MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Peddi Trailer: రామ్ చరణ్ కోసం రంగంలోకి స్టార్ క్రికెటర్, భారీ స్థాయిలో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్, ఎక్కడంటే?

Peddi Trailer: రామ్ చరణ్ కోసం రంగంలోకి స్టార్ క్రికెటర్, భారీ స్థాయిలో పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్, ఎక్కడంటే?

రామ్ చరణ్ పెద్ది కోసం భారీగా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్..వచ్చే నెలలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోన్న ఈ మూవి ప్రీరిలీజ్ ను ఎక్కడ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధి ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 10 2026, 12:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెద్ద సినిమాపై భారీ అంచనాలు
Image Credit : X

పెద్ద సినిమాపై భారీ అంచనాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ పెద్ది పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రెండుసార్లు పోస్ట్ పోన్ అయిన తరువాత ఫైనల్ గా.. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాకు సబంధించిన ప్రమోషనల్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా పహిల్వాన్ గెటప్ లో రామ్ చరణ్ ను చూసి అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి’ పాట రిలీజ్ అయ్యి క్రేజ్ మరింత పెరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చికిరి పాటకు భారీ స్థాయిలో స్పందన..
Image Credit : MythriMovieMakers\Twitter

చికిరి పాటకు భారీ స్థాయిలో స్పందన..

చికిరి చికిరి’ పాట చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో కేవలం తెలుగు వెర్షన్‌కే 200 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. ఇటీవల కాలంలో ఒక స్టార్ హీరో సినిమాకు చెందిన పాట ఈ స్థాయి వ్యూస్ సాధించడం అరుదైన విషయం. ఇక సినిమా రిలీజ్ మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండగా.. నెక్ట్స్ అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మేకర్స్ నుంచి పెద్దగా అప్డేట్స్ రాకపోవడంతో అభిమానుల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది.

35
పెద్ది థియేట్రికల్ ట్రైలర్‌ ఎప్పుడంటే?
Image Credit : stockPhoto

పెద్ది థియేట్రికల్ ట్రైలర్‌ ఎప్పుడంటే?

ఈ నేపథ్యంలో తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, పెద్ది సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మే 16న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ ట్రైలర్ ఈవెంట్‌ను తెలుగు రాష్ట్రాల్లో కాకుండా భోపాల్‌లో నిర్వహించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఈ ఈవెంట్‌కు భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

45
రామ్ చరణ్ కోసం రంగంలోకి థోని..
Image Credit : Getty

రామ్ చరణ్ కోసం రంగంలోకి థోని..

రామ్ చరణ్‌కు ధోనితో మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ గతంలో ఒక పెప్సీ ప్రకటనలో కలిసి కనిపించారు.ఈమధ్య కాలంలో కూడా వీరు కలిసి సందడి చేశారు. ఈసినిమాలో రామ్ చరణ్ రూరల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న క్రికెటర్ గా కనిపించబోతున్నాడని టాక్. దాంతో రామ్ చరణ్ సినిమా ప్రమోషన్స్ కోసం ధోని వస్తున్నాడనే వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది.

అంతేకాదు, ఈ ఈవెంట్‌లో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారనే వార్త కూడా హాట్ టాపిక్‌గా మారింది. రెహమాన్ ప్రత్యేకంగా లైవ్ కాన్సర్ట్స్ నిర్వహించిన సందర్భాలు ఉన్నప్పటికీ, ఒక సినిమా ఈవెంట్‌లో ఈ తరహా ప్రదర్శన ఇవ్వడం చాలా అరుదు.

55
బాలీవుడ్ లో భారీ స్థాయిలో..
Image Credit : instagram /buchi babu sana

బాలీవుడ్ లో భారీ స్థాయిలో..

నార్త్ ఇండియాలో ఇప్పటికే పుష్ప గట్టిగా పాతుకుపోయింది. దాంతో అక్కడ పెద్ది సినిమాకు కూడా అంతకు మించి హైప్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ ఈవెంట్‌ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈవిషయంలో ఇప్పటి వరకూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తెలియాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
రామ్ చరణ్ కొణిదెల
ఎం.ఎస్. ధోని
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ముకేశ్ తో లవ్ ట్రాక్ అందుకే, కారణం రివీల్ చేస్తూ ఏడ్చేసిన వర్షిణి.. అపూర్వ విరక్తి పుట్టించే కంటెస్టెంట్
Recommended image2
AggiPetti Macha: అగ్గి పెట్టి మచ్చ కిరణ్ మృతి.. తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన సోషల్ మీడియా కమెడియన్
Recommended image3
Jailer 2 Censor: జైలర్ 2 సెన్సార్ రివ్యూ.. రజనీకాంత్ యాక్షన్ ఫీస్ట్ లోడింగ్, సూపర్ హిట్ కొట్టేసినట్లే
Related Stories
Recommended image1
Simran: హోటల్, టికెట్ల కోసం బేరాలాడతారు.. బాలీవుడ్‌పై సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved