MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rohit: అతడు కనిపిస్తే క్యాసెట్ ముక్క దొరికేది కాదు, చిరంజీవి కూడా.. అడ్రెస్ లేకుండా పోయింది అందుకే

Rohit: అతడు కనిపిస్తే క్యాసెట్ ముక్క దొరికేది కాదు, చిరంజీవి కూడా.. అడ్రెస్ లేకుండా పోయింది అందుకే

Hero Rohit: తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలతో పాటు యువతలో మంచి గుర్తింపు పొందిన నటుడు రోహిత్. అయితే రోహిత్ తక్కువ సమయంలోనే టాలీవుడ్ నుంచి కనుమరుగయ్యారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : May 24 2026, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హీరో రోహిత్
Image Credit : Asianet News

హీరో రోహిత్

2000 సంవత్సరం తర్వాత టాలీవుడ్ లో చాలా మంది కొత్త హీరోలు ఫేమస్ అయ్యారు. అప్పటి వరకు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య లాంటి సీనియర్ హీరోల హవానే ఎక్కువగా ఉండేది. కానీ ఆ తర్వాత తరుణ్, ఉదయ్ కిరణ్ లాంటి వాళ్ళు యువతలో పాపులారిటీ సొంతం చేసుకోవడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే 6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్ లాంటి హిట్స్ తో రోహిత్ కూడా క్రేజ్ సొంతం చేసుకున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
కంటతడి పెట్టించే పాత్రలో రోహిత్
Image Credit : telugu stop

కంటతడి పెట్టించే పాత్రలో రోహిత్

మంచి హైట్, పర్సనాలిటీ ఉన్న అందగాడిగా రోహిత్ కి యువతలో పాపులారిటీ దక్కింది. చిరంజీవితో కలసి శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రంలో కీలక పాత్రలో రోహిత్ నటించారు. ఈ మూవీలో రోహిత్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆడియన్స్ కి కంటతడి పెట్టించేలా సీన్లు ఉంటాయి.

Related Articles

Related image1
Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Related image2
Peddi: సరుకు సామాన్లు నుంచి మిడిల్ ఫింగర్ వరకు..పెద్దికి సెన్సార్ బోర్డు షాక్, అవన్నీ తొలగించాల్సిందే
35
ఆడియో క్యాసెట్ దొరికేది కాదు
Image Credit : Asianet News

ఆడియో క్యాసెట్ దొరికేది కాదు

రోహిత్ నటించిన దాదాపు అన్ని సినిమాలో ఆడియో ఆల్బమ్స్ సూపర్ హిట్ అయ్యాయి. రోహిత్ బొమ్మ కనిపిస్తే చాలు ఆడియో క్యాసెట్లు విపరీతంగా అమ్ముడయ్యేవి. కానీ సడన్ గా రోహిత్ టాలీవుడ్ నుంచి కనుమరుగయ్యారు. ఎవరో కుట్ర చేసి రోహిత్ ని తొక్కేయలేదు. తాను చేసిన తప్పిదం వల్లే సినిమా అవకాశాలు తగిపోయాయి అని రోహిత్ ఓ ఇంటర్వ్యూలో అంగీకరించారు.

45
నేను చేసిన తప్పు అదే
Image Credit : Asianet News

నేను చేసిన తప్పు అదే

హీరోగా నాకు మంచి క్రేజ్ వచ్చింది. నా సినిమాలో పాటల బావుంటాయి అందరిలో నమ్మకం ఏర్పడింది. వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవాలి అనే ఉద్దేశంతో స్క్రిప్ట్ విషయంలో కఠినంగా వ్యవహరించడం ప్రారంభించా. నా మనసుకు స్క్రిప్ట్ నచ్చకపోతే దర్శకుల ముఖం మీదే చెప్పేసేవాడిని. అలోచించి నా నిర్ణయం చెబుతా అని అనేవాడిని కాదు. అలా చెబితే వాళ్ళు నా కోసం ఎదురుచూడడం, టైం వేస్ట్ కావడం జరుగుతుంది.

55
అందువల్లే ఇండస్ట్రీకి దూరమయ్యా
Image Credit : Asianet News

అందువల్లే ఇండస్ట్రీకి దూరమయ్యా

నచ్చకపోతే వెంటనే నో చెబితే మరో వర్క్ ని వాళ్ళు మొదలు పెట్టుకుంటారు. మంచి కోసం తీసుకున్న ఆ నిర్ణయమే నాకు శాపంగా మారింది. అప్పటి వరకు చాలా మంది దర్శకులు నిర్మాతలు నాతో సినిమా చేయాలని ఎగబడేవారు. కానీ స్క్రిప్ట్ బాగాలేదని నేను ముఖం మీదే చెప్పడంతో కొందరు హర్ట్ అయ్యారు. నా గురించి నెగిటివ్ గా చెప్పడం ప్రారంభించారు. అది నాకు మైనస్ అయింది అని రోహిత్ పేర్కొన్నారు. ఆ మధ్యన రోహిత్ ఓ మూవీ ఈవెంట్ లో కనిపించినప్పుడు చిరంజీవి కూడా గుర్తు పట్టలేకపోయారు. రోహిత్ నువ్వా.. చాలా రోజుల తర్వాత చూడడంతో గుర్తుపట్టలేకపోయా అని చిరంజీవి ఆ ఈవెంట్ లో అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nagarjuna: 40 ఏళ్ల ప్రయాణంలో.. ఒకే రోజు రెండు అద్భుతాలు, ఏఎన్నార్ ను తలుచుకుని నాగార్జున ఎమోషనల్
Recommended image2
Rashmika Mandanna: రష్మిక మందన్న లో ఈ టాలెంట్ కూడా ఉందా? విజయ్ కట్టిన తాళిలో సీక్రెట్ ఏంటో తెలుసా?
Recommended image3
Sobhan Babu: నోరు తెరిస్తే డబ్బు, పరమ పీనాసోడు, పక్కా బిజినెస్ మేన్.. శోభన్ బాబుపై స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
Vijayashanti: విజయశాంతి క్రేజ్ చూసి అసూయపడ్డ అగ్ర హీరో ఎవరు ? వీళ్ల పక్కనా నటించింది నేను, అసహ్యం వేసింది
Recommended image2
Peddi: సరుకు సామాన్లు నుంచి మిడిల్ ఫింగర్ వరకు..పెద్దికి సెన్సార్ బోర్డు షాక్, అవన్నీ తొలగించాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved