MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • రాధిక శరత్ కుమార్ కు జాక్‌పాట్.. లాభాల్లో వాటా అందుకున్న తొలి నటిగా రికార్డ్

రాధిక శరత్ కుమార్ కు జాక్‌పాట్.. లాభాల్లో వాటా అందుకున్న తొలి నటిగా రికార్డ్

శివకార్తికేయన్ నిర్మాణంలో వచ్చిన 'తాయ్ కిళవి' సినిమాతో నటి రాధిక శరత్‌కుమార్ ఓ అరుదైన ఘనత సాధించారు. ఈ సినిమాకు వచ్చిన లాభాల్లోంచి ఆమె వాటా అందుకున్నారు. తమిళ సినీ పరిశ్రమలో ఇలా ప్రాఫిట్ షేరింగ్ తీసుకున్న తొలి నటిగా ఆమె నిలిచారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 13 2026, 01:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
వయసు మళ్లిన పాత్రలో రాధిక
Image Credit : Instagram

వయసు మళ్లిన పాత్రలో రాధిక

డెబ్యూ డైరెక్టర్ శివకుమార్ మురుగేషన్ దర్శకత్వంలో రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన 'తాయ్ కిళవి' సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైంది. వయసు మళ్లిన పాత్రలో రాధిక నటనకు, కథకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా ఇప్పటివరకు రూ. 55 కోట్లకు పైగా వసూలు చేసి, మంచి లాభాలతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హీరో శివకార్తికేయన్ నిర్మాతగా..
Image Credit : Instagram

హీరో శివకార్తికేయన్ నిర్మాతగా..

నటుడు శివకార్తికేయన్ నిర్మించి, శివకుమార్ మురుగేషన్ దర్శకత్వం వహించిన 'తాయ్ కిళవి' సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌ను చెన్నైలోని ఓ ప్రైవేట్ స్టార్ హోటల్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు శివకార్తికేయన్, రాధికతో పాటు చిత్ర యూనిట్ హాజరైంది.
36
 బ్లాక్‌బస్టర్‌ హిట్ సినిమా..
Image Credit : Instagram

బ్లాక్‌బస్టర్‌ హిట్ సినిమా..

ఈ సినిమాలో ఒక మహిళ సమాజంలో ఎలా బతుకుతుంది, ఎలాంటి కష్టనష్టాలు ఎదుర్కొంటుంది అనే విషయాన్ని దర్శకుడు శివకుమార్ మురుగేషన్ కామెడీతో అందంగా చూపించారు. ఈ సినిమా తమిళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తన శరీరాన్ని కష్టపెట్టి మరీ ఒక నటిగా తన ప్రతిభను ఎలా బయటకు తీసుకురావచ్చో రాధిక శరత్‌కుమార్‌ను చూసి నేర్చుకోవచ్చు.
46
 రాధిక శరత్‌కుమార్ కామెంట్స్..
Image Credit : Instagram

రాధిక శరత్‌కుమార్ కామెంట్స్..

ఈ వేడుకలో నటి రాధిక మాట్లాడుతూ..‘‘నిజమైన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ  స్టేజ్ పై నిలబడ్డాను. నేను దేన్నీ సీరియస్‌గా తీసుకోను. ఈ సినిమా నాకు బాగా నచ్చడంతో నటించడానికి ఒప్పుకున్నాను. 'చిన్ని' సీరియల్ తర్వాత, ఒక మహిళ ఒంటరిగా పోరాడే కథలా ఇది అనిపించింది. అందుకే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను’’ అని రాధిక తన సంతోషాన్ని పంచుకున్నారు.

56
మహిళల కోసం ప్రత్యేకంగా..
Image Credit : X

మహిళల కోసం ప్రత్యేకంగా..

‘‘ఈ సినిమా సక్సెస్ తర్వాత నిన్న ఒక్కరోజే 6 కథలు విన్నాను. అవన్నీ ముసలావిడ పాత్రలే. డైరెక్టర్లు వచ్చి కథలు చెబుతుంటే ఆశ్చర్యంగా అనిపించి, అందరినీ 'స్టాప్' అని ఆపేశాను’’ అని రాధిక సరదాగా అన్నారు. ఈ సినిమాకు మహిళల కోసం తక్కువ ధరకే టిక్కెట్లు అమ్మినా రూ. 50 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. డైరెక్టర్ శివకుమార్ మురుగేషన్ కోసం ఈ సినిమా విజయం సాధించాలని కమల్ హాసన్ అన్నారని రాధిక గుర్తుచేసుకున్నారు.
66
రాధిక శరత్ కుమార్ రికార్డు..
Image Credit : X

రాధిక శరత్ కుమార్ రికార్డు..

‘‘48 ఏళ్ల నా నటన అనుభవంలో ఇప్పటివరకు నాకు దక్కనిది ఒకటి దక్కింది. అదే సినిమా లాభాల్లో వాటాను జీతంగా అందుకోవడం. తమిళ చిత్ర పరిశ్రమలో లాభాల్లో వాటా తీసుకున్న మొదటి హీరోయిన్‌ను బహుశా నేనేనేమో. ఈ సినిమా ప్రతిరోజూ మంచి వసూళ్లు రాబడుతోంది. నా సంతోషం, ఈ సినిమాలో నటించిన గర్వం కోసం చెబుతున్నా.. నాకు చాలా ఆనందంగా ఉంది’’ అని రాధిక శరత్‌కుమార్ అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Related Stories
Recommended image1
Chiranjeevi: నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది, కూతురికి మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ విషెస్..
Recommended image2
మోహన్ బాబు కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్, ఆమె భర్తకు మంచు హీరో వార్నింగ్, ఇంతకీ ఎవరామె?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved