మెగాస్టార్ కెరీర్ లో షూటింగ్ పూర్తయి, రిలీజ్ ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?
45 ఏళ్ల మూవీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటు ప్లాప్ మూవీస్ కూడా చూశారు చిరంజీవి. టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి కెరీర్ లో షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తరువాత రిలీజ్ ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ గా
ఎటువంటి సినిమా బాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ రేంజ్ కు ఎదిగాడు చిరంజీవి. దాదాపు 45 ఏళ్ళుగా టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ను కొనసాగిస్తున్న మెగాస్టార్ 69 ఏళ్ల వయస్సులో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. తాయరమ్మ బంగారయ్య లాంటి సినిమాలతో జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. విలన్ గా.. హీరోగా.. ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించారు మెగాస్టార్. హీరోగా, సుప్రీమ్ స్టార్ గా, మెగాస్టార్ గా ప్రస్తుతం టాలీవుడ్ ను శాసించే స్థాయికి ఆయన ఎదిగారు.
టాలీవుడ్ లో మెగా మార్క్
150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి.. ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ తో ఫ్యాన్స్ ను అలరించారు. అంతే కాదు మెగాస్టార్ కెరీర్ లో డిజాస్టర్ మూవీస్ కూడా లేకపోలేదు. గెలుపు ఓటములను సమానంగా చూసిన చిరంజీవి.. టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని విస్తరించారు.
చిరంజీవి తరువాత పవన్ కళ్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్. వరుణ్ తేజ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక లాంటి స్టార్స్ టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి సిర్మాతలు కూడా ఉన్నారు. అరవింద్, బాబి, నాగబాబు,నిహారిక, రామ్ చరణ్ నిర్మాతలుగా కొనసాగారు.
చిరంజీవితో వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్.. ఆయన్ను ఇన్స్ ప్రెషన్ గా తీసుకుని సొంత ఇమేజ్ ను సాధించడంతో పాటు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది నటులు ఇండస్ట్రీకి వచ్చి స్టార్లుగా మారారు.
ఇలా తెలుగు సినీపరిశ్రమలో తనదైన ముద్ర వేసిన చిరంజీవి కెరీర్ ఎన్నో అద్భుతాలు జరిగాయి. అయితే ఆయన సినిమాల్లో షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయి రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన ఏకైక సినిమా గురించి మీకు తెలుసా..?
రిలీజ్ ఆగిపోయిన చిరంజీవి సినిమా
చిరంజీవి 155 సినిమాలు చేయగా, మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. అయితే ఆయన కెరీర్ లో ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు. అయితే అదేదో షూటింగ్ దశలోనో.. లేక సగం షూటింగ్ అయిపోయిన తరువాతో ఆగిపోలేదు. షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని... పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తి చేసుకున్న తరువాత.. రిలీజ్ దగ్గకు వచ్చేసరికి ఆగిపోయింది సినిమా. ఆ సినిమా ఏదో కాదు శాంతి నివాసం. చిరంజీవి - మాధవి హీరో..హీరోయిన్లుగా..తెరకెక్కిన ఈ సినిమాకు బాబు దర్శకత్వం వహించారు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా అయిపోయింది. సరిగ్గా రిలీజ్ అయిపోతుందన్న టైమ్ కు నిర్మాత మరణించారు.
నిర్మాత మరణంతో రిలీజ్ కు బ్రేక్
శాంతి నివాసం సినిమా రిలీజ్ కు కొద్దిరోజులే ఉన్నాయి, ప్రమోషన్లు కూడా జరుగుతుండగా ఈ సినిమా నిర్మాత హఠాత్తుగా మరణించారు. దాంతో శాంతినివాసం సినిమా రిలీజ్ ఆగిపోయింది. అయితే అన్ని సర్ధుకున్నాక.. కొంత టైమ్ తీసుకుని శాంతి నివాసం రిలీజ్ చేస్తారులే అని అనుకున్నారు ప్రేక్షకులు. కాని అలా జరగలేదు. నిర్మాత మరణంతో సెంటిమెంట్ గా ఫీల్ అయ్యారో ఏమో.. శాంతి నివాసం రిలీజ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.
దాంతో చిరంజీవి కెరీర్ లో షూటింగ్ పూర్తయిన రిలీజ్ కు నోచుకోలేని ఏకైక సినిమాగా శాంతి నివాసం నిలిచిపోయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి70 ఏళ్ళకు దగ్గరగా ఉన్నా.. అదే ఎనర్జీతో సినిమాలు చేస్తున్నారు. వరుస ప్రాజెక్ట్స్ ను సెట్స్ ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్టతో డైరెక్షన్ లో చిరంజీవి నటించిన విశ్వంభర సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. మరో వైపు అనిల్ రావిపూడితో మరో సినిమాను చేస్తున్నారు మెగాస్టార్. ఈసినిమా షూటింగ్ మూడో షెడ్యూల్ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది.