- Home
- Entertainment
- చిరంజీవి లాగా అలాంటి సినిమా చేయాలంటే దిల్ ఉండాలి, రాజశేఖర్ కురిపించిన ప్రశంసలకు అంతా షాక్
చిరంజీవి లాగా అలాంటి సినిమా చేయాలంటే దిల్ ఉండాలి, రాజశేఖర్ కురిపించిన ప్రశంసలకు అంతా షాక్
మెగాస్టార్ చిరంజీవిని తరచుగా విభేదించే వారిలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒకరు. రాజశేఖర్, చిరంజీవి కుటుంబాల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

మెగాస్టార్ చిరంజీవిని తరచుగా విభేదించే వారిలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒకరు. రాజశేఖర్, చిరంజీవి కుటుంబాల మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. తాను చేయాల్సిన ఠాగూర్ చిత్రాన్ని చిరంజీవి చేశారని రాజశేఖర్ చాలా సందర్భాల్లో తెలిపారు. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు కూడా ఇద్దరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
రాజశేఖర్ చిరంజీవిని ప్రశంసించడం చాలా అరుదు. రాజశేఖర్ చిరంజీవిని ఎప్పుడూ విమర్శించడమే అభిమానులు ఎక్కువగా చూసి ఉంటారు. అయితే ఒక సందర్భంలో రాజశేఖర్ చిరంజీవి పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో రాజశేఖర్ మాటలకు అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి తన డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా చిత్రం సంగతి తెలిసిందే. చిరంజీవి సొంత బ్యానర్ లో ఈ చిత్రం రూపొందింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ మూవీ కమర్షియల్ గా పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేదు కానీ మంచి ప్రయత్నం అంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
సైరా చిత్రం రిలీజ్ అయ్యాక ప్రముఖ నిర్మాత టి సుబ్బరామిరెడ్డి చిత్ర యూనిట్ ని సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాజశేఖర్ కూడా హాజరయ్యారు. రాజశేఖర్ మాట్లాడుతూ.. చిరంజీవి లాగా ఇంత పెద్ద సినిమాలో నటించాలంటే దిల్ ఉండాలి అని అన్నారు. ఈ చిత్రాన్ని నిర్మించి తండ్రి కలని సాకారం చేసిన తనయుడుగా రామ్ చరణ్ గుర్తింపు పొందారు అని రాజశేఖర్ ప్రశంసించారు.
నిర్మాత ఏవీఎం గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు.. సినిమాని నిర్మించడానికి కావాల్సింది డబ్బు కాదు.. దిల్ ఉండాలి అని ఆయన చెప్పేవారు. ఆయన చెప్పిన మాటలు చిరంజీవి, రామ్ చరణ్ లని చూస్తే నిజం అనిపిస్తుంది అని అన్నారు.
తెలుగు వాళ్లంతా గర్వంగా ఫీల్ అయ్యే చిత్రం సైరా అని రాజశేఖర్ అన్నారు. ఇంత పెద్ద చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు తన దర్శకత్వంతో చాలా బాగా హ్యాండిల్ చేశారు. చిరంజీవి గారిని మరో విషయంలో అభినందించాలి. డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. ఇలాంటి సినిమాకి డబ్బు ఖర్చు చేయడం కూడా గొప్ప విషయమే. ఈ సినిమా చూస్తున్నంత సేపు తనకి పాత చిరంజీవిని చూస్తున్నట్టే ఉంది కానీ ఆయన వయసు ఎక్కడా కనిపించలేదని రాజశేఖర్ అన్నారు.