- Home
- Entertainment
- 20 కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టను, స్టార్ నటుడి సంచలన కామెంట్స్ ఎవరతను?
20 కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టను, స్టార్ నటుడి సంచలన కామెంట్స్ ఎవరతను?
బిగ్ బాస్ రియాల్టీషోలో పాల్గొనడం చాలామంది నటీనటుల కల, కాని కొంత మంది బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ చూపించరు, వెళ్లడానికి ఇష్టపడరు. అలాగే ఓ స్టార్ నటుడు కూడా బిగ్ బాస్ అవకాశం రాగా.. 20 కోట్లు ఇచ్చినా వెళ్లనంటున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ యాక్టర్.

బిగ్ బాస్ రియాలిటీ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు. బిగ్ బాస్ హిందీ సీజన్ 19 ప్రారంభానికి ముందు ఆయన పేరును కంటెస్టెంట్ల జాబితాలో చేర్చారు అనే వార్తలపై స్పందిస్తూ, ‘‘ఎంత డబ్బు ఇచ్చినా ఈ షోలో పాల్గొనను’’ అంటూ స్పష్టంగా వెల్లడించారు. అతని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా స్టార్ నటుడు.
బిగ్ బాస్ గా బిగ్ బ్రదర్ షో
బిగ్ బాస్ ఇండియన్ షో కాదు. డచ్ లో బాగా ఫేమస్ అయిన రియాలిటీ షో ఇది. అక్కడ "బిగ్ బ్రదర్" పాపులర్ అయిన రియాల్టీ షో ఆధారంగా ఇండియాలో "బిగ్ బాస్" షోను పరిచయం చేశారు. మొదటగా హిందీ భాషలో 2006లో బిగ్ బాస్ ను ప్రారంభించారు. మొదటి సీజన్‌కు అర్షద్ వార్సి హోస్ట్‌గా వ్యవహరించారు. ఆతరువాత శిల్పా శెట్టి, సంజయ్ దత్, అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులు ఈ షోను హోస్ట్ చేశారు. కానీ సల్మాన్ ఖాన్ 2010లో సీజన్ 4 నుంచి రెగ్యులర్‌గా హోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ హిందీలో ఇప్పటి వరకు 18 సీజన్లు పూర్తయ్యాయి.
5 భాషల్లో బిగ్ బాస్ షో
ఈ షోకు ఇండియా అంతటా విశేష ప్రజాదరణ ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ షో ప్రసారం అవుతోంది. కానీ పలు సందర్భాల్లో ఈ షోపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సంస్కృతిని తాకట్టు పెడుతున్నారన్న ఆరోపణలతో పాటు, కంటెస్టెంట్లను నెగటివ్‌గా చూపిస్తున్నారని పలు విమర్శలు ఉన్నాయి. అంతే కాదు కొన్ని భాషల్లో ఈ షోను బాన్ చేయాలని ఉద్యమాలు కూడా చేశారు.
బిగ్ బాస్ లో అడుగుపెట్టనన్న స్టార్ నటుడు
బిగ్ బాస్ హిందీ 18 సీజన్లు కంప్లీట్ చేసుకుని త్వరలో 19వ సీజన్ స్టార్ట్ అవ్వబోతోంది. ఈక్రమంలో ఈ షోలో పాల్గొనబోతున్నారంటూ పలువురి లిస్ట్ బయటకు వచ్చింది. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ నటుడు రామ్ కపూర్ పేరు కూడా వినిపించింది. దాంతో ఈ విషయంలో ఆయన స్పందించారు.
తాజాగా రామ్ కపూర్ ఈ షోపై సంచలన కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ పై తన స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ "బిగ్ బాస్ హిందీ సీజన్ 19లో నేను పాల్గొనబోతున్నా అని వస్తున్న వార్తల్లో నిజం లేదు. నాకు 20 కోట్లు ఆఫర్ చేసినా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళను. అది నా వ్యక్తిగత నిర్ణయం. నేను బిగ్ బాస్ షోను ద్వేషించను. అది సక్సెస్ ఫుల్ రియాలిటీ షో అన్నారు.
రామ్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ రియాల్టీషో నా మనస్తత్వానికి సరిపడదు. నేను నటుడిని, నటుడిగా నేను ప్రేక్షకులను అలరిస్తాను. రియాలిటీ షోల ద్వారా నా టాలెంట్ బయటకు రాదు," అంటూ రామ్ కపూర్ వ్యాఖ్యానించారు.రామ్ కపూర్ వ్యాఖ్యలు బిగ్ బాస్ మీద చర్చను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చాయి. సోషల్ మీడియాలో పలువురు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తుండగా, మరికొందరు ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 19కి ఎప్పుడు
రీసెంట్ గా అన్ని భాషల్లో బిగ్ బాస్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగుతో పాటు హిందీ సీజన్ 19 ప్రోమోలు రిలీజ్ అయ్యాయి. హిందీ బిగ్ బాస్ ను ఆగస్టులో స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ షోపై అధికారిక ప్రకటన వెలువడింది. షో ప్రారంభానికి ముందే పలువురు సెలెబ్రిటీల పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే రామ్ కపూర్ పేరు బయటకు రాగా.. ఆయన ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు.
బిగ్ బాస్ షోపై సానుకూలతలతో పాటు విపరీతమైన విమర్శలు కూడా వస్తుండటం వల్ల, కొన్ని ప్రముఖులు ఇంకా ఈ షోకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా కెరీర్ ఇమేజ్ మీద ప్రభావం ఉంటుందనే ఉద్దేశంతోనే కొందరు ఇటువంటి రియాలిటీ షోలలో పాల్గొనకుండా వెనక్కి తగ్గుతున్నట్టు భావిస్తున్నారు.రామ్ కపూర్ వ్యాఖ్యల నేపథ్యంలో, ఈ సీజన్‌లో పాల్గొనబోయే ఇతర సెలెబ్రిటీ కంటెస్టెంట్ల జాబితాపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ ప్రోమో
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రోమో కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈసారి సీజన్ ను కూడా కింగ్ నాగార్జుననే హోస్టింగ్ చేయబోతున్నారు. సీజన్ 3 నుంచి నాగార్జున బిగ్ బాస్ తెలుగు రియాల్టీషోన్ హోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ కు సబంధించి రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎవరికి నచ్చిన పేర్లతో వారు సోషల్ మీడియాలో లిస్ట్ లను రిలీజ్ చేస్తున్నారు. ఈసారి పలువురు సెలబ్రిటీలు బిగ్ బాస్ తెలుగులో సందడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.