రష్మిక ప్యాన్ ఇండియా ఇమేజ్ వెనక షాకిచ్చే నిజాలు
తెలుగు నుంచి ప్యాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిన రష్మిక మందనా అతి తక్కువ సమయంలోనే నార్త్ ఇండియాని ఊపుతోంది. ఆమె స్టార్‌డమ్ వెనుక ఉన్న కారణాలు, ఆమె ప్రయాణం, విజయ రహస్యాలు ఇక్కడ ఉన్నాయి.

రష్మిక ఈ రోజు ప్యాన్ ఇండియా స్టార్. ఈ స్దాయి పాపులారిటీని అతి తక్కువ సమయంలో సంపాదించడమంటే మాటలు కాదు. ఎంతో కృషి,పట్టుదల, అదృష్టం ఈ మూడు కలిసి పరుగెట్టినప్పుడే అది సాధ్యమవుతుంది. అందులోనూ ఆమె సౌతిండియా నుంచి వెళ్లి మరీ నార్త్ ఇండియాని ఊపుతోంది.
తెలుగు నుంచి ప్యాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది ఎవరు అంటే చాలామందికి రష్మిక మందనా పేరే ముందుగా గుర్తు వచ్చే స్దాయికి ఎదిగింది. తన అప్‌కమింగ్ సినిమాల లైనప్ చూస్తుంటే ఈ విషయం మనకు క్లారిటీగా అర్దమవుతుంది. అయితే రష్మిక తను ప్యాన్ ఇండియా హీరోయిన్ అవటానికి గల కారణాలు ఏమిటి. తెలుగు, తమిళ, హిందీ.. ఇలా దాదాపు అన్ని భాషల్లో పెద్ద పెద్ద స్టార్లతో జోడీకట్టే స్దాయి వెనక ఆమెకు కలిసొచ్చిన అంశాలేమిటి చూద్దాం.
1. స్టార్ పవర్‌తో కూడిన పక్కింటి అమ్మాయి ఇమేజ్
రష్మిక కు బాగా ప్లాస్ అయ్యింది ఆమె ఆన్-స్క్రీన్ బిహేవియర్. అదే ఆమెను "నేషనల్ క్రష్"గా మార్చింది. ముఖ్యంగా ఆమె మొహంపై ఎప్పుడూ వెలిగిపోతూండే చిరునవ్వు, అదే సమయంలో ఎలాంటి ఎమోషన్ అయినా తడబాటు లేకుండా తెరపై ప్రదర్శించటం కలిసొచ్చింది.
కిరిక్ పార్టీలో ఆమె అరంగేట్రం నుండి పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్స్‌లో ఆమె పాత్రల వరకు, ఆమె చేసిన నటన అన్ని వయసుల ప్రేక్షకులతో కలిసి ప్రయాణించాయి. వ్యక్తిగత జీవితంలో ఎదురుదెబ్బలు, డేటింగ్ రూమర్లు, పెళ్లికబుర్లు, ట్రోలింగ్‌లు, డీప్ ఫేక్ వీడియోలు ఇవేవీ రష్మిక కమిట్‌మెంట్‌ను దెబ్బతీయలేవు..
2. పాన్-ఇండియన్ అప్పీల్
ఒక చోటే ఆగిపోకుండా, ప్రాంతీయ అడ్డంకులను బద్దలు కొట్టి, రష్మిక ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి ధైర్యంగా ప్రవేశించింది. అందుకు ఆమె చదువుకున్న ఆంగ్ల సాహిత్యం, జర్నలిజం, మనస్తత్వశాస్త్రంలో డిగ్రీలు కలిసొచ్చాయి.
రష్మిక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి అవ్వటం, తల్లిదండ్రులు ఆర్థికంగా కష్టపడటం చూసి ఎదగాలనే పట్టుదల పెట్టుకుని ప్యాన్ ఇండియా మార్కెట్ ని కష్టంతో అథిగమించింది. .అద్దె కట్టడానికి కూడా డబ్బు లేని పరిస్థితిని కూడా చూసిన ఆమె దూసుకుపోతోంది.
3. రకరకాల పాత్రలు, ప్రయోగాలు
రష్మిక తన పాత్రలతో ప్రయోగాలు చేయడానికి భయపడదు. బబ్లీ, రొమాంటిక్ లీడ్స్ నుండి పవర్ ఫుల్ లేయర్డ్ పెర్ఫార్మెన్స్‌లను అందించడం వరకు, ఆమె తన పాత్రలకు డెప్త్ ను తెస్తుంది. పుష్పలో ఆమె శ్రీవల్లి పాత్ర పోషించిన ఆమె ఒక పవర్‌హౌస్ నటిగా, విమర్శకుల ప్రశంసలు మరియు భారీ అభిమానులను సంపాదించుకుంది.
కన్నడ, తెలుగు, తమిళం, హిందీ లలో పుష్ప: ది రైజ్ , యానిమల్ వంటి సినిమాలలో హై-ఆక్టేన్ డ్రామాలలో ఆమె ఏంటి అనేది చూపించాయి. అదే సమయంలో ఆమె చేస్తున్న బాలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఆమెకు అక్కడ మార్కెట్ ని విస్తృతం చేస్తున్నాయి.
4. అద్బుతమైన వర్క్ కల్చర్, ఎథిక్స్, సోషల్ మీడియా
తన యాక్టింగ్ స్టయిల్, స్మైల్, ఆన్-స్క్రీన్ లుక్స్, మెస్మరైజింగ్ లుక్స్‌తో పాన్-ఇండియా స్టార్‌గా లక్షలాదిమంది అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కర్ణాటకలో పుట్టిపెరడంతో 2016లో కన్నడ మూవీతో "కిరిక్ పార్టీ" , తెరంగేట్రం చేసింది. తొలి సినిమాలనే సూపర్‌హిట్ అయింది. 20 ఏళ్లకే నటిగా మారిన రష్మిక అదృష్టం వరించింది.
ఈ మూవీ బడ్జెట్ రూ.4 కోట్లు కాగా బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్ల బిజినెస్ చేసింది. అందం, అభినయానికి , పట్టుదల, కృషిని జోడించింది. అలా టాలీవుడ్‌కి పరిశ్రమను ఆకర్షించింది. అలాగే రష్మిక ఆఫ్-స్క్రీన్ లో తన క్రాఫ్ట్ పట్ల అంకితభావం, సోషల్ మీడియాలో ఆమె ప్రవర్తన అభిమానులకు ఆకర్షిస్తున్నాయి. ఆమె తరచుగా తెరవెనుక జరిగే క్షణాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది, అభిమానులతో మాట్లాడుతుంది తనకు వారిలో ఓ సానుకూలతను వ్యాప్తి చేస్తుంది.
5. కొత్త తరంకు తగ్గట్లుగా ఫ్యాషన్స్, ట్రెండ్‌సెట్టర్
రష్మిక ఫ్యాషన్ , లైఫ్ స్టైల్ ఐకాన్ గా తనను తాను మార్చుకుంది. ఆమె యువ ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తుంది. 2018 లో "ఛలో" తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. కిల్లర్ లుక్స్‌తో ఇటు యూత్ ఐకాన్‌గా, అటు దర్శక నిర్మతాల బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
సమంతా సినిమా తిరస్కరించడంతో. రష్మిక మందన్నకు అదృష్టం వరించింది. ఇక ఆ తరువాత "డియర్ కామ్రేడ్", గీత గోవిందం" వంటి చిత్రాలలో తన అద్భుతమైన నటనతో రష్మిక అగ్ర నటిగా నిలదొక్కుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. రష్మిక ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్ లు స్వీకరిస్తూ, తన నటనతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నందున, ఆమె ప్రయాణం ఎవరూ ఆపలేనిదిగా కనిపిస్తోంది.