రచయితగా మారిన రామ్ పోతినేని, తన సినిమా కోసం పాట రాసుకున్న యంగ్ హీరో
సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాడు ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని. ఎన్ని ప్రయత్నాలు చేసినా అనుకున్నది మాత్రం సాధించలేకపోతున్నాడు. ఇక తాజాగా తన సినిమా కోసం కొత్త అవతారం ఎత్తాడు రామ్.
- FB
- TW
- Linkdin
Follow Us

టాలీవుడ్ యంగ్ స్టార్ రామ్ పోతినేని సరైన హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. డిఫరెంట్ జానర్స్ ను టచ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒకప్పుడు చాక్లెట్ బాయ్ గా ఉన్న రామ్.. ఆతరువాత మాస్ ఇమేజ్ కోసం తెగ ప్రయత్నం చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ వచ్చినట్టే అనిపించినా.. ఆతరువాత చేసిన సినిమాలన్నీ ప్లాప్ అవుతూ రావడంతో రామ్ కెరీర్ డేంజర్ లో పడింది. ఆకరికి బోయపాటి శ్రీను లాంటి ఊరమాస్ దర్శకులు కూడా రామ్ కు మాస్ హిట్ ఇవ్వలేకపోయారు.
ఇక ఆతరువాత గెటప్ మార్చి మరో జానర్ లోకి జంప్ అయ్యాడు రామ్. కాస్త సాప్ట్ సబ్జెక్ట్స్ చేయడం స్టార్ట్ చేశాడు. కాని అవి కూడా రామ్ కు పెద్దగా కలిసి రాడంలేదు. ఇక తాజాగా రామ్ కొత్త అవతారం ఎత్తాడు. వెండితెరపై తన నటనతో అలరించడమే కాకుండా, ఇప్పుడు గేయ రచయితగా అవతారం ఎత్తాడు యంగ్ హీరో. ప్రస్తుతం రామ్ ఆంధ్ర కింగ్ తాలుకా సినిమా చేస్తున్నాడు. ఈసినిమా లోని తొలి పాటకు ఆయనే స్వయంగా సాహిత్యం అందించారు. ఈ పాట జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రామ్ పోతినేని తన కెరీర్‌లో తొలిసారిగా ఒక పాటకు లిరిక్స్ అందించారు. "నా కల నిజమాయే" అనే పల్లవితో మొదలయ్యే ఈ సాంగ్ కోసం రామ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ పాటకు వివేక్-మెర్విన్ కాంబో సంగీతం అందించగా, యంగ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన అద్భుత గాత్రంతో ఆలపించారు. ఈ కలయిక సినీ అభిమానుల్లో ఇప్పటికే భారీగా అంచనాలను పెంచింది.
ఇక ఈ పాట రాయడం గురించి రామ్ కూడా స్పందించారు. తన తొలి పాట గురించి రామ్ పోతినేని మాట్లాడుతూ, "ఈ పాట నా హృదయంలో నుంచి వచ్చింది. వివేక్-మెర్విన్ అందించిన అద్భుతమైన ట్యూన్ నన్ను పాట రాయడానికి ప్రేరేపించింది. నా మనసులో ఉన్న భావాలను అక్షర రూపంలో పెట్టగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నా అభిమానులకు ఈ పాట తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను" అని అన్నారు.
'ఆంధ్ర కింగ్ తాలుకా' ఈసినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటివరకూ చాలా బయోపిక్ సినిమాలు వచ్చాయి. అందరు స్టార్లు, ఏదో ఒకకటి సమాజంలో సాధించినవారి సినిమాలు వచ్చాయి. కాని ఫస్ట్ టైమ్ ఒక అభిమాని బయోపిక్ ని ఈసినిమా ద్వారా తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో రామ్ పోతినేని సాగర్ అనే ఒక వీరాభిమాని పాత్రలో నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇక ఈసినిమాలో నటిస్తుండగానే రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సేపై డేటింగ్ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతన్నారని రకరకాల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇక ఈ విషయంలో నిజం లేదని భాగ్యశ్రీ ఓ సందర్భంలో క్లారిటీ కూడా ఇచ్చారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. హైదరాబాద్‌లోని ప్రముఖ లొకేషన్లలో రొమాంటిక్ సీన్స్ ను షూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈసినిమాకు చాలా ముఖ్యమైన క్లైమాక్స్ సీన్ కూడా షూటింగ్ లో ఉందని సమాచారం.
రామ్ పోతినేని పాట రాయడంతో ఆయన ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. తమ అభిమాన హీరో మల్టీ టాలెంట్ చూపిస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ఈసారైనా 'ఆంధ్ర కింగ్ తాలుకా' సినిమాతో రామ్ హిట్ కొడతాడేమ్ అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్.
ఈ సినిమా హిట్ అయితే రామ్ హీరోగా మాత్రమే కాదు రచయితగా కూడా కొత్త జీవితం స్టార్ట్ చేయాలంటున్నారు ఫ్యాన్స్. ఇక ఈసినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాట విడుదలయ్యాక, రామ్ పాటల రచయితగా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.