- Home
- Entertainment
- Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
పూరి జగన్నాధ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు టాలీవుడ్ ఎంతో ఇష్టమైన హీరో ఎవరో రివీల్ చేశారు. తనకి ధైర్యం ఇచ్చిన హీరోయిన్ గురించి కూడా మాట్లాడారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పూరి జగన్నాధ్ కామెంట్స్
టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎందరో హీరోలని స్టార్లుగా మార్చారు. అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. పూరి జగన్నాధ్ కెరీర్ లో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో పూరి తెరకెక్కించిన చిత్రాలు అంతగా వర్కౌట్ కావడం లేదు. కొత్త తరం దర్శకుల హవా ముందు పూరి నిలబడలేకపోతున్నారు.

దర్శకుడిగా, నిర్మాతగా విజయాలు
పూరి జగన్నాధ్ నిర్మాతగా కూడా రాణించారు. వైష్ణో అకాడమీ అనే బ్యానర్ లో పోకిరి, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సూపర్ హిట్ చిత్రాలని పూరి నిర్మించారు. కొన్ని ఫ్లాపుల తర్వాత పూరి జగన్నాధ్ భారీ స్థాయిలో డబ్బు కోల్పోయారు. ఆ తర్వాత ప్రొడక్షన్ జోలికి వెళ్ళలేదు అని పూరి తెలిపారు. నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పూరి పాల్గొన్న సంధర్భంగా ఈ విషయాలు రివీల్ చేశారు.
ఏ ధైర్యంతో మళ్ళీ మొదలుపెట్టావు ?
ప్రొడక్షన్ లో డబ్బు పోయాక దాని జోలికి వెళ్ళలేదు. ప్రొడక్షన్ అనేది సపరేట్ గేమ్. కథలు రాస్తూ దర్శకత్వం చేస్తూ ప్రొడక్షన్ కూడా మేనేజ్ చేయడం అంత సులభం కాదు అని పూరి అన్నారు. అయితే మళ్ళీ ఏ ధైర్యంతో పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ స్థాపించావు అని బాలయ్య ప్రశ్నించగా పూరి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. జ్యోతి లక్ష్మి సినిమా చేస్తున్నప్పుడు ఆ మూవీలో నటిస్తూ, ప్రొడక్షన్ పనులు కూడా ఛార్మినే చూసుకుంది. చాలా అద్భుతంగా చేసింది. ఆమెకి సినిమా నిర్మాణం అంటే చాలా ఇష్టం.
ఆమె వల్లే ధైర్యం వచ్చింది
ఛార్మిని చూసి నాకు కూడా కాన్ఫిడెన్స్, ధైర్యం వచ్చాయి అని పూరి అన్నారు. నిర్మాణ పనులు ఆమె చూసుకుంటుంది కాబట్టి ఆ ధైర్యంతో బ్యానర్ స్థాపించినట్లు పూరి జగన్నాధ్ తెలిపారు.
పూరికి ఇష్టమైన హీరో
బాలయ్య పూరిని మరో ఆసక్తికర ప్రశ్న అడిగారు. నీవు వర్క్ చేసిన హీరోల్లో ఎవరంటే నీకు బాగా ఇష్టం అని అడిగారు. ఏఈ ప్రశ్నకు పూరి ఓపెన్ గా సమాధానం ఇచ్చారు. గుండెలపై చేయి వేసుకుని చెబుతున్నా, నాకు బాలయ్య బాబు అంటేనే ఎక్కువ ఇష్టం అని పూరి జగన్నాధ్ అక్కడున్న ఆడియన్స్ కి చెప్పారు. దీనితో బాలయ్య లేచి వచ్చి పూరిని హగ్ చేసుకున్నారు. వీరిద్దరి కాంబోలో పైసా వసూల్ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే.

