- Home
- Entertainment
- Chiranjeevi: చిరంజీవి నా వల్లే ఎదిగారు అంటూ కామెంట్.. చేసింది ఒక్క సినిమానే, అది కూడా అట్టర్ ఫ్లాప్
Chiranjeevi: చిరంజీవి నా వల్లే ఎదిగారు అంటూ కామెంట్.. చేసింది ఒక్క సినిమానే, అది కూడా అట్టర్ ఫ్లాప్
మెగాస్టార్ చిరంజీవి ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒకే ఒక్క సినిమాలో నటించారు. ఆ మూవీ కూడా నిరాశపరిచింది. కానీ చిరంజీవి గురించి ఆ డైరెక్టర్ ఏమన్నారో తెలియాలంటే ఈ కథనం చూడండి.

చిరంజీవి సినిమాలు
మెగాస్టార్ చిరంజీవి 1978లో కెరీర్ ప్రారంభించారు. కేవలం పదేళ్లలోనే 100 సినిమాల్లో చిరంజీవి నటించారు. మొదట్లో ఎలాంటి అవకాశం వచ్చినా నటించిన చిరంజీవి ఆ తర్వాత హీరోగా సినిమాలు చేశారు. టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగారు. అయితే టాలీవుడ్ లో కొందరు ప్రముఖులతో చిరంజీవికి విభేదాలు ఏర్పడ్డాయి. చిరంజీవిని విభేదించిన వారిలో మోహన్ బాబు, రాజశేఖర్, దాసరి నారాయణరావు లాంటి ప్రముఖులు ఉన్నారు.
చిరంజీవితో విభేదాలు
దాసరి నారాయణ రావు ఓ ఇంటర్వ్యూలో చిరంజీవితో ఉన్న విభేదాల గురించి ఓపెన్ గా మాట్లాడారు. చిరంజీవి, నేను గొడవ పడింది ఎప్పుడూ లేదు. అతనితో నాకు విభేదాలు లేవు. కాకపోతే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొందరు మా మధ్య గ్యాప్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారు. చిరంజీవి సొంతంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్నారు. ఆ టైంలో నేను కాంగ్రెస్ లో ఉన్నాను.
చిరంజీవి ఎదుగుదలకి కారణం నేనే
వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు సహజం. ఆ క్రమంలోనే చిరంజీవిని విమర్శించాను తప్ప, అతనితో నాకు ఎలాంటి వివాదాలు లేవు అని దాసరి అన్నారు. మేస్త్రి సినిమా రిలీజ్ అయినప్పుడు అది చిరంజీవికి వ్యతిరేకంగా తీశాను అని భావించి వివాదం చేయడానికి ప్రయత్నించారు. కానీ అసలు నా ఉద్దేశం అది కాదు. చిరంజీవి ఆ స్థాయికి చేరుకున్నాడు అంటే పరోక్షంగా కారణం నేనే అని దాసరి అన్నారు. అనేక సందర్భాల్లో నెంబర్ 1 నుంచి నెంబర్ 10 వరకు అన్నీ స్థానాలు చిరంజీవివే అని ప్రశంసించినవాడిని నేను. అలాంటి నేను చిరంజీవిని ఎందుకు తగ్గించే ప్రయత్నం చేస్తాను అని దాసరి అన్నారు.
దాసరి దర్శకత్వంలో చిరంజీవి సినిమా
చిరంజీవికి నేను ఎంత బాగా ఉపయోగపడ్డాను అనేది అతనికి బాగా తెలుసు అని దాసరి పేర్కొన్నారు. అయితే దాసరి దర్శకత్వంలో చిరంజీవి నటించింది కేవలం ఒక్క చిత్రంలో మాత్రమే. అది లంకేశ్వరుడు మూవీ. దాసరి నారాయణ రావుకి ఇది 100వ చిత్రం. భారీ బడ్జెట్ లో రూపొందించిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది.
ఫ్లాప్ అయిన లంకేశ్వరుడు
ఆ విధంగా చిరు, దాసరి కాంబోలో వచ్చిన ఏకైక చిత్రం ఫ్లాప్ అయింది. చిరంజీవి ఎదుగుదలకు దాసరి పరోక్షంగా ఎలా కారణం అయ్యారో తెలియదు కానీ.. ప్రత్యక్షంగా మాత్రం ఉపయోగపడలేదు. తీసిన ఒక్క సినిమా కూడా పరాజయం చెందింది.

