- Home
- Entertainment
- `గేమ్ ఛేంజర్` ఫెయిల్యూర్‌పై ఆర్జీవీ జెన్యూన్ రివ్యూ.. శంకర్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు?
`గేమ్ ఛేంజర్` ఫెయిల్యూర్‌పై ఆర్జీవీ జెన్యూన్ రివ్యూ.. శంకర్ ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాడు?
రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` సినిమాపై రామ్‌గోపాల్‌వర్మ తన మార్క్ రివ్యూ ఇచ్చారు. శంకర్ ఏం మిస్ చేశాడో బోల్డ్ గా చెప్పేశాడు.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన `గేమ్ ఛేంజర్` మూవీ సంక్రాంతికి విడుదలై బోల్తా కొట్టింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. పైగా దీనిపై విపరీతమైన నెగటివ్ ట్రోల్స్ సినిమాని డ్యామేజ్ చేశాయి. ఇదీ కాదని, హెచ్ డీ ప్రింట్ లీక్ చేయడం సినిమాని నాశనం చేశాయి. ఇవన్నీ `గేమ్ ఛేంజర్` సినిమాని చంపేశాయి.
అయితే సినిమా జనాలను ఆకట్టుకోలేకపోవడానికి, ఆడియెన్స్ ఎగ్జైట్ కాకపోవడానికి అసలు కారణం ఏంటో చెప్పాడు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. `శివ`, `సత్య`, `క్షణక్షణం` వంటి ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ చేసిన ఆయన ఇటీవల నాసిరకమైన చిత్రాలతో కెరీర్‌ని లాక్కొస్తున్నారు. దర్శకుడిగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇటీవల తాను తీసిన `సత్య` మూవీ చూసుకున్న ఆయన ఎమోషనల్ అయ్యాడు. తాను ఇలాంటి సినిమాలు చేస్తున్నానా? అని రియలైజ్ అయ్యాడు.
ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, `గేమ్ ఛేంజర్` ఫెయిల్యూర్‌కి అసలు కారణం ఏంటో తెలిపారు. ఓ లాజికల్ పాయింట్ ని ఆయన చర్చించారు. శంకర్ రూపొందించిన సినిమాల్లో ఏదో ఒక బలమైన పాయింట్ ఉంటుంది. వాటి చుట్టూ కథ నడిపిస్తాడు. `ఒకే ఒక్కడు`లో ఒక్క రోజు సీఎం అవ్వడమనే పాయింట్ అప్పట్లో చాలా క్రేజీగా ఉండేది. ఆడియెన్స్ కి సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్‌గా ఉంది. అందుకే అది ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.
అలాగే `రోబో` సినిమాలో రోబో అనేది కొత్త పాయింట్. పైగా అందులోనూ రోబోకి లవ్ పుడితే ఎలా ఉంటుందనేది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. దాని కోసం జనం ఎగబడి చూశారు. కానీ `గేమ్ ఛేంజర్`లో అలాంటి పాయింట్ లేదు. శంకర్ బలమైన సీడ్ వేయలేదు. బలమైన పునాది లేకపోతే ఏదైనా ఎప్పుడు కూలుతుందో అర్థం కాదు, `గేమ్ ఛేంజర్` విషయంలో కూడా అదే జరిగింది. బలమైన సీడ్ ని వేయడంలో విఫలమయ్యారు. ఇందులో చెప్పాలనుకున్న పాయింట్ ఏంటనేది క్లారిటీ లేదు. అదే బిగ్ మైనస్ అన్నారు రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఆయన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు బెస్ట్ ఫిల్మ్ మేకరే కాదు, బెస్ట్ ఎనలిస్ట్ కూడా. ఇప్పుడు ఆయన దర్శకుడిగా సక్సెస్ కాలేకపోతున్నాడు, కానీ ఆయనలో మాత్రం మంచి క్రిటిక్ ఉన్నాడనేది నిజం. ఇక ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ తన మార్క్ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఇప్పుడు `సిండికేట్` అనే సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇందులో అమితాబ్ బచ్చన్, జేడీ చక్రవర్తి, నాగార్జున, మోహన్ లాల్, అజయ్ దేవగన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. వీరితోపాటు మరో స్టార్ హీరో కూడా ఉంటారని సమాచారం. ఈ మూవీని ప్రకటిస్తూ, `అత్యంత భయంకరమైన జంతువు ఒక్క మనిషి మాత్రమే` అనే పాయింట్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించారు.
`70 దశకంలో ఉండే వీధి రౌడీలు అనంతరం రాజకీయాలను వృత్తిగా చేపట్టడంతో కనుమరుగయ్యారు. బంగారం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల స్మగ్లర్లు ఆర్థిక సంస్కరణ వల్ల ఆ వృత్తిని వదిలేశారు. ముంబయి డీ కంపెనీ, ఆల్‌ఖైదా వంటి టెర్రరిస్ట్ సంస్థలు పతనావస్థకు చేరాయి. వీరందరికి కంటే ప్రమాదకరంగా ఇప్పుడు ‘సిండికేట్’ రాబోతున్నదని వర్మ తెలిపారు. మరి ఈ మూవీతోనైనా తాను కమ్ బ్యాక్ అవుతాడా? పూర్వ వైభవం పొందుతాడా? అనేది చూడాలి.
read more: చరిత్రలో ఎప్పుడూ ఇలా లేదు.. పూనకాలు చెప్పించేలా చిరంజీవి చిత్రాల లైనప్