MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `రాజాసాబ్‌` ఇండియా బిగ్గెస్ట్ హర్రర్‌ సెట్‌.. ప్రభాస్‌ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసింది ఇక్కడే

`రాజాసాబ్‌` ఇండియా బిగ్గెస్ట్ హర్రర్‌ సెట్‌.. ప్రభాస్‌ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసింది ఇక్కడే

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న మూవీ `రాజాసాబ్‌` టీజర్‌ విడుదలైంది. ఇందులో రాజమహల్‌ సెట్‌ హైలైట్‌గా నిలిచింది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు రిలీజ్‌ చేసింది టీమ్‌. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 16 2025, 08:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
`రాజాసాబ్‌` టీజర్‌లో హైలైట్‌గా రాజమహల్‌ సెట్‌
Image Credit : Asianet News

`రాజాసాబ్‌` టీజర్‌లో హైలైట్‌గా రాజమహల్‌ సెట్‌

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న `రాజాసాబ్‌` మూవీ టీజర్‌ విడుదలైంది. విజువల్‌ వండర్‌గా ఉన్న ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. టీజర్‌లో ఒక రాజమహల్‌ కోట(హవేలీ సెట్‌) హైలైట్‌గా నిలిచింది. విజువల్ గానూ అది అదిరిపోయేలా ఉంది. 

సినిమా మొత్తం ఆ కోటలోనే సాగుతుందని టీజర్‌ చూస్తుంటే తెలుస్తోంది. అదే సమయంలో దర్శకుడు మారుతి కూడా ఈ విషయాన్ని చెప్పారు. హీరోహీరోయిన్లని ఆ కొంపలో పడేశామని, అక్కడే రొమాన్స్, అక్కడే హర్రర్‌ ఉంటుందని ఆయన వెల్లడించారు. దీంతో డార్లింగ్‌ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసేది ఆ కోటలోనే అని అర్థమవుతుంది.

26
`రాజాసాబ్‌` హవేలీ సెట్‌ ఫోటోలు
Image Credit : Asianet News

`రాజాసాబ్‌` హవేలీ సెట్‌ ఫోటోలు

తాజాగా ఈ కోట సెట్‌ని ప్రత్యేకంగా మీడియాకి చూపించింది టీమ్‌. దీనికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. సెట్‌ లోపల ఎలా ఉందో చూపిస్తూ `రాజాసాబ్‌` చిత్ర బృందం ఫోటోలను విడుదల చేసింది. ఇది చూడ్డానికి ఆద్యంతం కనువిందుగా ఉంది. 

రెండు ఫ్లోర్స్ లో రాజభవనాన్ని తలపిస్తుంది. టీజర్‌లోనూ ఈ రాజమహల్‌ని హైలైట్‌ చేశారు. కొన్ని కోట్లు వెచ్చించి ఈ రాజమహల్‌ సెట్‌ ని నిర్మించారట ఆర్ట్ డైరెక్టర్‌ రాజీవ్‌ నంబీయార్‌. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

Related Articles

Related image1
ఆ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ తో మూవీ వద్దనుకున్నా..ముగ్గురు హీరోయిన్లపై డైరెక్టర్ మారుతి కామెంట్స్
Related image2
`రాజాసాబ్‌ 2`పై హింట్‌ ఇచ్చిన దర్శకుడు మారుతి.. నిడివి విషయంలో `పుష్ప 2`, `కల్కి 2898 ఏడీ`లకు పోటీ
36
 41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో `రాజాసాబ్‌` హవేలీ సెట్‌
Image Credit : Asianet News

41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో `రాజాసాబ్‌` హవేలీ సెట్‌

ఈ భారీ హవేలీ సెట్‌ గురించి సరికొత్త విషయాలను పంచుకుంది టీమ్‌. 41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డ్ స్థాయి హవేలీ సెట్ ను రూపొందించారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మరే హర్రర్‌ మూవీకి ఇంత భారీ సెట్ నిర్మించలేదు. 

`రాజా సాబ్` హవేలీ సెట్ గురించి ఆర్ట్ డైరెక్టర్ స్పందిస్తూ , హవేలీలోని ప్రతి అడుగు ఒక ఎమోషన్ ను వ్యక్తీకరిస్తుంది. చూసేందుకు మాత్రమే హాంటెడ్ హౌస్ లా ఉండటం కాదు. హాంటెడ్ హౌస్ లో మనమంతా ఉన్న ఫీల్ కలిగిస్తుంది. ఈ హవేలీ చూస్తుంటే మీకు కథలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది` అని అన్నారు.

46
సహజత్వాన్ని ప్రతిబింబించేలా సెట్‌
Image Credit : Asianet News

సహజత్వాన్ని ప్రతిబింబించేలా సెట్‌

ఈ హవేలీ సెట్‌లోని వస్తువులు, బొమ్ములు అనాటిరోజులను గుర్తు చేసేలా చాలా సహజంగా ఉండటం విశేషం. టెలిఫోన్‌ నుంచి, రాజమహల్‌ యాజమాని సంజయ్‌ దత్‌ ఫోటోతోపాటు, అప్పుడు వాడిన వస్తువులు కూడా చాలా సహజంగా కనిపిస్తున్నాయి. 

అందుకే ఇది ఈ మూవీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతుంది. హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ అవతల, అజీజ్ నగర్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్టూడియోలో ఓ సెట్, అల్యూమినియం ఫ్యాక్టరీలో మరో సెట్ ని వేశారు.

56
`రాజాసాబ్‌` మూవీ కాస్ట్ అండ్‌ క్రూ డిటెయిల్స్
Image Credit : Asianet News

`రాజాసాబ్‌` మూవీ కాస్ట్ అండ్‌ క్రూ డిటెయిల్స్

ఇక ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న `రాజా సాబ్‌` మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. 

ఇందులో సంజయ్‌ దత్‌ ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 5న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేస్తున్నారు.

66
ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్‌ రచ్చ
Image Credit : Asianet News

ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్‌ రచ్చ

తాజాగా విడుదలైన టీజర్‌ ని చూస్తుంటే, రాజమహల్‌ సంజయ్‌ దత్‌ని అని తెలుస్తుంది. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆ ఆస్తులను తానే అనుభవించాలని చెప్పి అక్కడే ఆత్మ(దెయ్యం)గా ఉండిపోతాడు. ఆ కోటలోి వచ్చిన వారిని పట్టి తన రాజభోగాలు అనుభవిస్తుంటారు. అలా ప్రభాస్‌ తోపాటు ఆయన ఫ్రెండ్స్, ముగ్గురు హీరోయిన్లు ఆ రాజమహల్‌కి వెళ్తారు. 

అక్కడ వారు ఎలాంటి అనుభవాలుఫేస్‌ చేశారు, సంజయ్‌ దత్‌, ప్రభాస్‌లోకి ఎలా వచ్చాడు, ఆ తర్వాత ఏం చేశాడనేది ఈ మూవీ అని తెలుస్తుంది. ఆద్యంతం రొమాంటిక్‌ హర్రర్‌ థ్రిల్లర్‌గా ఇది సాగుతుందని, కామెడీ హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రం ద్వారా వింటేజ్‌ ప్రభాస్‌ని మనం చూడొచ్చు అని దర్శకుడు మారుతి చెప్పిన విషయం తెలిసిందే.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bollywood Hits: ఎక్కువ హిట్లు కొట్టిన టాప్ 5 హీరోయిన్లు.. కరీనా కపూర్ కి షాకిచ్చిన దీపికా
Recommended image2
Oh My Goddess: అక్షయ్ కుమార్‌కు మరో షాక్, పెద్ద సినిమా నుంచి స్టార్ హీరోయిన్ సడెన్‌గా అవుట్!
Recommended image3
Vijay React on Divorce: భార్య సంగీతతో విడాకులు, తొలిసారి స్పందించిన విజయ్.. అభిమానులకు క్లారిటీ
Related Stories
Recommended image1
ఆ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ తో మూవీ వద్దనుకున్నా..ముగ్గురు హీరోయిన్లపై డైరెక్టర్ మారుతి కామెంట్స్
Recommended image2
`రాజాసాబ్‌ 2`పై హింట్‌ ఇచ్చిన దర్శకుడు మారుతి.. నిడివి విషయంలో `పుష్ప 2`, `కల్కి 2898 ఏడీ`లకు పోటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved