- Home
- Entertainment
- Anchor Rashmi: కల్చర్ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్ క్రేజీ కౌంటర్.. కుక్కల సమస్యపై ఆవేదన
Anchor Rashmi: కల్చర్ మన బట్టల వద్దే ఆగిపోయింది.. రష్మి గౌతమ్ క్రేజీ కౌంటర్.. కుక్కల సమస్యపై ఆవేదన
యాంకర్ రష్మి గౌతమ్ తాజాగా డాగ్స్ సమస్యపై స్పందించింది. హాట్ కామెంట్ చేసింది. ఈ క్రమంలో ఇటీవల హాట్ టాపిక్‌గా మారిన డ్రెస్ వివాదంపై స్పందించింది. క్రేజీ కౌంటర్ ఇచ్చింది.

కుక్కల సమస్యపై రష్మి ఆవేదన
కుక్కల సమస్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కుక్కలు కరవడం వల్ల చిన్నారులు చనిపోతున్నారని కొందరు సుప్రీంకోర్ట్ ని ఆశ్రయించారు. దీనిపై పూర్తిస్థాయి తీర్పు రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే వాటిని ప్రత్యేక కేంద్రాలకు తరలించాలని సుప్రీంకోర్ట్ జడ్జ్ తీర్పు చెప్పారు. ఈ క్రమంలో దీనిపై రేణు దేశాయ్ స్పందించి ఫైర్ అయ్యింది. ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై, మీడియాపై మండిపడింది. ఇందులో జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ పాల్గొంది. ఆమె కూడా తన ఆవేదన వ్యక్తం చేసింది.
మన కల్చర్ బట్టల వద్దే ఆగిపోయింది-రష్మి గౌతమ్
మన కల్చర్ ఇప్పుడు మన బట్టల వద్దే ఆగిపోయిందంటూ కామెంట్ చేసింది రష్మి. ఇటీవల మహిళల బట్టలపై నటుడు శివాజీ చేసిన కామెంట్స్ దుమారం రేపిన విషయం తెలిసిందే. దానికి అనసూయ, చిన్మయి వంటి చాలా మంది సెలబ్రిటీలు స్పందించడంతో మరింత వివాదంగా మారింది. ఇప్పుడిప్పుడే ఆ వివాదం ముగిసిపోతుంది. ఈ క్రమంలో ఇప్పుడు యాంకర్ రష్మి పరోక్షంగా సెటైర్లు పేల్చింది. మన కల్చర్ బట్టల వద్దే ఆగిపోయిందంటూ కామెంట్ చేశారు. డాగ్స్ విషయంలో ప్రభుత్వాలు, కోర్ట్ లు అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని వారు అంటున్నారు. రష్మి గౌతమ్ ఆవేదన చెందింది.
మన కల్చర్‌ని మర్చిపోతున్నాం
ఇప్పుడు యానిమల్స్ హింస అనేది జీవితంలో కామన్‌గా మారిపోయిందన్నారు. నాన్ వెజ్ తినడం జీవితంలో భాగమని, దానికి తాము ఫుడ్డీ అని గొప్పగా చెప్పుకుంటున్నారని తెలిపారు. ఒకప్పుడు.. మన ఇంట్లో అన్నం మిగిలితే మొదట ఆవుకి, ఆ తర్వాత కుక్కకి పెట్టేవాళ్లం. ఇది మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నుంచి ఉండేది. అప్పట్లో ప్రతి ఒక్కరు ఇదే చేశారు. అదొక కల్చర్‌లాగా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు, దాన్ని అంతా మర్చిపోయారు, ఎవరూ ఆ వైపు ఫోకస్ చేయడం లేదు. కల్చర్ అంటే బట్టలకే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
అడ్డుగా మారుతున్నాయని వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు
మనం తినే ఫుడ్‌లోనూ జీవం ఉందని, కొత్తిమీద చెట్టులోనూ జీవం ఉందని, దాన్ని చంపి మనం తింటున్నామని, అందుకే అప్పట్లో భోజనం చేసేముందు ఫుడ్‌కి రెస్పెక్ట్ చేయాలని చెప్పేవారు. కానీ ఇప్పుడు దాన్ని మర్చిపోయారని తెలిపింది. అంతేకాదు ఆవు బిడ్డకి జన్మనిస్తే, మొదట వచ్చేది జున్నుపాలు. అది ఆ ఆవు బిడ్డతో తాగించాలి. కానీ మనం జున్ను చేసుకొని తింటున్నాం. అది మనకు అరగకపోయినా టేస్టీ కోసం తింటున్నాం. టేస్టీ బర్డ్స్ అని చెప్పి రోజూ నాన్‌వెజ్ తింటున్నాం, ఇలా ఎన్నో జీవులను చంపేస్తున్నాం అని వెల్లడించింది రష్మి. కుక్కలకు రక్షణకు సంబంధించిన ప్రయారిటీ ఇవ్వాలని చెప్పింది. మనకు అడ్డుగా ఉంటున్నాయని వాటిని తీసేయాలని చూస్తున్నారు. ఇలా ఏది అడ్డు వస్తే వాటిని తొలగించాలనుకుంటున్నారు. చివరికి మన అమ్మానాన్నని కూడా తొలగించేకోవాల్సి వస్తుంది. ఇది ఎంత వరకు కరెక్ట్ అని తెలిపింది రష్మి గౌతమ్. మీడియా సైతం కుక్కల సమస్యని చూపించే విధానం మారాలని, వాటి కోణంలో హెడ్ లైన్స్ పెట్టాలని తెలిపింది.
జంతు ప్రేమికురాలిగా రాణిస్తున్న రష్మి గౌతమ్
యాంకర్ రష్మి.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన విషయం తెలిసిందే. దాదాపు 13ఏళ్లుగా ఈ షోకి ఆమె యాంకర్‌గా చేస్తంది. యానిమల్స్ లవర్స్ గా రాణిస్తుంది. ప్రతి రోజు కుక్కలకు, ఆవులకు ఏం జరిగినా సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ, వాటిని రక్షించే ప్రయత్నం చేస్తుంది. వాటికి తన సొంత ఖర్చులతో ట్రీట్‌మెంట్ ఇప్పించడం, ఫుడ్ పెట్టడం చేస్తుంది. జంతు రక్షకురాలిగా వ్యవహరిస్తుంది రష్మి.

