MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Actress: సంతోషం బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే

Actress: సంతోషం బ్యూటీ ఇప్పుడెలా ఉందో తెలుసా.? చూస్తే షాక్ అవ్వాల్సిందే

Guess the actress: ఇండ‌స్ట్రీలో హీరోల హ‌వా న‌డిచినంత‌లా హీరోయిన్స్‌ది ఉండ‌దు. ఎవ‌రు కాద‌న‌లేని స‌త్యం. త‌మ అందం, అభిన‌యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న న‌టీమ‌ణులు ప్ర‌స్తుతం వెండి తెర‌కు దూర‌మ‌య్యారు. అలాంటి వారిలో ఈ బ్యూటీ కూడా ఒక‌రు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 03 2026, 10:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొద‌టి సినిమా నాగ్‌తో
Image Credit : Aditya Music/X

మొద‌టి సినిమా నాగ్‌తో

2000ల ప్రారంభంలో నాగార్జున సరసన ఓ కొత్త ముఖం కనిపించింది. తెలుగులో మొదటి సినిమానే పెద్ద హీరోతో చేసే అవకాశం రావడం అరుదు. అయితే ఆ సినిమా ఆమె కెరీర్‌ను స్థిరపరచలేకపోయింది. తర్వాత మరో సినిమా చేసినా ఫలితం మారలేదు. ఆ తర్వాత ఆమె పేరు క్రమంగా తెలుగు తెరపై కనిపించకపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్న తాజా ఫోటోలు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో హోమ్లీ లుక్‌తో మెప్పించిన ఆ హీరోయిన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు గ్రేసీ సింగ్.

25
‘సంతోషం’ నుంచి బాలీవుడ్ వరకు ప్రయాణం
Image Credit : iamgracysingh/Instagram

‘సంతోషం’ నుంచి బాలీవుడ్ వరకు ప్రయాణం

గ్రేసీ సింగ్ తెలుగులో చేసిన గుర్తుండిపోయే చిత్రం సంతోషం. ఇందులో ఆమె నాగార్జునతో కలిసి నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ద‌శ‌ర‌థ్ అద్భుత ద‌ర్శ‌క‌త్వం, ఆర్పీ పట్నాయ‌క్ సూప‌ర్ మ్యూజిక్ ఈ సినిమాను విజ‌య తీరాల‌కు చేర్చాయి. అయితే గ్రేసీకి అసలు గుర్తింపు వచ్చిన సినిమా బాలీవుడ్‌లోని ల‌గాన్‌. ఇందులో ఆమె ఆమిర్ ఖాన్‌తో కలిసి నటించింది. ఆ తర్వాత మున్నాభాయ్ ఎంబీబీఎస్ వంటి చిత్రాల్లోనూ కనిపించింది. తెలుగులో మాత్రం ‘తప్పు చేసి పప్పుకూడు’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ వంటి సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు.

Related Articles

Related image1
హైదరాబాద్‌కు కాస్త దూరంగా, అభివృద్ధి చాలా ద‌గ్గ‌ర‌గా.. ఈ సిటీలో భూమి కొంటే మీకు తిరుగే ఉండ‌దు
Related image2
పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!
35
క్లాసికల్ డ్యాన్సర్‌గా మరో గుర్తింపు
Image Credit : iamgracysingh/Instagram

క్లాసికల్ డ్యాన్సర్‌గా మరో గుర్తింపు

ఢిల్లీలో జన్మించిన గ్రేసీ చిన్నప్పటినుంచే భరతనాట్యం, ఒడిస్సీ వంటి నృత్యరూపాల్లో శిక్షణ పొందింది. స్టేజ్ ప్రదర్శనలతోనే మొదట గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోకి రాకముందే టెలివిజన్ సీరియల్స్‌లో న‌టించారు. నటిగా ఎంత బిజీగా ఉన్నా నృత్యాన్ని మాత్రం విడిచిపెట్టలేరు. ఇటీవల బ్రహ్మకుమారీస్ కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ప్రదర్శన ఇచ్చారు. ఆ వీడియోను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

45
టాలీవుడ్‌లో ఎందుకు నిలదొక్కుకోలేకపోయారు.?
Image Credit : iamgracysingh/Instagram

టాలీవుడ్‌లో ఎందుకు నిలదొక్కుకోలేకపోయారు.?

‘సంతోషం’ విజయానంతరం మంచి అవకాశాలు వస్తాయని అనుకున్నా పరిస్థితి మారలేదు. కథల ఎంపిక, బాక్సాఫీస్ ఫలితాలు ఆమెకు అనుకూలంగా మార‌లేవు. తెలుగులో పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్, పంజాబీ చిత్రాల వైపు దృష్టి మళ్లింది. 2015 వరకు సినిమాలు చేసిన ఆమె, తర్వాత టెలివిజన్ సీరియల్స్‌లో బిజీ అయ్యారు. అయితే ఆమెను గుర్తుపట్టే ప్రేక్షకులు ఇప్పటికీ ‘సంతోషం’ సినిమాలోని హోమ్లీ పాత్రతోనే గుర్తుచేసుకుంటారు.

 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Gracy Singh (@iamgracysingh)

55
ఇప్పుడేం ఏం చేస్తున్నారు.?
Image Credit : iamgracysingh/Instagram

ఇప్పుడేం ఏం చేస్తున్నారు.?

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే గ్రేసీ సింగ్ అప్పుడప్పుడూ తన కుటుంబ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు పంచుకుంటోంది. వయసు పెరిగేకొద్దీ రూపంలో మార్పులు సహజమే. అయితే తాజా ఫోటోలు చూసి చాలామంది ఆమెను వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఒకప్పుడు యువత హృదయాలను గెలిచిన హీరోయిన్ ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. సినిమాల నుంచి దూరంగా ఉన్నా, కళాకారిణిగా తన ప్రయాణాన్ని మాత్రం కొన‌సాగిస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu మార్చి 3 ఎపిసోడ్: రామరాజు కొడుకుల మధ్య గొడవలు, ఇంట్లోంటి బయటికొచ్చేసిన సాగర్ నర్మద
Recommended image2
Rashmika Mandanna: పిల్లలపై రష్మిక కామెంట్‌, ఇప్పటికే తల్లి ఫీలింగ్‌.. త్వరలో సినిమాలకు గుడ్‌ బై?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: దశరథ ఎమోషనల్- కార్తీక్, దీపలపై జ్యో డౌట్- జ్యోకు షాక్- పారుకు నిజం
Related Stories
Recommended image1
హైదరాబాద్‌కు కాస్త దూరంగా, అభివృద్ధి చాలా ద‌గ్గ‌ర‌గా.. ఈ సిటీలో భూమి కొంటే మీకు తిరుగే ఉండ‌దు
Recommended image2
పేమెంట్ అయిన‌ట్లు సౌండ్ వ‌స్తుంది కానీ డ‌బ్బులు ప‌డ‌వు.. ఫోన్‌పేలో కొత్త స్కామ్‌. జాగ్ర‌త్త‌!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved