రాజకీయాల్లోకి కీర్తి సురేష్, ఎమ్మెల్యేగా పోటీ, స్టార్ హీరో పార్టీలో చేరబోతుందా?
సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోందా? ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయబోతుందా? ఇంతకీ ఆమె ఏ పార్టీలో చేరబోతుంది. ఏ రాష్ట్రంలో పోటీ చేయబోతోంది. అసలు ఇందులో నిజం ఎంత?

కీర్తి సురేష్.. హీరోయిన్ గా ఆమె జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి పాత్రఅయినా అలవోకగా చేయగల హీరోయిన్. ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా మారిన అతి తక్కువమంది నటీమణుల్లో కీర్తి సురేష్ ఒకరు. కీర్తి సురేష్ వారసత్వంగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చినా తన సొంత టాలెంట్ తో ఎదిగి చూపించారు. మలయాళం లో బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన కీర్తి సురేష్. ఆ తరువాత హీరోయిన్ గా కూడా ఫస్ట్ మూవీ నుంచే తన మార్క్ ని చూపించింది.
డిఫరెంట్ స్టోరీస్ ను సెలక్ట్ చేసుకుని సినిమాలు చేసిన ఈ హీరోయిన్ గెలుపోటములు లెక్క చేయలేదు. నేచురల్ పర్పామెన్స్ తో ఆడియన్స్ మనసుల్లో చెరగనిస్థానం సంపాదించుకుంది కీర్తి సురేష్. ఒక టైమ్ లో వరుస డిజాస్టర్స్ కీర్తిని పలకరించినా.. ఏమాత్రం తగ్గలేదు.
మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో అద్భుతంగా జీవించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకున్న కీర్తీ సురేష్.. ఈసినిమా తరువాత కొంత కాలానికి కమర్షియల్ హీరోయిన్ గా టర్న్ అయ్యి, మహేష్ బాబు లాంటి హీరోల సరసన హిట్ సినిమాలు చేసింది. మహానటి మారిపోయింది అన్న విమర్శలు కూడా ఫేస్ చేసింది మలయాళ బ్యూటీ.
ఇక ప్రస్తుతం తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకుని.. అటు ఫ్యామిలీ లైఫ్ ను.. ఇటు ఫిల్మ్ కెరీర్ ను బ్యాలెన్స్ చేస్తూ వస్తోంది కీర్తి సురేష్. రీసెంట్ గానే ఆమె కమెడియన్ కమ్ హీరో సుహాస్ తో కలిసి ‘ఉప్పుకప్పురంబు’ అనే అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ మూవీ లో నటించింది. ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే కీర్తి సురేష్ కు సబంధించిన ఓ విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది ఈ రూమర్.
త్వరలో కీర్తి సురేష్ రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతోందన్న వార్త వైరల్ అవుతోంది. తమిళనాడు నుంచి ఆమె పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందని సమాచారం. రీసెంట్ గా కీర్తి సురేష్ మధురైలోని ఒక ఈవెంట్ కి ముఖ్య అతిథి గా వెళ్లింది. ఈ ఈవెంట్ కి హాజరైన అభిమానులు కీర్తి కనిపించిన వెంటనే TVK అని అరవడం మొదలు పెట్టారు.
TVK అంటే తమిళ స్టార్ హీరో హీరో విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ . ఇలా ఒక్కసారిగా ఆమెని చూడగానే అందరూ ఈ పార్టీ పేరు ఎత్తడం తో, వచ్చే ఏడాది తమిళనాడు లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మధురై స్థానం నుండి కీర్తి సురేష్ పోటీ చేస్తుందేమో అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
అయితే అక్కడికి వచ్చిన వారు TVK అని అరవడానికి మరో కారణం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కీర్తి సురేష్ కి తమిళ హీరో విజయ్ అంటే వీరాభిమానం. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పింది. అంతే కాదు వీళ్లిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు కూడా వచ్చాయి. ఆ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, వీళ్లిద్దరు డేటింగ్ చేసుకుంటున్నారంటూ సోషల్ మీడియా లో రకరకాలుగా ప్రచారం కూడా జరిగింది. ఇక కీర్తి సురేష్ పెళ్లి జరిగిపోవడంతో ఆ రూమర్స్ కు చెక్ పడింది. ఈక్రమంలో కావాలని కీర్తి సురేష్ ను ఆటపట్టించడానికి ఇలా టీవీకే నినాదాలు చేశారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే కీర్తి సురేష్ పాలిటిక్స్ లో వచ్చే అకాశం కూడా లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు. ఆమె విజయ్ పార్టీలో చేరి, మధురై నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఈ విషయంలో అటు సోషల్ మీడియాలో, ఇటు ఫ్యాన్స్ మధ్య కూడా చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ రూమర్ ను కీర్తి సురేష్ నిజం చేస్తారా? నిజంగా రాజకీయాల్లోకి వస్తారా? లేక సినిమా కెరీర్ మాత్రమే చూసుకుంటారా అనేది చూడాలి. కీర్తి భర్తకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఒక దశలో కీర్తి ఆ విషయంలో తన భర్తకు సాయం చేస్తుందని, అందుకే సినిమాలు కూడా తగ్గించుకుందని కూడా అన్నారు. మరి ఆమె ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

