ఇంటికి చేరుకున్న రజనీకాంత్.. బొట్టు పెట్టి ఆహ్వానించిన భార్య లత
First Published Dec 28, 2020, 11:39 AM IST
రజనీ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. మూడు రోజులపాటు కొనసాగిన ఆందోళన తగ్గిపోయింది. రజనీకాంత్ అనారోగ్యం నుంచి కోలుకోవడమే కాదు సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఆయనకు బొట్టు పెట్టి ఇంట్లోకి స్వాగతం పలికింది భార్య లతా రజనీకాంత్. అభిమానుల ప్రార్థనలు ఫలించాయి.

రజనీకాంత్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అతని కుమార్తె సౌందర్య రజనీకాంత్ ఆయన వెంటే ఉంది. ఇంటికి చేరే వరకు ఆమె దగ్గరుండి తీసుకెళ్ళింది.

ఇక ఇంటికి చేరుకున్నారు తలైవా. భర్తకి తనదైన స్టయిల్లో ఇంట్లోకి ఆహ్వానించింది రజనీ భార్య లతా. కోలుకుని వచ్చిన భర్తని చూసిన ఆనందంలో సాంప్రదాయం ప్రకారం నుదుటి బొట్టు పెట్టి స్వాగతం పలికింది లతా రజనీకాంత్.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?