- Home
- Entertainment
- చిరంజీవి మేకప్ మిర్రర్ దొంగతనం చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఇన్నాళ్లకు అసలు నిజం చెప్పిన బ్యూటీ
చిరంజీవి మేకప్ మిర్రర్ దొంగతనం చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? ఇన్నాళ్లకు అసలు నిజం చెప్పిన బ్యూటీ
మెగాస్టార్ చిరంజీవి మేకప్ కోసం వాడే మిరర్ ను ఓ హీరోయిన్ దొంగతనం చేసిందని మీకు తెలుసా? ఓ స్టార్ హీరోయిన్ ఆ పని ఎందుకు చేసింది? ఇంతకీ ఎవరా హీరోయిన్?

మెగాస్టార్ చిరంజీవి స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వయంకృష్టితో స్టార్ గా ఎదిగిన చిరు అంటే ప్రాణంగా అభిమానిస్తుంటారు ఫ్యాన్స్. మెగాస్టార్ చిరంజీవికి సామాన్యులతో పాటు సెలబ్రిటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అందులో హీరోలు, హీరోయిన్లు, చిరును ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీకి వచ్చినవారు కూడా ఉన్నారు. ఈక్రమంలో చిరంజీవితో ఎన్నో సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్, ఆయన దగ్గర ఓ వస్తువు దొంగతనం చేసింది. ఆ నిజాన్ని ఆ హీరోయిన్ స్వయంగా వెల్లడించింది.
మెగాస్టార్ చిరంజీవి మేకప్ కిట్ నుంచి మిర్రర్ ను దొంగిలించిన హీరోయిన్ మరెవరో కాదు రంభ. ఈ హీరోయిన్ చిరంజీవితో చాలా సినిమాల్లో నటించింది. మరీ ముఖ్యంగా వీరు నటించిన బావగారు బాగున్నారా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిరంజీవి అంటే రంభకు ప్రత్యేక అభిమానుం ఉండేదట. ఆయనను ఆదర్శంగా తీసుకునేదట. అందుకే మెగాస్టార్ చిరంజీవి గుర్తుగా ఆయన మేకప్ కిట్ లోని మిరర్ ను ఆమె తీసుకుందట.
అయితే డైరెక్ట్ గా రంభ ఈ పని చేయలేదట. తన మేకప్ మెన్ కు, చిరంజీవి మేకప్ మెన్ కు బంధుత్వం ఉండటంతో.. ఓ సారి షూటింగ్ లో మిరర్రస్ మిస్ ప్లేస్ అయ్యాయట. ఇక అప్పటి నుంచి చిరంజీవి మేకప్ మిర్రర్ తన దగ్గరే ఉందట. అది ఇవ్వకుండా లక్కీగా భావించి జాగ్రత్తగా దాచుకుని వాడుకుంటుందట. ఈ విషయాన్ని రంభ గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఏదైనా ఒక సీక్రేట్ చెప్పండి అని యాంకర్ అడిగితే.. ఈ విషయాన్ని చెప్పింది రంభ. నేను ఎప్పుడు ఈ విషయం ఎవరితో చెప్పాలేదు. ఈ విషయం ఇప్పుడు చెపితే నా మీద కేసు పెడతారేమో అని సరదాగా వ్యాఖ్యానించింది. చిరంజీవి గారి మిరర్ ఇది. నేను చాలా జాగ్రత్తగా దాచుకుని వాడుతున్నాను కలర్ పోయినా సరే దాన్ని స్టికర్స్ తో మానేజ్ చేస్తున్నాను. ఇది అంత స్పెషన్ నాకు అని వెల్లడించింది రంభ.
ఇక రంభ పెళ్లి తరువాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఫ్యామిలీతో ఫారెన్ లో సెటిల్ అయ్యింది రంభ. భర్త పిల్లలతో హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇక రీసెంట్ గా ఆమె ఇండియాకు వచ్చి, సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. రంభ రీ ఎంట్రీ ఇస్తే ఎలాంటి పాత్రలు చేస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.