MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Chiranjeevi: చిరంజీవి కెరీర్‌లో ఆ మూవీ ఓ మాయని మచ్చ.. రూ. 100 కోట్లతో తీస్తే వారం రోజుల్లోనే.!

Chiranjeevi: చిరంజీవి కెరీర్‌లో ఆ మూవీ ఓ మాయని మచ్చ.. రూ. 100 కోట్లతో తీస్తే వారం రోజుల్లోనే.!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుత విజయాలు ఉన్నాయి. అయితే, 'ఆచార్య' సినిమా ఆయన కెరీర్‌లోనే ఒక మాయని మచ్చలా మిగిలిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన ఈ చిత్రం ఎందుకు అంత దారుణంగా విఫలమైంది.

2 Min read
Author : Pavithra D
Published : Mar 04 2026, 06:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చిరంజీవి 40 ఏళ్ల కెరీర్‌లో కోలుకోలేని దెబ్బ
Image Credit : Chiranjeevi\Instagram

చిరంజీవి 40 ఏళ్ల కెరీర్‌లో కోలుకోలేని దెబ్బ

మెగాస్టార్ చిరంజీవి తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను సృష్టించారు. తన డ్యాన్స్, ఫైట్స్, నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, ఏ రంగంలోనైనా విజయాలతో పాటు పరాజయాలు సహజం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ సినిమా డిజాస్టర్
Image Credit : our own

ఆ సినిమా డిజాస్టర్

చిరంజీవి కెరీర్‌లో కూడా 'బిగ్ బాస్', 'మృగరాజు', 'భోళాశంకర్' వంటి ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి. కానీ, వీటన్నింటికంటే 'ఆచార్య' సినిమా మెగాస్టార్‌కు మిగిల్చిన పరాభవం, మచ్చ మరే సినిమా ఇవ్వలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

35
దారుణమైన రేటింగ్స్
Image Credit : Asianet News

దారుణమైన రేటింగ్స్

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ విడుదలైన మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. విమర్శకులు, రివ్యూవర్స్ ఈ సినిమాకు 1 లేదా 1.5 రేటింగ్ ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వారం తిరగకముందే థియేటర్ల నుంచి మాయమైన ఈ చిత్రం, మెగా తండ్రీకొడుకుల కెరీర్‌లో ఒక పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.

45
వందల కోట్ల నష్టాలు
Image Credit : our own

వందల కోట్ల నష్టాలు

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా వల్ల బయ్యర్లు సుమారు రూ. 100 కోట్ల వరకు నష్టపోయారట. తన కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా చిరంజీవి తన రెమ్యూనరేషన్‌లో కొంత భాగాన్ని వెనక్కి ఇచ్చారంటే నష్టం తీవ్రత ఎంత ఉందో తెలుస్తోంది. సినిమా మొత్తం సీరియస్‌గా సాగడం, చిరంజీవి మార్క్ కామెడీ, గ్రేస్ లేకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచాయి.

55
వైఫల్యానికి కారణాలు
Image Credit : Asianet News

వైఫల్యానికి కారణాలు

కొరటాల శివ మార్క్ సోషల్ మెసేజ్ ఉన్నప్పటికీ, కథనంలో వేగం లోపించింది. విజువల్స్, గ్రాఫిక్స్ నాసిరకంగా ఉండటం విమర్శలకు దారితీసింది. సినిమాలోని కొన్ని సీన్‌లు పాత చింతకాయ పచ్చడిలా ఉండటంతో నేటి తరం ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు. క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఏమాత్రం సహజత్వానికి దగ్గరగా లేకపోవడం మైనస్ అయింది. మొత్తానికి, చిరంజీవి ఇమేజ్‌కు సరిపడా సీన్లు లేకపోవడం, దర్శకుడి వైఫల్యం వల్ల 'ఆచార్య' మెగాస్టార్ 40 ఏళ్ల కెరీర్‌లో మాయని మచ్చలా మిగిలిపోయింది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Recommended image2
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా
Recommended image3
Bollywood Controversies: సల్మాన్-షారుఖ్ నుంచి కంగనా-హృతిక్ వరకు.. స్టార్లను కుదిపేసిన 7 వివాదాలు
Related Stories
Recommended image1
వెంకటేష్ వద్దన్నాడు.. బాలయ్య సై అన్నాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీ హిట్.. ఆ సినిమా ఏదంటే
Recommended image2
మహేష్ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ హీరో.. ఆ మూవీ ఏదంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved