MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajinikanth Remuneration: కమల్‌ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డ్ రెమ్యూనరేషన్‌.. ఇండియాలోనే టాప్‌

Rajinikanth Remuneration: కమల్‌ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డ్ రెమ్యూనరేషన్‌.. ఇండియాలోనే టాప్‌

Rajinikanth Remuneration: సూపర్‌ స్టార్‌ రజినీకాంత్, కమల్ హాసన్ కలిసి ఓ మూవీ చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రానికి రజనీకి రికార్డు రెమ్యూనరేషన్‌ ఇస్తున్నారట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 13 2026, 06:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కాంబోలో మూవీ
Image Credit : X

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కాంబోలో మూవీ

రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఇద్దరు కలిసి నటిస్తున్నారు. ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరు కలిసి ఓ భారీ మల్టీస్టారర్‌ చేయబోతున్నారు. దీనికి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం నెల్సన్‌ ..రజనీతో `జైలర్‌ 2` చేస్తున్నారు. కమల్‌ బ్యానర్‌లో మూవీ తర్వాత రజనీకాంత్‌, కమల్‌ కాంబోలో మూవీ స్టార్ట్ కానుంది.  తాత్కాలికంగా 'తలైవర్ 174 X KH 238' అని పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇద్దరు హీరోల అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమా కోసం వేచి చూస్తున్నారు.

24
కమల్‌ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డుస్థాయిలో రెమ్యూనరేషన్‌
Image Credit : X

కమల్‌ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డుస్థాయిలో రెమ్యూనరేషన్‌

ఈ సినిమాలో రజినీకాంత్ రెమ్యూనరేషన్ గురించిన ఓ వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా రూ.225 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని సమాచారం. ఇది ఇండియాలోనే హైయ్యెస్ట్ అని చెప్పొచ్చు. అల్లు అర్జున్‌ కి డైరెక్ట్ పారితోషికం ఇవ్వడం లేదు. ఆయనకు లాభాల్లో వాట ఇస్తున్నారు. రెమ్యూనరేషన్‌ పరంగా మాత్రం ఇప్పుడు రజనీదే టాప్‌ అని చెప్పొచ్చు. ఇటీవలే ఈ సినిమా కోసం ఓ ప్రోమో షూట్ కూడా పూర్తి చేశారని టాక్. ఈ ప్రోమోలో ఇద్దరూ 80ల నాటి వింటేజ్ స్టైల్‌లో కనిపించారట. స్నేహం నేపథ్యంలో, డార్క్ కామెడీ జానర్‌లో ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. ఈ భారీ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ నిర్మించనున్నారు.

Related Articles

Related image1
Funky Review: `ఫంకీ` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విశ్వక్‌ సేన్‌, అనుదీప్‌ల కామెడీ సినిమా నవ్వించిందా?
Related image2
Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు.. చంద్రహాస్‌ సినిమాకి ఊహించని వసూళ్లు
34
రజనీకాంత్‌ తో నెల్సన్‌ మూడో సినిమా
Image Credit : X / Raaj Kamal Films International

రజనీకాంత్‌ తో నెల్సన్‌ మూడో సినిమా

నెల్సన్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించబోయే మూడో సినిమా 'తలైవర్ 174'. దీనికి ముందు వీరి కాంబోలో 'జైలర్' వచ్చింది. ప్రస్తుతం 'జైలర్ 2'లో కూడా నటించారు. 'జైలర్ 2' సినిమా ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది. ఈ సినిమాపైనా భారీ అంచనాలున్నాయి. అదే సమయంలో, కమల్ హాసన్‌తో నెల్సన్‌కు ఇదే మొదటి సినిమా. రజినీ, కమల్ లాంటి ఇద్దరు దిగ్గజాలు కలవడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.
44
కమల్‌ హాసన్‌ నిర్మాతగా రజనీ సినిమా
Image Credit : X

కమల్‌ హాసన్‌ నిర్మాతగా రజనీ సినిమా

రజినీకాంత్, కమల్‌తో కలిసి నటించడమే కాకుండా, కమల్ నిర్మాణంలో మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారు. 'తలైవర్ 173' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మొదట సుందర్ సి దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ఆయన తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఇప్పుడు సిబి చక్రవర్తి ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. దర్శకుడిగా సిబి చక్రవర్తికి ఇది రెండో సినిమా. దీనికి ముందు ఆయన శివకార్తికేయన్‌తో 'డాన్' అనే బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా తీశారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
రాంచరణ్ 'చికిరి' హుక్ స్టెప్ క్రెడిట్ జానీ మాస్టర్ కి దక్కలేదా, ఎమోషనల్ కామెంట్స్.. ఏం జరిగిందో తెలుసా
Recommended image2
Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు.. చంద్రహాస్‌ సినిమాకి ఊహించని వసూళ్లు
Recommended image3
మెగాస్టార్ కావలసిన వాడు జీవితాంతం కమెడియన్ గా మిగిలిపోయాడు.. ఒక్క సినిమా రిజెక్ట్ చేసిన పాపానికి ఇలా..
Related Stories
Recommended image1
Funky Review: `ఫంకీ` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విశ్వక్‌ సేన్‌, అనుదీప్‌ల కామెడీ సినిమా నవ్వించిందా?
Recommended image2
Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు.. చంద్రహాస్‌ సినిమాకి ఊహించని వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved