- Home
- Entertainment
- 14 ఏళ్లకే స్టార్ హీరోయిన్, 16 ఏళ్లకు నేషనల్ అవార్డు, 21 ఏళ్లకు దుర్మరణం చెందిన హీరోయిన్ ఎవరో తెలుసా?
14 ఏళ్లకే స్టార్ హీరోయిన్, 16 ఏళ్లకు నేషనల్ అవార్డు, 21 ఏళ్లకు దుర్మరణం చెందిన హీరోయిన్ ఎవరో తెలుసా?
చాలా చిన్న వయస్సులో స్టార్ డమ్ చూసిన హీరోయిన్లు,కెరీర్ పీక్స్ లో ఉండగానే హఠాత్తుగా మరణించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిలో దివ్య భారతి, ప్రత్యూష లాంటి వారు ఉండగా, ఆ కోవలోనే మరో హీరోయిన్ కూడా చిన్న వయస్సులోనే ప్రాణాలు వదిలింది. ఇంతకీ ఎవరా హీరోయిన్?
- FB
- TW
- Linkdin
Follow Us

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందరో స్టార్ హీరోయిన్ల జీవితాలు అర్థాంతరంగా ముగిసిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న తారలు హఠాత్తుగా మరణించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దివ్య భారతి, ప్రత్యూష,మధుబాల లాంటి స్టార్స్ జీవితాలు ఈరకంగానే మధ్యలోనే ముగిశాయి. ఈ కోవలోనే మరో హీరోయిన్ కూడా ఉందని మీకు తెలుసా? 16 ఏళ్లకే హీరోయిన్ గా స్టార్ డమ్ చూసిన ఆమె 21 ఏళ్లకే మరణించింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మోనిషా ఉన్ని.
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అర్థాంతరంగా జీవితం ముగించిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు. వారిలో మలయాళ నటి మోనిషా ఉన్ని ఒకరు. కేవలం 14 ఏళ్ల వయస్సులో సినిమాల్లో అడుగుపెట్టి, 16ఏళ్లకే నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకున్న మోనిషా, 21ఏళ్లకే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
మోనిషా ఉన్ని 1971 జనవరి 24న కేరళలోని కోజికోడ్‌లో జన్మించింది. ఆమె తల్లి శ్రీదేవి ఉన్ని ప్రముఖ మోహినీయాట్టం నర్తకి , తండ్రి నారాయణన్ ఉన్ని బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త. తల్లిదండ్రుల ఏకైక సంతానమైన మోనిషా, చిన్ననాటి నుంచే క్లాసికల్ డాన్స్ పై ఆసక్తి కనబరిచింది. బెంగళూరులోని బిషప్ కాటన్ స్కూల్‌లో చదువు కొనసాగిస్తూ, ఐదేళ్ల వయసులోనే డాన్స్ నేర్చుకుంది.
14 ఏళ్లకే భవయ అనే షార్ట్ ఫిల్మ్‌తో మోనిషా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమె ప్రతిభను గుర్తించిన ఫ్యామిలీ ఫ్రెండ్, దర్శకుడు ఎం.టి. వాసుదేవన్ నాయర్, ఆమెను మలయాళ చిత్రం నక్కక్షతంగల్ లో ప్రధాన పాత్రకు ఎంపిక చేశారు. ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు, 1986లో ఆమెకు ఉత్తమ నటిగా నేషనల్ ఫిల్మ్ అవార్డు దక్కింది. ఇదే ఆమెకు సినీ పరిశ్రమలో స్థిరమైన స్థానం కల్పించింది.
తర్వాత మోనిషా, ప్రియదర్శన్, కమల్, హరిహరన్ వంటి స్టార్ డైరెక్టర్లతో పనిచేసింది. చాలా తక్కువ కాలంలోనే దాదాపు 25 సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించింది. మలయాళంతోపాటు తమిళ సినిమాల్లోనూ ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ‘పూక్కల్ విడుమ్ తుధు’, ‘ద్రవిడన్’, ‘ఉన్నై నేనాచెన్ పట్టు పద్దిచెన్’ వంటి సినిమాల్లో మోనిషా నటనతో ఆకట్టుకుంది.
అయితే, 1992 డిసెంబర్ 5న ఆమె జీవితంలో అతి పెద్ద విషాదం జరిగింది. చెప్పాదివిద్య సినిమా షూటింగ్ సందర్భంగా తల్లి శ్రీదేవి ఉన్నితో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో, కేరళలోని అలప్పుజ జిల్లాలోని చేర్‌తల సమీపంలో వారికారు KSRTC బస్సును ఢీకొట్టింది. వెనుక సీటులో విశ్రాంతి తీసుకుంటున్న మోనిషాకు తీవ్ర గాయాలవడంతో ఆమెను వెంటనే KVM ఆసుపత్రికి తరలించారు. కాని అప్పటికే ఆమె మరణించింది. ప్రమాదంలో తల్లి శ్రీదేవి ఉన్ని మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
మోనిషా మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించగా, ఆమె అభిమానులు పెద్ద సంఖ్యలో ఆమెను చివరిసారిగా చూసేందుకు తరలివచ్చారు. చిన్న వయస్సులోనే అత్యుత్తమ నటి అవార్డు అందుకుని, స్టార్ గా ఎదిగి.. కెరీర్ పీక్స్ లో ఉండగానే మోనిషా ఈ లోకాన్ని విడిచిపోవడం ఆమె అభిమానులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.