MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `రాజాసాబ్‌ 2`పై హింట్‌ ఇచ్చిన దర్శకుడు మారుతి.. నిడివి విషయంలో `పుష్ప 2`, `కల్కి 2898 ఏడీ`లకు పోటీ

`రాజాసాబ్‌ 2`పై హింట్‌ ఇచ్చిన దర్శకుడు మారుతి.. నిడివి విషయంలో `పుష్ప 2`, `కల్కి 2898 ఏడీ`లకు పోటీ

ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న `రాజాసాబ్‌` మూవీ టీజర్‌ విడుదలైంది. ఈ సందర్భంగా పార్ట్ 2పై హింట్‌ ఇచ్చారు దర్శకుడు మారుతి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 16 2025, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
`ది రాజాసాబ్‌` టీజర్‌తో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కి ట్రీట్‌
Image Credit : print shots

`ది రాజాసాబ్‌` టీజర్‌తో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కి ట్రీట్‌

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న `రాజా సాబ్‌` మూవీ టీజర్‌ విడుదలయ్యింది. ఎప్పుడెప్పుడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా, ఎట్టకేలకు టీజర్‌ని ఇచ్చింది టీమ్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో ఈ టీజర్ ని అభిమానులకు చూపించారు. అలాగే సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. తాజాగా విడుదలైన `రాజాసాబ్‌` టీజర్‌ ఆకట్టుకుంటుంది. ఊహకు మించి ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`ది రాజాసాబ్‌` టీజర్‌లో విజువల్స్ మైండ్‌ బ్లోయింగ్‌
Image Credit : print shots

`ది రాజాసాబ్‌` టీజర్‌లో విజువల్స్ మైండ్‌ బ్లోయింగ్‌

మారుతి దర్శకత్వంలో `రాజాసాబ్‌` మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రభాస్‌ని ఆయన డీల్‌ చేయగలడా? హార్రర్‌ సినిమాలో ప్రభాస్‌ని ఎలా చూపిస్తారు? అనే డౌట్స్ ఉండేవి. కానీ సోమవారం విడుదల చేసిన టీజర్‌ మాత్రం మతిపోయేలా ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువే ఉంది. 

ముఖ్యంగా ఇందులో విజువల్స్ హైలైట్‌గా నిలిచాయి. వీఎఫ్‌ఎక్స్ షాట్స్ అదిరిపోయాయి.  రాజావారి కోటా అద్భుతంగా ఉంది. మిగిలిన లొకేషన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ టీజర్ చూస్తుంటే సినిమాలో విజువల్స్ వేరే లెవల్‌ అని, అదే హైలైట్‌గా ఉండబోతుందని తెలుస్తుంది.

Related Articles

Related image1
ప్రభాస్: బాలీవుడ్‌లో ఆ రికార్డు సాధించిన ఏకైక సౌత్‌ హీరో.. 10 ఏళ్లలో 6 సినిమాలతో సంచలనం
Related image2
ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ వచ్చేసింది..రెబల్ స్టార్ కామెడీ టైమింగ్ చూశారా, మైండ్ బ్లోయింగ్ విజువల్స్
35
వింటేజ్‌ లుక్‌లో ప్రభాస్‌ రచ్చ
Image Credit : print shots

వింటేజ్‌ లుక్‌లో ప్రభాస్‌ రచ్చ

ఇక ఇందులో ప్రభాస్‌ని కామెడీగా చూపించిన తీరు బాగుంది. వింటేజ్‌ ప్రభాస్‌ని చూపించారు మారుతి. లవ్‌, రొమాన్స్, కామెడీ, భయం, ఫాంటసీ ఎలిమెంట్లు ఇలా అన్ని మేళవింపుగా ఉన్నాయి. ఫాంటసీ ఎలిమెంట్లతో కూడిన రొమాంటిక్‌ హర్రర్‌ కామెడీగా `రాజా సాబ్‌` టీజర్‌ ఆకట్టుకుంది. ఇది సినిమాపై అంచనాలను పెంచింది.

45
`రాజాసాబ్‌ 2`పై దర్శకుడు మారుతి క్లారిటీ
Image Credit : Asianet News

`రాజాసాబ్‌ 2`పై దర్శకుడు మారుతి క్లారిటీ

ఈ క్రమంలో `రాజాసాబ్‌ 2`పై హింట్‌ ఇచ్చాడు దర్శకుడు మారుతి. `రాజా సాబ్‌` టీజర్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ పార్ట్ 2కి సంబంధించిన అప్‌ డేట్‌ ఇచ్చారు. రెండో పార్ట్ ని సినిమా కంప్లీట్‌ అయ్యాక నిర్ణయిస్తామని తెలిపారు. ఇంకా కన్ఫమ్‌గా అనుకోలేదని చెప్పారు. దీంతో పార్ట్ 2 ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు.

 అదే సమయంలో మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు దర్శకుడు మారుతి. పార్ట్ 2 ఉంటే ఫోర్స్ గా ఉండదని, దానికి సరైన కారణం, సరైన లీడ్‌ ఉంటుందన్నారు. ఏదో తీయాలి, ఏదో చేయాలనే ప్రమోషన్‌ స్టంట్‌ లాగా ఉండదని ఆయన వెల్లడించారు.

55
`పుష్ప 2`, `కల్కి`కి పోటీగా `రాజాసాబ్‌` నిడివి
Image Credit : print shots

`పుష్ప 2`, `కల్కి`కి పోటీగా `రాజాసాబ్‌` నిడివి

దీంతోపాటు `రాజాసాబ్‌` నిడివిపై కూడా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు మారుతి. సినిమా మూడు గంటలకు పైగానే ఉంటుందన్నారు. మొదట మూడున్నర గంటలు అని చెప్పి, ఏదో మాట వరుసకి అలా అన్నానని, మూడు గంటలకుపైగానే నిడివి ఉంటుందన్నారు. ఆ నిడివి ఇంకా ఫైనల్‌ కావాల్సి ఉందన్నారు. 

దర్శకుడు చెప్పిన దానిప్రకారం `రాజాసాబ్‌` మూవీ నిడివి కూడా మూడు గంటలకుపైగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ లెక్కన `పుష్ప 2`, `కల్కి 2898 ఏడీ` సినిమాల తరహాలోనే `రాజాసాబ్‌` కూడా లాంగ్‌ నిడివితోనే రాబోతుందని అర్థమవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Taapsee Pannu Fitness: అమ్మాయిలూ ఈ తప్పు అస్సలు చేయొద్దు.. జీవితాంతం బాధపడతారు
Recommended image2
Kota Srinivasa Rao: తెల్లవార్లు ఫుల్ గా తాగుతాడురా కోట అన్న పేరు ఎందుకు వచ్చింది, అసలు నిజం ఇదే..
Recommended image3
Varanasi Movie: రాజమౌళి సినిమా సెట్ లీక్.. ఉగ్రభట్టి గుహల ఫోటోలు వైరల్!
Related Stories
Recommended image1
ప్రభాస్: బాలీవుడ్‌లో ఆ రికార్డు సాధించిన ఏకైక సౌత్‌ హీరో.. 10 ఏళ్లలో 6 సినిమాలతో సంచలనం
Recommended image2
ప్రభాస్ 'రాజా సాబ్' టీజర్ వచ్చేసింది..రెబల్ స్టార్ కామెడీ టైమింగ్ చూశారా, మైండ్ బ్లోయింగ్ విజువల్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved