- Home
- Entertainment
- శోభన్ బాబు ను సెట్ లో చూసి, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు అని.. ఇంప్రెస్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
శోభన్ బాబు ను సెట్ లో చూసి, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు అని.. ఇంప్రెస్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
శోభన్ బాబు ఆంధ్రా అందగాడు..సోగ్గాడు, అందాల నటుడు. ఆయన అంటే అభిమానించనివారు ఉండరు. ఇక శోభన్ బాబును ఫస్ట్ టైమ్ సెట్ లో చూసి.. ఎంత అందంగా ఉన్నాడో అని ఇంప్రెస్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ రొమాంటిక్ హీరో..
టాలీవుడ్‌లో ఒకప్పుడు రొమాంటిక్ హీరోగా శోభన్ బాబుకు పేరుంది. ఆంధ్రా అందగాడు, సోగ్గాడు, అందాల నటుడు, నటభూషణ్... ఇలా శోభన్ బాబును అభిమానులు రకరకాలుగా పిలుచుకునేవారు. సిల్వర్ స్క్రీన్ పై శోభన్ బాబు నటన, స్టైల్, కూల్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి సామాన్య జనం, కోట్లాది ఆడియన్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా ఎంతో ఇష్టపడేవారు. అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన శోభన్ బాబు... కెరీర్ బిగినింగ్ లో ఎన్నో కష్టాలు అనుభవించారు. కనీసం ఫ్యాన్ కూడా లేని రోజుల్లో తన కుటుంబంతో కలిసి సింగిల్ రూమ్ లో నివసించారు శోభన్ బాబు. అన్ని కష్టాలు అనుభవించారు కాబట్టే.. ఆయన హీరోగా స్థిరపడిన తరువాత కూడా డబ్బు విలువ తెలిసి ప్రవర్తించేవారు.
శోభన్ బాబుతో నటించడానికి పోటీ పడ్డ హీరోయిన్లు..
ఇక శోభన్ బాబు అప్పట్లో ఉన్న హీరోలందరిలో చాలా హ్యాండ్సమ్ గా ఉండేవారు. అటు అభిమానులతో పాటు .. ఇటు హీరోయిన్లు కూడా శోభన్ బాబును తెగ ప్రేమించేవారు. సోగ్గాడి సరసన అవకావం వస్తే.. అస్సలు వదులుకునేవారు కాదు. అలా అని ఆయన ఎప్పుడూ హీరోయిన్లతో మిస్ బిహేవ్ చేసింది లేదు. చాలా పద్దతిగా, స్ట్రిక్ట్ గా మెయింటేన్ చేసేవారు. అందుకే శోభన్ బాబును మరింతగా అభిమానించేవారు. ఒక హీరోయిన్ అయితే ఆయన్ను ఫస్ట్ టైమ్ సెట్ లో చూసి.. ఎంత అందంగా ఉన్నాడు రా బాబు అని అనుకుందట. ఆ హీరోయన్ మరెవరో కాదు రాధిక శరత్ కుమార్.
శోభన్ బాబు గురించి రాధిక కామెంట్స్..
ఈమధ్య కాలంలో శోభన్ బాబుకు సంబంధించిన ఓ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఆయనతో కలిసి నటించిన హీరోయిన్లు చాలామంది పాల్గోన్నారు. శోభన్ బాబు గురించి ఎన్నో విషయాలను వారు వెల్లడించారు. ఈక్రమంలో రాధిక మాట్లాడుతూ.. శోభన్ బాబు గురించి కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. రాధిక మాట్లాడుతూ.'' నేను శోభన్ బాబుగారితో చాలా సినిమాల్లో కలిసి నటించాను. ఆయనలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. సెట్ లోకి వెళ్లిన ప్రతీసారి.. అలా చూస్తూ ఉండిపోతాము.. నేను అయితే ఎంత అందంగా ఉన్నాడు అని ఇంప్రెస్ అయ్యేదాన్ని. బట్ శోభన్ బాబు గారు చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. అద్భుతంగా నటించేవారు. ఎవరితో ఎంత వరకూ మాట్లాడాలో అంత వరకే మాట్లాడేవారు''. అని రాధిక అన్నారు?
టైమ్ అంటే టైమ్..
రాధిక మాట్లాడుతూ.. '' శోభన్ బాబు గారు చాల స్ట్రిక్ట్.. షూటింగ్ కు టైమ్ కు వచ్చేవారు.. సరిగ్గా 5.45 అయ్యిందంటే పక్కాగా పేకప్ చెప్పాల్సిందే. ఆయనతో నటించినప్పుడు ఆ టైమింగ్స్ నాకు కూడా అలవాటు అయ్యాయి. వేరే సినిమాలు చేస్తున్నప్పుడు.. చాలా టైమ్ అయ్యింది అని అంటే.. నన్ను తిట్టుకునేవారు. ఈవిడ శోభన్ బాబు గారి సినిమాలు చేసి.. బాగా అలవాటు చేసుకుంది అని అనేవారు. ఆయన చాలా పద్దతిగా తన లైఫ్ ను మెయింటేన్ చేశారు అని రాధిక వెల్లడించారు.

