- Home
- Entertainment
- Rakul Preet Singh : రకుల్ ప్రీత్ కు సంక్రాంతి కలిసివచ్చింది.. సౌత్ లో మళ్లీ మంచి శకునాలు!
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ కు సంక్రాంతి కలిసివచ్చింది.. సౌత్ లో మళ్లీ మంచి శకునాలు!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet Singh దక్షిణాది ప్రేక్షకులకు కాస్తా దూరమైన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ‘ఆయలాన్’ Ayalaanతో మళ్లీ మంచి రిజల్ట్ ను అందుకుంది.

Rakul Preet singh
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అలాగే తమిళంలోనూ చాలా సినిమాలు చేసింది.. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
Actress Rakul Preet Singh
దక్షిణాదిలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. కానీ కొన్నాళ్లుగా సౌత్ లో ఢిల్లీ భామకు వరుసగా ఫ్లాప్స్ పడ్డాయి. అటు బాలీవుడ్ లోనూ ఈ ముద్దుగుమ్మకు డిజాస్టర్లే మిగిలాయి. దీంతో ఆల్మోస్ట్ సౌత్ ఆడియెన్స్ కు దూరమైందనే భావించారు.
Actress Rakul
తమిళంలో, హిందీలోనూ, చివరిగా తెలుగులో నటించిన సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్స్ అవుతూనే వచ్చాయి. దాదాపు నాలుగైదు ఏళ్లుగా సక్సెస్ బాగా దూరంగా ఉంది. కానీ మళ్లీ దక్షిణాదిలో ఈ ముద్దుగుమ్మకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.
తాజాగా సంక్రాంతి సీజన్ లో వచ్చిన తమిళ చిత్రం ‘ఆయలాన్’ Ayalaan తో మంచి రిజల్ట్ ను అందుకుంది. శివ కార్తీకేయన్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ Rakul Preet హీరోయిన్ గా నటించింది.
జనవరి 12న ఈ చిత్రం గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మొన్నటి వరకు బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేసిన ఏమాత్రం ఫలించలేదు. కానీ మళ్లీ సౌత్ ఫిల్మ్ తోనే రకుల్ కు సక్సెస్ అందింది.
ఇక తెలుగులో చివరిగా ‘కొండపొలం’లో నటించింది రకుల్. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్దగా సినిమాలు చేయకపోయినా.. సౌత్ లో మాత్రం వచ్చిన అవకాశాలను మాత్రం వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.