MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Priyanka Chopra: నిక్ పక్కనుండగానే ప్రియాంక చోప్రా కన్నీళ్లు, కారణం ఏంటి?

Priyanka Chopra: నిక్ పక్కనుండగానే ప్రియాంక చోప్రా కన్నీళ్లు, కారణం ఏంటి?

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ బ్యూటీ  ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ జంట సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 04 2026, 06:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
నిక్ జోనస్ షేర్ చేసిన త్రోబ్యాక్ పిక్..
Image Credit : Instagram

నిక్ జోనస్ షేర్ చేసిన త్రోబ్యాక్ పిక్..

బాలీవుడ్ 'దేశీ గర్ల్' ప్రియాంక చోప్రా, అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనస్ జంట ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా నిక్ జోనస్ షేర్ చేసిన ఒక 'త్రోబ్యాక్' ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూ అభిమానుల మనసు దోచుకుంటోంది. మరోవైపు, ప్రియాంక తన తండ్రిని గుర్తుచేసుకుని ఎమోషనల్ అయ్యారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
రంగుల్లో మునిగిన ప్రియాంక చోప్రా..
Image Credit : Instagram

రంగుల్లో మునిగిన ప్రియాంక చోప్రా..

నిక్ జోనస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంకతో కలిసి రంగుల్లో మునిగి తేలుతున్న పాత ఫోటోను పంచుకున్నారు. గత హోలీ పండుగ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, "ఇది నాకు ఇష్టమైన హోలీ జ్ఞాపకాలలో ఒకటి" అని క్యాప్షన్ పెట్టారు.

38
ఇంటర్నేషనల్ అల్లుడు
Image Credit : Instagram

ఇంటర్నేషనల్ అల్లుడు

ఈ ఫోటోలో ఇద్దరూ తెల్లటి సంప్రదాయ దుస్తుల్లో, ముఖం నిండా రంగులతో మెరిసిపోతున్నారు. విదేశాల్లో ఉన్నా భారతీయ పండుగలను ఎంత ఘనంగా జరుపుకుంటారో ఈ జంట చూపిస్తోంది. అందుకే భారతీయ అభిమానులు నిక్‌ను ప్రేమగా 'ఇంటర్నేషనల్ అల్లుడు' అని పిలుచుకుంటారు.
48
ప్రియాంక చోప్రా ఎమోషనల్...
Image Credit : Instagram

ప్రియాంక చోప్రా ఎమోషనల్...

పండుగ సంబరాల మధ్యే, ప్రియాంక ఇటీవల 'మిథికల్ కిచెన్' ఇంటర్వ్యూలో తన దివంగత తండ్రి అశోక్ చోప్రా గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. 2013లో క్యాన్సర్‌తో మరణించిన తన తండ్రి జ్ఞాపకాలు ఇప్పటికీ తన జీవితంలోని ప్రతి దశలోనూ ఉన్నాయని ఆమె పంచుకున్నారు.
58
తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్లు..
Image Credit : Instagram

తండ్రిని తలుచుకుంటూ కన్నీళ్లు..

ఆశ్చర్యకరంగా, ప్రియాంక తన భర్త నిక్ జోనస్‌లో తన తండ్రి పోలికలను చూస్తారట. "మా నాన్నకు సంగీతం అంటే ప్రాణం. నిక్ కూడా గొప్ప సంగీత విద్వాంసుడు. ఒకవేళ నాన్న బతికుంటే, నాకోసం అబ్బాయిని వెతకాల్సి వస్తే, కచ్చితంగా నిక్ లాంటి వ్యక్తినే ఎంచుకునేవారు" అని ప్రియాంక చెప్పారు.
68
క్రియేటివ్ ఇన్‌స్పిరేషన్ ..
Image Credit : Instagram

క్రియేటివ్ ఇన్‌స్పిరేషన్ ..

భర్త సృజనాత్మకతను ప్రియాంక ఎంతగానో మెచ్చుకున్నారు. "నాకు ఎప్పుడైనా క్రియేటివ్ ఇన్‌స్పిరేషన్ కావాలంటే, నిక్ స్టూడియోకి వెళ్తాను. అతను తన ఆలోచనలను పాటలుగా మార్చే విధానం చూడటం ఓ అద్భుతమైన అనుభూతి. అతను నిజంగా ఓ మ్యూజిక్ మ్యాజిషియన్" అని ఆమె అన్నారు.
78
సెలబ్రిటీ జంట
Image Credit : Instagram

సెలబ్రిటీ జంట

2018లో జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఈ జంట హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. ఇప్పటికీ ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన సెలబ్రిటీ జంటలలో వీరు ఒకరిగా నిలుస్తున్నారు.
88
విభిన్న సంస్కృతులు..
Image Credit : Instagram

విభిన్న సంస్కృతులు..

ప్రియాంక, నిక్‌ల బంధం విభిన్న సంస్కృతులు ఎంత అందంగా కలిసిపోవచ్చో చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ. మొత్తానికి, నిక్ షేర్ చేసిన హోలీ ఫోటో, ప్రియాంక ఎమోషనల్ మాటలు ఇప్పుడు అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Recommended image2
విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved