- Home
- Entertainment
- కృష్ణ , రామానాయుడు మధ్య విభేదాల వల్ల వెంకటేష్ హీరో అయ్యాడా? స్టార్ ప్రొడ్యూసర్ చెప్పిన రహస్యం ?
కృష్ణ , రామానాయుడు మధ్య విభేదాల వల్ల వెంకటేష్ హీరో అయ్యాడా? స్టార్ ప్రొడ్యూసర్ చెప్పిన రహస్యం ?
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో వెంకటేష్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారో తెలుసా? కృష్ణ వల్ల వెంకటేష్ హీరోగా అయ్యాడా? రామానాయుడు చెప్పిన రహస్యం ఏంటి?

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనీ దాదాపు 20 ఏళ్లు స్టార్ హీరోలుగా నాన్ స్టాప్ గా ఏలారు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగర్జున. ఈ నలుగురు హీరోలు టాలీవుడ్ కు నాలుగు స్థంబాల్లా నిలబడ్డారు. ఎవరి ఫ్యాన్ ఫాలోయింగ్ వారిది. ఎవరి సినిమాలు వారివి, ఎవరి జానర్ వారిది అందులో చిరంజీవి, బాలయ్యకు మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. నాగార్జునకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువ, ఇక వెంకటేష్ లిస్ట్ లో మాత్రం అందరు ఫ్యామిలీ ఆడియన్స్ ఉండేవారు.
వెంకటేష్ సినిమా అంటే చాలు కుటుంబం అంతా కలిసి వెళ్లి చూసేలా ఉండేవి. ఆయన తీసుకునే కథలు కూడా ఎక్కువగా సెంటిమెంట్, ఎమెషనల్ కంటెంట్ కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. అంతే కాదు అవే ఎక్కువగా సక్సెస్ అయ్యేవి కూడా. అందుకే వెంకటేష్ యూత్ ఆడియన్స్ తో పాటు ఎక్కువగా ప్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యారు. ఇక విక్టరీ స్టార్ గా పేరు తెచ్చుకున్న వెంకీ ఇండస్ట్రీలోకి రావడం చాలా విచిత్రంగా జరిగింది. చదువుకుంటున్న రోజుల్లోనే సడెన్ గా హీరోగా ఎంట్రీ ఇచ్చారు వెంకటేష్.
వెంకటేష్ కూడా హీరో అవుతానని అనుకోలేదట. ఆయన కూడా అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చారట. వెంకటేష్ హీరోగా నటించిన ఫస్ట్ మూవీ కలియుగపాండవులు. ఈసినిమా వెంకటేష్ కోసం రాసుకున్నది కాదు. అసలు ఈసినిమాను సూపర్ స్టార్ కృష్ణ కోసం అనుకున్నారట రామానాయుడు. ఆయనకు కథ చెప్పి సినిమా కూడా చేయాలని అనుకున్నారట. కాని కృష్ణ రామనాయుడికి కాల్షీట్లు ఇవ్వనన్నారట. వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, కృష్ణ మాత్రం కలియుగ పాండవులు సినిమా చేయనని చెప్పారట.
ఇక దాంతో రామానాయుడు పట్టుదలకు పోయి.. అప్పటికే ఫారెన్ లో చదువుకుంటున్న వెంకటేష్ ను పిలిచి, అతను హీరోగా కలియుగపాండవులు మొదలు పెట్టారట. ఈసినిమాతోనే తమిళ హీరోయిన్ ఖుష్బు తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ఇక వెంకటేష్ హీరోగా నటించిన ఫస్ట్ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. వెంకీ ఇండస్ట్రీలో పాతుకుపోయారు. అంతే కాదు ఈసినిమా 100 రోజులు ఆడింది. 100 రోజుల వేడుకలకు కృష్ణను ముఖ్యఅతిథిగా పిలచారు రామనాయుడు.
ఈ విషయాన్ని గతంలో రామానాయుడు జయప్రదం కార్యక్రమంలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. కృష్ణగారికి కోపం ఎక్కువే కాని.. అప్పటికప్పుడు మాటలు అనేస్తాడు, వదిలేస్తాడు. ఆతరువాత మనసులో ఏం పెట్టుకోకుండా మంచిగా మాట్లాడుతాడు. కలియుగ పాండవులు సినిమా 100 డేస్ ఫక్షన్ కు వచ్చినప్పుడు ఆయన సరదాగా మాట్లాడాడు అని అన్నారు.
కృష్ణ మైక్ తీసుకుని వెంకటేష్ హీరో అవ్వడానికి కారణం నేనే, నేను ఈ సినిమా చేయలేదు కాబట్టి రామనాయుడు గారు తన కొడుకుని హీరోగా ఈ కథతో పరిచయం చేశాడు. నేను ఈ సినిమాకు కాల్షీట్లు ఇచ్చుంటే వెంకటేష్ ఇంకా చదువుకుంటూనే ఉండేవాడు అంటూ సరదా కామెంట్లు చేశారు. అలా వెంకటేష్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారని దివంగత స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు గత ఇంటర్వ్యూలలో వెల్లడించారు.

