MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి

Sai Pallavi Crush: నా ఫస్ట్ క్రష్ అతనే.. సీక్రెట్ రివీల్ చేసిన సాయి పల్లవి

హీరోయిన్లకు ఎవరిపై క్రష్ అని అడిగితే సిగ్గుపడతారు లేదా సైలెంట్ అయిపోతారు. కానీ సాయి పల్లవి అలా కాదు, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. తన కాలేజీ రోజుల నుంచే ఒక స్టార్ హీరో అంటే పిచ్చి ప్రేమ అని, ఆయనే తన ఫస్ట్ క్రష్ అని చెప్పేసింది. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 10 2026, 12:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సౌత్  ఆడియన్స్ మనసు దోచిన నటి..
Image Credit : Instagram

సౌత్ ఆడియన్స్ మనసు దోచిన నటి..

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మేకప్ లేకుండానే కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న అరుదైన నటి సాయి పల్లవి. ఆమె డ్యాన్స్‌కు ఫిదా కానివారు, ఆమె సహజ నటనకు పడిపోని వారు ఉండరు. 'ప్రేమమ్' సినిమాలో మలర్ టీచర్‌గా పరిచయమైన ఈ బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్‌లో 'సీత'గా మెరవడానికి సిద్ధమవుతోంది. 

అయితే, ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న ఈ లేడీ పవర్ స్టార్‌కు చిన్నప్పటి నుంచి ఒక హీరోపై విపరీతమైన 'క్రష్' ఉండేదట! ఇంతకీ సాయి పల్లవి మనసు దోచిన ఆ హ్యాండ్సమ్ హీరో ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సాయి పల్లవి ఫస్ట్ క్రష్
Image Credit : Instagram

సాయి పల్లవి ఫస్ట్ క్రష్

సాధారణంగా హీరోయిన్లను మీ క్రష్ ఎవరని అడిగితే సిగ్గుపడతారు లేదా సమాధానం దాటవేస్తారు. కానీ సాయి పల్లవి అలా కాదు, ఉన్నది ఉన్నట్టు ముఖం మీదే చెప్పేస్తుంది. తన కాలేజీ రోజుల నుంచే ఒక స్టార్ హీరో అంటే ఆమెకు చాలా ఇష్టమట. ఆ హీరో మరెవరో కాదు, కోలీవుడ్ 'సింగం', నటనకు మారుపేరైన సూర్య.

 అవును, సాయి పల్లవి ఫస్ట్ క్రష్ సూర్యనే. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం గురించి మాట్లాడుతూ, "నేను సూర్య గారికి పెద్ద ఫ్యాన్‌ని. ఆయన ప్రతీ సినిమా చూసేదాన్ని. స్క్రీన్‌పై ఆయన కనిపిస్తే చాలు, నా కళ్లు పక్కకు తిప్పేదాన్ని కాదు. ఆయన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం" అని సంతోషంగా చెప్పుకొచ్చింది.

36
సూర్యను ఆరాధించిన సాయి పల్లవి
Image Credit : Instagram

సూర్యను ఆరాధించిన సాయి పల్లవి

ఒక సాధారణ అభిమానిగా సూర్యను ఆరాధించిన సాయి పల్లవికి, ఏకంగా ఆయనతో కలిసి నటించే అవకాశం వచ్చింది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన 'NGK' సినిమాలో సూర్య సరసన హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చినప్పుడు ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. "నా డ్రీమ్ హీరోతో కలిసి నటించడం అనేది నిజంగా ఒక కల నిజమైన క్షణం లాంటిది" అని సాయి పల్లవి అంటుంది.
46
సెట్‌లో సూర్య క్రమశిక్షణ చూసి..
Image Credit : others

సెట్‌లో సూర్య క్రమశిక్షణ చూసి..

షూటింగ్ సెట్‌లో సూర్య క్రమశిక్షణ, సింప్లిసిటీ, తోటి నటీనటులకు ఆయన ఇచ్చే గౌరవం చూసి సాయి పల్లవి ఆశ్చర్యపోయిందట. కేవలం నటుడిగానే కాకుండా, ఒక వ్యక్తిగా సూర్యను చూశాక ఆయనపై ఉన్న గౌరవం, ప్రేమ వంద రెట్లు పెరిగాయని ఆమె గుర్తు చేసుకుంది.
56
దేశవ్యాప్తంగా భారీ అంచనాలు
Image Credit : Instagram

దేశవ్యాప్తంగా భారీ అంచనాలు

రీసెంట్ గా బర్త్ డే చేసుకున్న సాయి పల్లవికి  సోషల్ మీడియాలో అభిమానులు వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఆమె రణ్‌బీర్ కపూర్‌తో కలిసి 'రామాయణ' చిత్రంలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. 

66
సూర్యపై సాయి పల్లవి క్రష్..
Image Credit : Instagram

సూర్యపై సాయి పల్లవి క్రష్..

తన సహజమైన అందం, అద్భుతమైన డ్యాన్స్‌తో  ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో   తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సాయి పల్లవి, తనకూ ఒక సాధారణ అభిమాని మనసు ఉందని నిరూపించుకుంది. సూర్యపై తనకున్న 'క్రష్' కథ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఇది చూసి అభిమానులు "మా సాయి పల్లవి కూడా మాలాంటిదే" అని సంబరపడిపోతున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సాయి పల్లవి
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image2
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Recommended image3
25 కోట్ల బడ్జెట్.. 300 కోట్ల కలెక్షన్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ
Related Stories
Recommended image1
Simran: హోటల్, టికెట్ల కోసం బేరాలాడతారు.. బాలీవుడ్‌పై సిమ్రాన్ సంచలన వ్యాఖ్యలు
Recommended image2
Mothers Day : 20 ఏళ్లు పెద్ద హీరోలకు తల్లులుగా నటించిన స్టార్ హీరోయిన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved