గ్రాండ్ రీఎంట్రీ

యాక్టింగ్ కు కాస్త విరామం ఇచ్చి ఫిట్నెస్ రంగంపై దృష్టి పెట్టిన విశ్వ, ఇప్పుడు 'విశ్వ ఫిట్నెస్ క్లబ్' పేరుతో భారీ జిమ్ నెట్వర్క్ ను ఏర్పాటు చేశారు. దీని విలువ సుమారు 50 కోట్లకు పైనే ఉంటుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'పెద్ది'లో విశ్వ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతో మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ గ్రాండ్ గా మొదలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడితే ఫలితం తప్పకుండా ఉంటుందని విశ్వ జీవితమే ఒక నిదర్శనం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
హైదరాబాద్
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image2
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image3
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Related Stories
Recommended image1
Love song: ఈ పాటకు ఏ అమ్మాయైనా కరిగిపోవాల్సిందే.. ‘సొమ్మసిల్లి పోతున్నవే’ పాట పూర్తి లిరిక్స్ ఇవిగో
Recommended image2
AI అతిగా వాడుతున్నారా? జ్ఞాపకశక్తి మటాష్.. మీ మెదడుకు ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved