కోటా శ్రీనివాసరావు ఎందుకు ఇలా అయిపోయారు, షాక్ లో అభిమానులు
టాలీవుడ్ దిగ్గజ నటులలో కోటా శ్రీనివాసరావు కూడా ఒకరు. కాని ప్రస్తుతం ఆయన అనారోగ్యంతో ఇంటికే పరిమితం అయ్యారు. ఒకప్పుడు నిండుగా,దర్జాగా కనిపించిన ఈ స్టార్ నటుడు ప్రస్తుతం గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు. కోటా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే?

తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన చేయని పాత్ర లేదు, వేయని వేషం లేదు, చేయని రిస్క్ లేదు. నటనే ఊపిరిగా బ్రతికిన కోటా ఎప్పుడూ నిండు కొండలా ఉండేవారు. కాని తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న కోటా ఫోటోలు చూస్తుంటే ఆయన అభిమానులు బాధపడుతున్నారు.
వందలాది చిత్రాల్లో నటించి తన వినూత్న నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన ఈ దిగ్గజ నటుడు, ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలు , అనారోగ్యం కారణంగా ఇంటికే పరిమితమయ్యారు.
కోట శ్రీనివాసరావు 1978లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ సినిమాల్లో సెటిల్ అయ్యారు కోటా. విలన్, కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, తెలుగు సినిమాలో ఆయన చేయని పాత్ర లేదు. తన పాత్రలతో, నటనతో ఇండస్ట్రీపై చెరగనిముద్ర వేసిన ఆయన, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించి సత్తా చాటారు.
కోటా శ్రీనివాసరావు తన కెరీర్ మొత్తం మీద సుమారు 750కు పైగా చిత్రాల్లో నటించారు. దాదాపు గా ఆయన తొమ్మిది నంది అవార్డులు పొందారు. సినిమాలకే కాదు, రాజకీయాల్లోనూ తన హోదాను చాటిన కోట, 1999–2004 మధ్యకాలంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా సేవలు అందించారు.
2023లో వచ్చిన సువర్ణ సుందరి సినిమాలో నటించిన కోటా.. ఆతరువాత ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కోట శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను బండ్ల గణేష్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ‘కోటా బాబాయ్‌ని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అని ట్వీట్ చేశారు.
ఈ ఫొటోలు వైరల్‌గా మారుతున్న తరుణంలో అభిమానులు, నెటిజన్లు కోట ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫొటోల్లో ఆయన పూర్తిగా బక్కచిక్కిపోయిన పరిస్థితిలో కనిపించడం, పైగా పాదానికి కట్టుతో ఉండటం, పాదాలు కూడా డిఫరెంట్ గా కనిపించడంతో అభిమానులను ఆవేదన చెందుతున్నారు. ఈ తరహా మార్పుతో ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఇప్పటివరకు ఆయన కుటుంబం నుంచి కోటా ఆరోగ్య పరిస్థితికి సబంధించి ఎటువంటి అప్ డేట్ లేదు. కోటా బాగానే ఉన్నారని, ఆయన సన్నిహితులు చెపుతున్నారు. వయసు మీద పడుతుండటంతో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక అభిమానులు మాత్రం కోటా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నారు.