MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Maa Vande: మోదీ బయోపిక్‌ `మా వందే` బడ్జెట్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. వామ్మో ఇది హాలీవుడ్‌ రేంజ్‌

Maa Vande: మోదీ బయోపిక్‌ `మా వందే` బడ్జెట్‌ తెలిస్తే మతిపోవాల్సిందే.. వామ్మో ఇది హాలీవుడ్‌ రేంజ్‌

Maa Vande: మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా బయోపిక రూపొందుతుంది. `మా వందే` పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 19 2026, 10:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మోదీ బయోపిక్‌ `మా వందే`పై భారీ క్రేజ్‌
Image Credit : Asianet News

మోదీ బయోపిక్‌ `మా వందే`పై భారీ క్రేజ్‌

బయోపిక్స్ విషయంలో స్పోర్ట్స్ పర్సన్స్ కి, రాజకీయ నాయకులకు ఆడియెన్స్ లో మంచి క్రేజ్‌ ఉంటది. వీరి లైఫ్‌ జనాలతో ముడిపడి ఉంటుంది. వారి జీవితంలో డ్రామా, స్ట్రగుల్స్, వివాదాలు ఉంటే అవి మరింత ఆసక్తికరంగా మారుతాయి. ఈ క్రమంలో ఇప్పటికే చాలా పొలిటికల్‌ లీడర్స్ బయోపిక్‌లు వచ్చాయి. కానీ ఇప్పుడు వస్తున్న బయోపిక్‌ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీది కావడం విశేషం. `మా వందే` పేరుతో ఈ మూవీని తెరమీదకు తీసుకువస్తున్నాయి. ప్రకటన నుంచే దీనిపై విపరీతమైన క్రేజ్‌, బజ్‌ నెలకొంది. దానికి తగ్గట్టుగానే భారీ బడ్జెట్‌తో, రాజీపడకుండా నిర్మించే పనిలో ఉన్నారు మేకర్స్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మోదీగా ఉన్ని ముకుందన్‌
Image Credit : Asianet News

మోదీగా ఉన్ని ముకుందన్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్ ని `మా వందే` టైటిల్ తో సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ వీర్ రెడ్డి.ఎం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ ప్రధాని మోదీ జీవితాన్ని యదార్థ ఘటనల ఆధారంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రాంతికుమార్.సీహెచ్. ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని విశేషాలన్నీ ఎంతో సహజంగా `మా వందే` సినిమాలో చూపించబోతున్నారు.

Related Articles

Related image1
Renu Desai: పవన్‌ నిన్ను ఎందుకు వదిలేశాడో ఇప్పుడు అర్థమైంది.. రేణు దేశాయ్‌ కౌంటర్‌.. న్యాయవ్యవస్థపై ఫైర్‌
Related image2
Anchor Rashmi: కల్చర్‌ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్‌ క్రేజీ కౌంటర్‌.. కుక్కల సమస్యపై ఆవేదన
35
మా వందే మూవీ బడ్జెట్‌
Image Credit : Asianet News

మా వందే మూవీ బడ్జెట్‌

ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందుతోంది. `మా వందే` చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతోపాటు ఇంగ్లీష్ లోనూ రిలీజ్ చేయనున్నారు. ఎన్నో పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశం `మా వందే` చిత్రంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుందని టీమ్‌ చెబుతోంది. అయితే ఈ మూవీ బడ్జెట్‌ని రివీల్‌ చేసింది టీమ్‌. ఏకంగా రూ.400కోట్లతో దీన్ని నిర్మిస్తున్నారట. వరల్డ్ క్లాస్‌క్వాలిటీతో తెరకెక్కిస్తున్నారట. హాలీవుడ్‌ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందని చెబుతున్నారు.

45
మా వందే మూవీలో కీలక పాత్ర కోసం హాలీవుడ్‌ నటుడు
Image Credit : Asianet News

మా వందే మూవీలో కీలక పాత్ర కోసం హాలీవుడ్‌ నటుడు

``మా వందే` సినిమాను సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ రూ.400 కోట్ల రూపాయలకు పైగా హ్యూజ్ బడ్జెట్ తో  నిర్మిస్తోంది. ఈ స్టోరీ డ్రివెన్ మూవీని ప్రపంచంలో తొలిసారిగా తొలిసారి ఆరి అలెక్సా 265 జెంట్రీ, కుకీ లెన్స్ తో తెరకెక్కిస్తుండటం విశేషం. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ `ఆక్వామ్యాన్` లో హీరోగా నటించిన జేసన్ మమొవాను ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు సంప్రదిస్తున్నారు. రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ వంటి పేరున్న యాక్టర్స్ ఫస్ట్ సిట్టింగ్ లోనే కథ నచ్చి మూవీ చేసేందుకు అంగీకరించారు.

55
చరిత్రలో చిరకాలం నిలిచిపోయే విధంగా `మా వందే`
Image Credit : Asianet News

చరిత్రలో చిరకాలం నిలిచిపోయే విధంగా `మా వందే`

స్టంట్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ , ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, డీవోపీ కె.కె. సెంథిల్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్ వంటి టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఓ మామూలు బయోపిక్ లా కాకుండా చలనచిత్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోయే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా `మా వందే` నిర్మాణవుతోంది. ప్రీ ప్రొడక్షన్ కే మూడేళ్ల సమయం తీసుకోవడం చూస్తే ఈ సినిమా కోసం మేకర్స్ ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో అర్థమవుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఈ నెల 22వ తేదీ నుంచి కాశ్మీర్ లో ప్రారంభం కానుంద`ని టీమ్‌ చెప్పింది. దీంతో ఈ మూవీ కోసం దేశ వ్యాప్తంగా ఆడియెన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
నరేంద్ర మోదీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Suspense Thriller OTT: మూడు మరణాలు, ఒకే అనుమానం! ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్, ఎక్కడ చూడొచ్చంటే?
Recommended image2
Nandu Bigg Boss: యూట్యూబర్ నందు బిగ్ బాస్ కోసం ఇండియాకు వచ్చిందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీపై నిజమెంత?
Recommended image3
Rajamouli: ఎవ్వరూ ఎవ్వరికీ లైఫ్ ఇవ్వరు ఇక్కడ, తాగుబోతు రమేష్ జీవితంపై రాజమౌళి ఎమోషనల్.. ఏం జరిగిందంటే
Related Stories
Recommended image1
Renu Desai: పవన్‌ నిన్ను ఎందుకు వదిలేశాడో ఇప్పుడు అర్థమైంది.. రేణు దేశాయ్‌ కౌంటర్‌.. న్యాయవ్యవస్థపై ఫైర్‌
Recommended image2
Anchor Rashmi: కల్చర్‌ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్‌ క్రేజీ కౌంటర్‌.. కుక్కల సమస్యపై ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved