ఓటీటీల్లో సినిమాల జాతర, ఒకే రోజు స్ట్రీమింగ్ అయిన 15 మూవీస్ ఏంటో తెలుసా?
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర జరగబోతోంది. బుల్లితెర ఆడియన్స్ ను అలరించడానికి ఈరోజు(25 జులై) ఏకంగా 15 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో తెలుసా?

ఓటీటీల్లో సినిమాల జాతర
శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ ప్రేమికులకు పండగే. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో కొత్త సినిమాలతో పండగ వాతావరణం ఏర్పడుతుంది. కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ ల సందడి స్టార్ట్ అవుతుంది. ఎప్పటిలాగానే ఈ శుక్రవారం(25 జులై) కూడా ఓటీటీల్లోకి సరికొత్త కంటెంట్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చేశాయి. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.
ఈవారం రిలీజ్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే నవీన్ చంద్ర, కామాక్షి భాస్కర్ల నటించిన షో టైమ్ సినిమా. దీంతో పాటు విజయ్ ఆంటోనీ చిత్రం మార్గన్ కూడా ఈ వారమే స్ట్రీమింగ్ కు రానుంది. అమ్మాయిల హత్యలు, సైకో కిల్లర్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది. హిందీలో సర్జామీన్ తో పాటు ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.
అమెజాన్ ప్రైమ్
షో టైమ్ (తెలుగు సినిమా)
మార్గన్(తెలుగు డబ్బింగ్ సినిమా)
నోవాక్సిన్ (ఇంగ్లీష్ సినిమా)
రంగీన్ (హిందీ వెబ్ సిరీస్)
సన్ నెక్స్ట్
ఎక్స్ & వై (కన్నడ చిత్రం)
నెట్‌ఫ్లిక్స్
మండల మర్డర్స్ (హిందీ వెబ్ సిరీస్)
ది విన్నింగ్ ట్రై- (కొరియన్ మూవీ)
ట్రిగ్గర్- (కొరియన్ వెబ్ సిరీస్)
హ్యాపీ గిల్మోర్-2- (హాలీవుడ్ కామెడీ సినిమా)
ఆంటిక్ డాన్-(హాలీవుడ్ హారర్ మూవీ)
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ద సొసైటీ (హిందీ రియాలిటీ షో)
రోంత్ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ )
వాషింగ్టన్ బ్లాక్ (ఇంగ్లీష్ హిస్టారికల్ డ్రామా వెబ్ సిరీస్)
సర్జమీన్ (హిందీ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా మూవీ)
జీ5
సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా)
లయన్స్ గేట్ ప్లే
జానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్(ఇంగ్లిష్ మూవీ)
ద ప్లాట్ (కొరియన్ మూవీ)
ద సస్పెక్ట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)