- Home
- Entertainment
- 5 నిమిషాల్లో 3 థియేటర్లు, 15 లక్షల విలువైన టికెట్లు, రజినీకాంత్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డ్
5 నిమిషాల్లో 3 థియేటర్లు, 15 లక్షల విలువైన టికెట్లు, రజినీకాంత్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డ్
అమెరికాలోని డల్లాస్ లో ఉన్న రజినీకాంత్ ఫ్యాన్స్ రికార్డ్ క్రియేట్ చేశారు. తమ అభిమాన నటుడి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా వారు ఏం చేశారంటే?

రజినీకాంత్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు
సూపర్ స్టార్ రజినీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తలైవా సినిమా రిలీజ్ అయ్యిందంటే వారికి పండగే. సూపర్ స్టార్ కటౌట్లు, దండలు, అభిషేకాలు, పూజలతో వారు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు ఆయన అభిమానుల కోసం ఆగస్టు 14న కూలీ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈసదర్భంగా సందడి చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. రకరకాల ఈవెంట్లను ప్లాన్ చేసుకుంటున్నారు.
రజినీకాంత్ తో నాగార్జున, ఉపేంద్ర, ఆమీర్ ఖాన్
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కూలీ. ఈసినిమాపై ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాదు కూలీ సినిమాలో రజినీకాంత్ తో పాటు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున, కన్నడ స్టార్ సీనియర్ హీరో ఉపేంద్ర, శౌబిన్ షాహిర్, శృతిహాసన్, సత్యరాజ్ వంటి అనేక మంది ప్రముఖులు నటిస్తున్నారు. అంతే కాదు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.
సరికొత్త గెటప్ లో సూపర్ స్టార్ సందడి
ఇప్పటి వరకు మాదకద్రవ్యాలకు సబంధించిన కేసులు ఆధారంగా సినిమాలు తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్... ఈసారి ఓడరేవులో జరిగే బంగారు దొంగతనాన్ని కేంద్రంగా చేసుకుని కూలీ సినిమాను తెరకెక్కించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించింది. ఈసినిమాలో రజినీకాంత్ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నారు.
కూలీ సినిమాపై భారీగా అంచనాలు
ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన చిక్కిటు , మోనికా పాటలు యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. అదేవిధంగా ఇటీవల విడుదలైన మూడవ పాట పవర్ హౌస్ కూడా మంచి ఆదరణ పొందుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ పై దృష్టి సారించింది, త్వరలో కూలీ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రీరిలీజ్ ను కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే తాజాగా ఈసినిమాకు సబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.
రికార్డ్ క్రియేట్ చేసిన రజినీకాంత్ అమెరికా అభిమానులు
ఇండియాతో పాటు ప్రస్తుతం విదేశాల్లో 'కూలీ' సినిమా పై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. ఈక్రమంలో ప్రీ బుకింగ్ కూడా ప్రారంభమైంది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో నివసిస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు వెస్ట్ ప్లానో సినిమా మార్క్ థియేటర్ లో ప్రీమియర్ షో కోసం మూడు స్క్రీన్ ల టిక్కెట్లను 5 నిమిషాల్లో కొనుగోలు చేశారు. దీని విలువ 15 లక్షలు అని ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోను వారు విడుదల చేయగా అది వైరల్ అవుతోంది. ఈసినిమా రిలీజ్ కు ఇంకా 20 రోజులకు పైగా టైమ్ ఉండగా.. కూలీ కోసం ఫ్యాన్స్ ఇంకెన్ని కొత్త వింతలు చేస్తారో చూడాలి.