- Home
- Entertainment
- ఇంత రేట్ అంటే నీ పెళ్లాం వదిలేసిపోతుంది, `అలేఖ్య చిట్టి పికిల్స్` పై ప్రియదర్శి మాస్ ట్రోలింగ్
ఇంత రేట్ అంటే నీ పెళ్లాం వదిలేసిపోతుంది, `అలేఖ్య చిట్టి పికిల్స్` పై ప్రియదర్శి మాస్ ట్రోలింగ్
అలేఖ్య చిట్టి పికిల్స్ పై ట్రోల్స్ దారుణంగా ఉంటున్నాయి. చివరికి నటుడు ప్రియదర్శి కూడా వదల్లేదు. స్పెషల్ వీడియోతో ఊర మాస్ ర్యాగింగ్ చేశాడు. అది వైరల్ అవుతుంది.

priyadarshi, alekhya chitti pickles
ప్రస్తుతం తెలుగు స్టేట్స్ లో వైరల్ కంటెంట్‌గా మారింది అలేఖ్య చిట్టి పికిల్స్. ముగ్గురు అమ్మాయిలు కలిసి వివిధ రకాల నాన్ వెజ్ పికిల్స్ చేసి అమ్ముతున్నారు. వీరి బిజినెస్ బాగా ఫేమస్ అయ్యింది. కానీ ఇటీవల పెద్ద వివాదాల్లో నిలిచారు. పికిల్స్ రేట్ల విషయంలో ఈ అలేఖ్య చిట్టి అమ్మాయిలు పెట్టిన కామెంట్ పెద్ద రచ్చ అవుతుంది. దెబ్బకి బిజినెస్‌నే మూసుకోవాల్సి వచ్చింది.
Alekhya Chitti Pickles
అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నెటిజన్లు వారిని ఆడుకుంటున్నారు. రేట్ల విషయంలో ఇంత రేట్లా అని అడిగినందుకు తిడుతూ పోస్ట్ పెట్టడం పెద్ద రచ్చ అయ్యింది. వాళ్లు బై మిస్టేక్‌లో ఒకరికి పెట్టబోయి మరొకరికి పెట్టామని వివరణ ఇచ్చారు. క్షమాపణలు కూడా చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిని ట్రోల్ చేస్తూ నెటిజన్లు ఆడుకుంటున్నారు.
Alekhya Chitti Pickles
అయితే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద వివాదంగా మారడంతో ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. అలేఖ్య చిట్టి అమ్మాయిలను పట్టుకుని ఆడుకుంటున్నారు. ట్రోల్స్ మీద ట్రోల్స్ చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు.
అలేఖ్య పికిల్స్ కొనాలంటే బాగా చదువుకోవాలని, కెరీర్‌పై దృష్టిపెట్టాలని వారికి సెటైర్లు పేలుస్తున్నారు. వాళ్లు ఒక ఆడియోలో పెట్టిన వ్యాఖ్యలను తీసుకుని వారిపైనే కౌంటర్లు వేస్తున్నారు. ప్రేమ, దోమ అంటూ తిరిగితే దేనికీ పనికి రాకుండా పోతావని, కనీసం అలేఖ్య పికిల్స్ కూడా కొనలేరని నెటిజన్లు వీడియోలు చేస్తున్నారు.
priyadarshi, Roopa Koduvayur
అయితే ఇదిప్పుడు బాగా ట్రెండింగ్‌గా మారిన నేపథ్యంలో సినిమా వాళ్లు కూడా దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ప్రమోషన్స్ కి వాడుకుంటున్నారు. తాజాగా ప్రియదర్శి సైతం అలేఖ్య బ్యాచ్ ని తనదైన స్టయిల్‌లో మాస్ ర్యాగింగ్ చేస్తున్నాడు. అందుకు ప్రత్యేకంగా ఓ వీడియోనే రూపొందించారు.
ప్రియదర్శి, రూపా కొడవాయూర్ కలిసి ప్రస్తుతం `సారంగపాణి జాతకం` అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాత. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా అలేఖ్య చిట్టి పికిల్స్ ని ఆడుకుంటూ ఓ వీడియో చేశారు.
priyadarshi, Roopa Koduvayur
హీరోయిన్‌తో కలిసి ప్రియదర్శి ఈ వీడియో చేయడం విశేషం. ఇందులో హీరోయిన్ ఫోన్‌లో డ్రెస్ చూసి `వాహ్ డ్రెస్ ఎంత బాగుందో కదా అని అంటుంది. అది చూసిన ప్రియదర్శి అవును బాగుంది అంటాడు, కింద రేట్ చూసి 15వేలా అని షాక్ అవుతూ, చాలా రేట్ ఎక్కువ అంటాడు. దీనికి హీరోయిన్ చిరాకుగా రియాక్ట్ అవుతూ, నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి.
రేపు నీ పెళ్లామో, గర్ల్ ఫ్రెండో డ్రెస్ చూపిస్తే ఇలా ఇంత ఖరీదా అన్నావో వదిలి పడదొబ్బుద్ది అని, అందుకే నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టి, ఈ ప్రేమలు, పెళ్లిళ్ల జోలికి పోమాకా అని వార్నింగ్ ఇస్తుంది. `ముష్టి డ్రెస్సే ఎక్స్ పెన్సివ్ అంటున్నావ్, రేపు నీ పెళ్లాం ల్యాండ్, బంగారం అడిగితే ఏం కొనిపెడతావ్ రా. ఈ పుస్తకం పక్కన పెట్టి నీ కెరీర్‌పై ఫోకస్ పెట్టు సరేనా అంటుంది.
ఇది విన్న ప్రియదర్శి చివరికి పచ్చళ్ల బిజినెస్ పెడతా అని అమాయకంగా చెప్పడం అదిరిపోయింది. ఇప్పుడిది వైరల్ అవుతుంది. ప్రియదర్శి.. అలేఖ్యచిట్టి పికిల్స్ ని మాస్ ర్యాగింగ్ అదిరిపోయిందంటున్నారు. వీళ్లే కాదు చాలా మంది యూట్యూబర్స్ ఇలా వీడియోలు చేస్తూ అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయిలను ఆడుకుంటున్నారు. మరి ఈ వివాదానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో చూడాలి.
also read: `కౌన్ బనేగా కరోడ్‌పతి' షోలో బిగ్ ట్విస్ట్.. సీజన్ 17 హోస్ట్ ఆయనే, స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?