MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rajasekhar సినిమాల్లో.. ఆయన జీవితానికి దగ్గగా ఉన్న మూవీ ఏదో తెలుసా?

Rajasekhar సినిమాల్లో.. ఆయన జీవితానికి దగ్గగా ఉన్న మూవీ ఏదో తెలుసా?

ఒకప్పుడు టాలీవుడ్ లో యాంగ్రీ హీరో ఇమేజ్ తో దూసుకుపోయాడు రాజశేఖర్. బ్లక్ బస్టర్ హిట్ సినిమాలు చేసిన ఆయన.. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించారు. రాజశేఖర్ చేసిన సినిమాల్లో ఆయన జీవితానికి దగ్గరగా ఉండే మూవీ ఏదో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 24 2026, 10:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాలీవుడ్ యాంగ్రీ హీరో..
Image Credit : Pinterest

టాలీవుడ్ యాంగ్రీ హీరో..

తెలుగు సినీ పరిశ్రమలో మాస్, క్లాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించిన హీరో ఒక్క రాజశేఖర్ మాత్రమే. ఆయన పోలీస్ పాత్రల్లో మాస్ జనాల మనసు దోచాడు. అల్లరి ప్రియుడు, మా అన్నయ్య, సింహరాశి లాంటి సినిమాలతో కుటుంబ ప్రేక్షకులను మెప్పించాడు. 

కాలం మారుతున్నకొద్ది సినిమాల సెలక్షన్ లో కూడా మార్పులు చేసుకుంటూ.. టాలీవుడ్ లో రాణించాడు రాజశేఖర్. హీరోగా ఎన్ని విజయాలు చూశాడో.. అన్ని కాట్రవర్సీలను కూడా రాజశేఖర్ ఫేస్ చేశాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో గొడవలు రాజశేఖర్ కెరీర్ పై ప్రభావం చూపించాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ హీరో..
Image Credit : X/@filmytopics

ఫ్యామిలీ ఆడియన్స్ కు ఫేవరెట్ హీరో..

ఇప్పటికీ రాజశేఖర్ అభిమానులు ఆయన సినిమాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక ఆయన నటించిన చాలా సినిమాలు ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించాయి. కుటంబ విలువలు తెలిపేలా రాజశేకర్ కొన్ని సినిమాల్లో నటించారు. అందులో ‘మా అన్నయ్య’ సినిమా కూడా ఒకటి. ఆయన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది. మాస్ అంశాలతో పాటు ఎమోషన్స్ కలగలిపిన కథతో మా అన్నయ్య మూవీ తెరకెక్కింది. ఇప్పటికీ ఈసినిమా టీవీల్లో వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ కదలకుండా చూస్తుంటారు.

Related Articles

Related image1
Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Related image2
Krishna : మీ చావు మీరు చావండని.. ఫోన్ లో కృష్ణను ఎన్టీఆర్ ఎందుకు తిట్టాడో తెలుసా? ఆ సినిమా వెనుక అంత పెద్ద కథ ఉందా?
36
మా అన్నయ్య సినిమా తెరవెనుక కథ..
Image Credit : youtube/@iDreamCineHub

మా అన్నయ్య సినిమా తెరవెనుక కథ..

అయితే ఈసినిమా రూపొందించడం వెనుక చాలా పెద్ద కథ నడిచింది. అంతే కాదు ఈమూవీ తన జీవితానికి చాలా దగ్గరగా ఉందని రాజశేఖర్ ఓ సందర్భంలో వెల్లడించారు. ఇక ఈ సినిమా తమిళంలో విజయకాంత్ హీరోగా తెరకెక్కిన ‘వానత్తై పోల’ చిత్రానికి రీమేక్. ఆ కాలంలో ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖ హీరోలు, నిర్మాతలు పోటీ పడినట్లు సమాచారం. ఒరిజినల్ నిర్మాత రీమేక్ హక్కుల కోసం రూ.75 లక్షలు డిమాండ్ చేయగా, చాలా మంది రూ.70 లక్షల వరకు వచ్చి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

46
రాజశేఖర్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ..
Image Credit : youtube/shreyas media

రాజశేఖర్ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ..

అయితే రాజశేఖర్ ఈ సినిమాను మూడుసార్లు చూశారట. ఈసినిమా కథపై పూర్తి నమ్మకంతో నిర్మాత అడిగిన రూ.75 లక్షల మొత్తాన్ని ఇచ్చి.. రీమేక్ హక్కులను కొనుగోలు చేశారు. అనంతరం నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ హక్కులను రాజశేఖర్ వద్ద నుంచి తీసుకుని నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. రవిరాజ పినిశెట్టి డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఈ మూవీ రాజశేఖర్ కెరీర్‌లో ఒక కీలక మైలురాయిగా నిలిచింది.

56
రాజశేఖర్ జీవితానికి దగ్గరగా ఉన్న సినిమా..
Image Credit : IMDB

రాజశేఖర్ జీవితానికి దగ్గరగా ఉన్న సినిమా..

ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ సినిమాలోని పెద్ద అన్నయ్య పాత్ర తన తండ్రిని పోలి ఉంటుందని తెలిపారు. అలాగే నిజ జీవితంలో తాను ఇద్దరు తమ్ముళ్లకు అన్నయ్యనని ఈ సినిమా కథ తన జీవితానికి దగ్గరగా ఉందని రాజశేఖర్ అన్నారు. ఈ సినిమా రీమేక్ హక్కుల విషయంలో ఆయన చూపిన పట్టుదల, తీసుకున్న నిర్ణయం, ఆయన నమ్మకం నిజమయ్యింది. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిన ఈమూవీ.. యూట్యూబ్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను సాధించింది. మరీ ముఖ్యంగా ఈసినిమాలో సెంటిమెంట్, కామెడీ సీన్స్ ఇప్పటికీ షార్ట్ వీడియోస్ గా వైరల్ అవుతూనే ఉన్నాయి.

66
 క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త అవతారం
Image Credit : youtube/great andhra

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త అవతారం

తాజాగా ఆయన బైకర్ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త అవతారం ఎత్తాడు రాజశేఖర్. ఈ సినిమాలో హీరో శర్వానంద్‌కు తండ్రి పాత్రలో ఆయన కనిపించారు. ప్రస్తుతం ఆయన తమిళ హిట్ చిత్రం ‘లబ్బర్ పందు’ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడటంతో ఈ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా బ్రేక్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమవుతుందని సమాచారం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jailer 2 Accident: జైలర్ 2 సెట్‌లో ఘోర ప్రమాదం.. యువకుడు బలి.. అసలేం జరిగింది?
Recommended image2
Mahesh Babu : మహేష్ బాబు బాలీవుడ్ సినిమాలు చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సీక్రెట్ చెప్పిన స్టార్ నటుడు ఎవరు?
Recommended image3
Net Worth: 'పతీ పత్నీ ఔర్ వో దో' హీరోయిన్లు.. రకుల్, సారా, వామికా లలో ఎవరి ఆస్తి ఎక్కువ ?
Related Stories
Recommended image1
Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Recommended image2
Krishna : మీ చావు మీరు చావండని.. ఫోన్ లో కృష్ణను ఎన్టీఆర్ ఎందుకు తిట్టాడో తెలుసా? ఆ సినిమా వెనుక అంత పెద్ద కథ ఉందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved