- Home
- Entertainment
- ఆ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ తో మూవీ వద్దనుకున్నా..ముగ్గురు హీరోయిన్లపై డైరెక్టర్ మారుతి కామెంట్స్
ఆ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ తో మూవీ వద్దనుకున్నా..ముగ్గురు హీరోయిన్లపై డైరెక్టర్ మారుతి కామెంట్స్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ టీజర్ ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజా సాబ్ పై అనుమానాలు పటాపంచలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ఈ చిత్రం చాలా కాలంగా వాయిదా పడుతుండడంతో అనేక రూమర్స్ వైరల్ అయ్యాయి.బడ్జెట్ సమస్యలు తలెత్తాయని ప్రచారం జరిగింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ చిత్రంపై ఉన్న అనుమానాలు పటాపంచలు చేస్తూ చిత్ర యూనిట్ తాజాగా అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు.
ప్రభాస్ కామెడీ టైమింగ్ అదుర్స్
టీజర్ లో ప్రభాస్ కామెడీ టైమింగ్, యాక్షన్, రొమాన్స్, హర్రర్ ఎలిమెంట్స్ ఎలా ప్రతి ఒక్క అంశం విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్ తో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. టీజర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోపీచంద్ తో పక్కా కమర్షియల్ చిత్రం చేస్తున్న సమయంలో యువి క్రియేషన్స్ వంశీ ద్వారా ప్రభాస్ గారిని కలిసే అవకాశం దక్కింది. ఆ విధంగా ప్రభాస్ తో ఈ జర్నీ మొదలైంది.
బుజ్జిగాడు తరహా చిత్రం
ఆయన నాతో బుజ్జిగాడు తరహా కామెడీ టైమింగ్ ఉన్న చిత్రం చేయాలని ఉందని చెప్పారు. అలాగేనండి అని చెప్పా. నన్ను అండి అనొద్దు డార్లింగ్ అని పిలువు అని ప్రభాస్ నాతో అన్నారు. అది ప్రభాస్ వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆ తర్వాత మా మధ్య కథ గురించి తరచుగా చర్చలు జరుగుతూ ఉండేది. ఇంతలో పక్కా కమర్షియల్ మూవీ రిలీజ్ అయి నిరాశపరిచింది. ప్రభాస్ ఏమో భారీ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు.
ఆ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ తో మూవీ వద్దనుకున్నా
ఇలాంటి టైంలో ప్రభాస్ తో మూవీ వద్దనుకున్నాను. మన కాంబినేషన్ లో ఇప్పుడు మూవీ వద్దు తర్వాత చేద్దాం అని చెప్పేద్దాం అనుకున్నా. కానీ మా మధ్య కథా చర్చలు జరుగుతున్నప్పుడు కొన్ని అంశాలు ఆయనకు విపరీతంగా నచ్చి ఎంకరేజ్ చేసేవారు. ప్రభాస్ నాపై ఇంత నమ్మకంతో ఉన్నాడు.. మనమేంటి భయపడుతున్నాం అని అనిపించింది. ఏది ఏమైనా ప్రభాస్ తో ఒక మంచి చిత్రం చేయాలని డిసైడ్ అయ్యాను. ఆ విధంగా రాజా సాబ్ చిత్రం ప్రారంభమైంది అని మారుతి తెలిపారు.
ఇద్దరు హీరోయిన్లు కావాలని ప్రభాస్ అడిగారు
ఇటీవల ప్రభాస్ నటించిన సలార్, ఆది పురుష, కల్కి లాంటి చిత్రాల్లో హీరోయిన్లతో ఆయనకు అంతగా రొమాన్స్ లేదు. దీంతో ప్రభాస్ స్వయంగా.. డార్లింగ్ ఈ మూవీలో కుదిరితే ఇద్దరు హీరోయిన్లని పెట్టగలవా అని నన్ను అడిగారు. నేను వెంటనే.. నీ రేంజ్ కి ఇద్దరు హీరోయిన్లు ఏంటి డార్లింగ్ ముగ్గురిని పెడతాను అని చెప్పాను. ఆ విధంగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఇక సాంగ్స్, కొంత భాగం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని మారుతి తెలిపారు.