MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Funky Review: `ఫంకీ` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విశ్వక్‌ సేన్‌, అనుదీప్‌ల కామెడీ సినిమా నవ్వించిందా?

Funky Review: `ఫంకీ` మూవీ రివ్యూ, రేటింగ్‌.. విశ్వక్‌ సేన్‌, అనుదీప్‌ల కామెడీ సినిమా నవ్వించిందా?

`జాతిరత్నాలు` ఫేమ్‌ అనుదీప్‌ దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ జంటగా నటించిన చిత్రం `ఫంకీ`. నేడు విడుదలయిన ఈ మూవీ నవ్వులు పూయించడంలో సక్సెస్‌ అయ్యిందా? 

4 Min read
Author : Aithagoni Raju
Published : Feb 13 2026, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఫంకీ మూవీ రివ్యూ
Image Credit : X/@SitharaEnts

ఫంకీ మూవీ రివ్యూ

విశ్వక్‌ సేన్‌, కయాదు లోహర్‌ జంటగా `ఫంకీ` మూవీ రూపొందింది. దీనికి `జాతిరత్నాలు` ఫేమ్‌ అనుదీప్‌ దర్శకుడు. విశ్వక్‌ సేన్‌కి గత కొన్ని రోజులుగా సక్సెస్‌ లేవు. అనుదీప్‌ కూడా చివరి చిత్రంతో డిజప్పాయింట్‌ చేశారు. వీరికిద్దరికి హిట్‌ కావాలి. కయాదు లోహర్‌కి తొలి తెలుగు సినిమా. ఆమెకి మంచి లాంఛింగ్‌ కావాలి. ఈ క్రమంలో వీరంతా ఇప్పుడు `ఫంకీ` చిత్రంతో వస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ నవ్వులు పంచడంలో సక్సెస్‌ అయ్యిందా? విశ్వక్‌, అనుదీప్‌లకు హిట్‌ పడిందా అనేది రివ్యూలో తెలుసుకుందాం. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్రేమికుల రోజుని పురస్కరించుకుని శుక్రవారం(ఫిబ్రవరి 13న) విడుదల అయ్యింది. సినిమా ఎలా ఉందంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫంకీ మూవీ కథ
Image Credit : X/@SitharaEnts

ఫంకీ మూవీ కథ

సినిమా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మూవీ ఇది. కోమల్‌ (విశ్వక్‌ సేన్‌) సినిమా దర్శకుడు. నిర్మాత సుదర్శన్‌(నరేష్‌) బ్యానర్‌లో మూవీ చేస్తుంటాడు. నాలుగు కోట్ల బడ్జెట్‌ అని చెప్పి రూ.40కోట్లు చేస్తాడు. అది తట్టుకోలేక మంచాన పడతాడు నిర్మాత. దీంతో ఆయన కూతురు చిత్ర(కయాదు లోహర్‌) రంగంలోకి దిగుతుంది. దర్శకత్వం నుంచి కోమల్‌ ని పీకేస్తుంది. దీంతో బ్రతిమాలుకుంటాడు. కోటీ రూపాయల్లో సినిమాని కంప్లీట్‌ చేస్తానని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఆగిన సినిమాని కంప్లీట్‌ చేసే పనిలో ఉంటారు. చిత్ర ప్రత్యక్షంగా ఇన్‌వాల్వ్ అవుతుంది. దీంతో ఇక కఠినంగా మూవీని పూర్తి చేసే పని పెట్టుకుంటారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? కోమల్‌ సినిమాని పూర్తి చేయడానికి ఎలాంటి కష్టాలు పడ్డారు? ఆయనతో చిత్ర సినిమా పూర్తి చేసిందా? ఇందులో దిల్‌ రాజు, నాగవంశీ, అనుదీప్‌ పాత్రలేంటి? జీకే(సంపత్‌ రాజ్‌) వీరిని ఎందుకు టార్గెట్‌ చేశారు? సినిమా షూటింగ్‌ చేసే సమయంలో చోటు చేసుకున్న ఫన్నీసంఘటనలు ఏంటి? సినిమాలో దర్శకుడికి సంబంధించి చూపించిన ఫ్యామిలీ ఎమోషన్స్ ఏంటనేది సినిమా.

36
ఫంకీ మూవీ విశ్లేషణ
Image Credit : X/@SitharaEnts

ఫంకీ మూవీ విశ్లేషణ

అనుదీప్‌ రూపొందించిన `జాతిరత్నాలు` మంచి విజయం సాధించింది. అందులో పెద్దగా కథ లేకపోయినా సందర్భానుసారంగా వచ్చే కామెడీ నవ్విస్తుంది. అది పెద్ద హిట్‌ అయ్యింది. మధ్యలో `ప్రిన్స్` బెడిసి కొట్టింది. ఇప్పుడు మళ్లీ తన మార్క్ కామెడీతో `ఫంకీ` మూవీని రూపొందించారు అనుదీప్‌. మరి ఈ చిత్రం `జాతిరత్నాలు` రేంజ్‌లో ఉందా అంటే లేదనే చెప్పొచ్చు. సినిమాలో కథ లేదు, సీన్ల బేస్డ్ గా సినిమాని నడిపించారు. డైలాగ్‌ కామెడీతో మూవీని రన్‌ చేశారు. హీరో తన టీమ్‌తో వేసే సెటైర్లు, డైలాగ్‌లే మూవీ. వాటిని కామెడీగా రాసుకున్నారు. మూవీ మొత్తం అదే ఉంటుంది. సినిమా బడ్జెట్‌ నాలుగు కోట్లు అవుతుందని చెప్పి, నలభై కోట్లు చేయడంతో నిర్మాత మంచాన పడటంతోనే మూవీ ఎలాంటి ఫన్‌రైడ్‌తో సాగుతుందనేది అర్థమవుతుంది. ప్రారంభంలో హీరో, హీరోయిన్ల మధ్య సన్నివేశాలు టామ్‌ అండ్‌ జెర్రీలా సాగుతాయి. హీరో ఫ్రస్టేషన్‌ దాన్ని తన టీమ్‌తో తీర్చుకోవడం, నిర్మాత ముందు ఒకలా, ఆమె లేనప్పుడు మరోలా మాట్లాడటం నవ్వులు పూయించేలా ఉంటుంది. ఈ క్రమంలో అతను రెంట్‌ కట్టలేని పరిస్థితులు ఆవిష్కరించారు. కొన్ని సీన్లు ఇతర సీన్ల నుంచి కాపీ కొట్టడం, ఇలాంటివి సినిమాల్లో జరిగే వాస్తవ పరిస్థితులను అద్దం పడుతుంది. దర్శకుడి జీవితం ఎలా ఉంటుందనేది చూపిస్తూనే, దాన్ని ఫన్నీ వేలో ఆవిష్కరించిన తీరు బాగుంది. ఫస్టాఫ్‌ అంతా ఇలా సరదాగా సాగిపోతుంది. సెకండాఫ్‌లో కూడా అదే గొడవ, అదే రచ్చ నడుస్తుంది. అదే సమయంలో హీరో గురించి హీరోయిన్‌కి కొన్ని విషయాలు తెలియడం, ఆయనకు ఆమె ఇంప్రెస్‌ కావడం, అయినా కూడా దాన్ని సీరియస్‌ వైపు వెళ్లకుండా కామెడీగానే నడిపించడం బాగుంది. మధ్యలో హడావుడి కోసం జీకే పేరుతో సంపత్‌రాజ్‌ పాత్రని పెట్టి యాక్షన్‌ యాంగిల్‌ని చూపించారు. తనపై పగబట్టిన రౌడీకి జూ ఎన్టీఆర్‌ని కలిపిస్తానని చెప్పడం, చివరకు వారి ఫ్యామిలీకి తన సినిమాల్లో ఛాన్స్ లు ఇవ్వడం, మరోవైపు గెట్‌ టూ గెదర్‌ అని తన ఫ్రెండ్స్ ని జూనియర్‌ ఆర్టిస్ట్ లు గా వాడుకోవడం ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంటాయి. సినిమా ఆద్యంతం ఫన్నీగా సాగుతూనే చివర్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ని చూపించిన తీరు మాత్రం బాగుంది. క్లైమాక్స్ ని ఎమోషనల్‌గా మార్చారు.

46
ఫంకీ మూవీలో మైనస్‌లు
Image Credit : Asianet News

ఫంకీ మూవీలో మైనస్‌లు

సినిమాలో కథ లేదు. కథనం లేదు. సీన్‌ బై సీన్లు పేర్చుకుంటూ వెళ్లారు. ఒక ఫ్లో లేదు. దేని తర్వాత ఏ సీన్‌ వస్తుందో కూడా తెలియదు. కామెడీ కూడా చాలా బలవంతంగా ఉంది. కొన్ని చోట్ల మాత్రమే అది వర్కౌట్‌ అయ్యింది. చాలా చోట్ల తేలిపోయింది. బలవంతంగా ఇరికించినట్టుగా ఉంది. డైలాగ్‌ల కోసమే సీన్లు పెట్టినట్టు, సీన్ల కోసమే సినిమా తీసినట్టుగా ఉంది. ఏమాత్రం కనెక్ట్ అయ్యేలా కామెడీ లేదు. డైలాగ్‌ల్లో ఎమోషన్స్ లేదు, అర్థం లేదు. ఏదో వెలికి కామెడీలా పేర్చుకుంటూ వెళ్లారు. ఎడిటింగ్‌ దారుణంగా ఉంది. విజువల్స్ మాత్రం బాగున్నాయి. పాటలు ఫర్వాలేదు. బీజీఎం ఓకే అనిపిస్తుంది. డైరెక్షన్‌, ఎడిటింగ్‌ లోపాలు బలంగా ఉన్నాయి. చాలా మంది సెలబ్రిటీలు ఇందులో మెరుస్తారు. కానీ ఏం ఉపయోగం లేదు.

56
ఫంకీ మూవీలో ఆర్టిస్ట్ ల నటన
Image Credit : X/@SitharaEnts

ఫంకీ మూవీలో ఆర్టిస్ట్ ల నటన

దర్శకుడు కోమల్‌ పాత్రలో విశ్వక్‌ సేన్‌ చాలా బాగా నటించాడు. చాలా సెటిల్డ్ గా చేశాడు. కామెడీ డైలాగ్స్ బాగా చెప్పాడు. కానీ చాలా చోట్ల నవ్వు రాలేదు. కాకపోతే నటుడిగా విశ్వక్‌ ఇరగదీశాడు. హీరోయిన్‌ కయాదు లోహర్‌ బాగా చేసింది. గ్లామరస్‌గా కనిపించి మెప్పించింది. ఆమెనే చూస్తూ ఉండిపోయేలా ఉంది. ఇక నిర్మాత పాత్రలో నరేష్‌ తనదైన కామెడీతో మెప్పించారు. కాకపోతే ఆయన కామెడీని సరిగా వాడుకోలేదు. సంపత్‌ రాజ్‌పాత్ర ఇరికించినట్టుగానే ఉంది. కానీ బాగుంది. మురళీధర్‌ గౌడ్‌ కనిపించిన కాసేపు నవ్వించాడు. విశ్వక్‌ తల్లిగా ఈశ్వరీరావు బాగా చేసింది. ఆమె పాత్రలో ఎమోషన్స్ కనెక్ట్ అవుతుంది. విశ్వక్‌సేన్‌ చుట్టూ ఉండే కుర్రాళ్లు కూడా అదరగొట్టారు. మిగిలిన పాత్రధారులు ఓకే అనిపించారు.

66
ఫంకీ మూవీలో టెక్నీషియన్ల పనితీరు
Image Credit : Asianet News

ఫంకీ మూవీలో టెక్నీషియన్ల పనితీరు

భీమ్స్ సిసిరోలియో సంగీతం బాగుంది. రట్టాట్టటా సాంగ్‌ మాత్రం అదిరిపోయింది. బీజీఎం కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక సురేష్‌ సారంగం కెమెరా బాగుంది. విజువల్స్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎడిటింగ్‌ లోపాలు ఉన్నాయి. ఎడిటింగ్‌ చేసినట్టుగానే లేదు. నిర్మాణ విలువలకు కొదవలేదు. దర్శకుడు అనుదీప్‌ తన మార్క్ కామెడీని బాగానే రాసుకున్నాడు, కానీ దాన్ని తెరపై ఆవిష్కరించడంలో తడబడ్డాడు. ఎక్కడా కనెక్టివిటీ లేదు. డైలాగ్స్ కూడా పండలేదు. కామెడీ బలవంతంగా పెట్టినట్టుంది. ఇంకా చెప్పాలంటే కామెడీ డైలాగ్‌లు, పంచ్‌ల కోసమే సినిమా తీసినట్టుంది. కొన్ని చోట్ల మాత్రమే నవ్విస్తుంది. ఫస్టాఫ్‌తో పోల్చితే సెకండాఫ్‌ కాస్త బెటర్‌గానే ఉందని చెప్పొచ్చు.

ఫైనల్‌గా:

 కామెడీ డైలాగ్‌ల కోసం, పంచ్‌ల కోసం సినిమా తీసినట్టుంది. ఆ కామెడీ కూడా అంతగా వర్కౌట్‌ కాలేదు.

రేటింగ్‌: 2

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image2
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Missing Meghana Review: మిస్సింగ్‌ మేఘన మూవీ రివ్యూ.. రామ్‌ కార్తీక్‌, అంకిత్‌ కొయ్య థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Prime Video Top 10 Movies: ఓటీటీలో `నారీ నారీ నడుమ మురారి` సంచలనం.. ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌.. టాప్‌ 10 మూవీస్‌
Recommended image2
Nilave Review: `నిలవే` మూవీ రివ్యూ.. ఇంటెన్స్ లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved