MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu మార్చి 3 ఎపిసోడ్: రామరాజు కొడుకుల మధ్య గొడవలు, ఇంట్లోంచి బయటికొచ్చేసిన సాగర్ నర్మద

Illu Illalu Pillalu మార్చి 3 ఎపిసోడ్: రామరాజు కొడుకుల మధ్య గొడవలు, ఇంట్లోంచి బయటికొచ్చేసిన సాగర్ నర్మద

Illu Illalu Pillalu మార్చి 3 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో రామరాజు కుటుంబం రెండు ముక్కలుగా మారుతుంది. సాగర్ నర్మదను తీసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్లిపోతాడు. వల్లి బ్యాచ్ ఆనందం పట్టలేకపోతుంది.  ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోండి. 

3 Min read
Author : Haritha Chappa
Published : Mar 03 2026, 10:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నా భార్యనే కొడతారా?
Image Credit : Jio hotstar

నా భార్యనే కొడతారా?

ఇల్లు ఇల్లు ఇల్లాలు నేటి ఎపిసోడ్లో రామరాజు ఇల్లు ముక్కలవ్వడం కనిపిస్తుంది. సాగర్‌కు తన భార్యను వేదవతి కొట్టినందుకు కోపం వస్తుంది. ‘మీరు నన్ను ఉద్యోగం మానేయమని చెబుతున్నారు, నేను మానేయలేను కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం నేను నా భార్య ఇంట్లోంచి వెళ్లిపోవడమే’ అని అంటాడు సాగర్. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. కానీ అగ్గిపుల్ల బ్యాచ్ శ్రీవల్లి, భాగ్యం మాత్రం లోలోపల ఆనందంతో మురిసిపోతారు. సాగర్ ను ఆపే ప్రయత్నం చేస్తాడు ధీరజ్. కానీ సాగర్ మాత్రం ఏమాత్రం తగ్గడు. నా భార్యపై చేయి పడ్డ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను అని నర్మదన లాక్కొని వెళ్తాడు. నర్మదా ఆపే ప్రయత్నం చేసినా వినడు. ‘నువ్వు నాతో జీవితాంతం బతకాలనుకుంటే నాతో రా.. లేదంటే నేను ఒక్కడినే వెళతా’ అని చెప్పేస్తాడు. దీంతో నర్మద ఇష్టం లేకపోయినా సాగర్ తో పాటూ గదిలోకి వెళుతుంది.

ఇదంతా చూసిన శ్రీవల్లి ఇడ్లీ బాబాయ్ భాగ్యం ఆనందం పట్టలేకపోతారు. హాల్లోంచి పక్కకి వచ్చి డాన్స్ లు వేయడం మొదలు పెడతారు. వల్లి ‘నన్ను కొట్టావు కదా నర్మద, ఈరోజు నీ గూబ పగిలింది. లెక్క లెవలైపోయింది’ అని డ్యాన్సులు వేస్తుంది. మరోపక్క భాగ్యం నర్మద కోరలు పీకేసాం, ఇక ఆ ప్రేమ బుర్ర లేనిది. ఇక టెన్షన్ లేదు. మిల్లు తాళాలు మన గుప్పెట్లో పెట్టుకుంటే ఇక ఇంటికి కోడలుగా నిన్ను ఎందుకు పంపించామో దానికి సార్ధకత వచ్చేస్తుంది అంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇంట్లోంచి వెళ్లిపోతా
Image Credit : Jio hotstar

ఇంట్లోంచి వెళ్లిపోతా

ఇక రామరాజు కుర్చీలో కూర్చుని సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. అటు ప్రేమ.. వేదవతితో మాట్లాడుతుంది. ‘ఏంటి అత్తయ్య.. అంత ప్రేమ చూపించే మీరు నర్మదక్కని కొట్టడం ఏంటి?’ అని అంటుంది. దానికి వేదవతి ‘కోపం వస్తే నా కూతుళ్ళను మాత్రం కొట్టనా? దాన్ని అలాగే కొట్టాను. నాకు హక్కు లేదా’ అని అంటుంది. నర్మద వద్దని చెబుతున్న మరో పక్క సాగర్ మాత్రం బ్యాగ్ సర్దేస్తాడు. నోరు మూసుకొని బట్టలు సర్దుకుని పదా అని అంటాడు సాగర్. నర్మద గొడవ పడుతున్నా పట్టించుకోడు నర్మదా ‘నువ్వు చేసిన తప్పు వల్లే ఇంత జరిగింది. అయినా నీలో పశ్చాత్తాపం లేదు’ అని అంటుంది. దానికి సాగర్ నీకు నేను కావాలంటే ఇక్కడే ఉండు అని అంటాడు.

మరోపక్క భాగ్యం ఆనందంతో భద్రావతికి ఫోన్ చేసి మొత్తం చూపిస్తుంది. ఈలోపు సాగర్ బ్యాగ్ తీసుకొని నర్మదతో సహా బయటికి వస్తాడు. ఈ లోపు వేదవతి సాగర్ ను ఆపేందుకు ప్రయత్నిస్తుంది. కష్టసుఖాలలో కూడా కలిసి ఉండాలని మీ నాన్న ఆశ. మీ నాన్నకి గుండె కోత మిగల్చకు అని బతిమిలాడుతుంది. సాగర్ మాత్రం మాట వినడు. చిన్న గొడవకి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని అంటుంది వేదవతి. దానికి సాగర్ ‘చిన్న గొడవా? నేను జాబ్ తెచ్చుకుంటే గొడవ, రైస్ మిల్లులో డబ్బులు వాడితే గొడవ, నేను ఎన్నో ఏళ్లు రైస్ మిల్లులో పనిచేస్తున్నా.. ఐదు లక్షలు తీసుకుంటే నాపై దొంగ అనే ముద్ర వేస్తారా’ అని అంటాడు. రామరాజు మాట్లాడుతూ ‘నీకు ఐదు లక్షల కాదు, 50 లక్షలు తీసుకునే హక్కు ఉంది. కానీ చెప్పకుండా తీసుకుంటే దాన్ని దొంగతనం అంటారు’ అని అంటాడు. దానికి సాగర్ ‘నేను దొంగని, మోసం చేసిన కొడుకుని, నేను మంచి కొడుకును కాదని ఒప్పుకుంటున్నాను. మరి మీరు గొప్ప తండ్రి కదా, ఏం చేశారు మీ పిల్లలకి?’ అని అంటాడు. దాంతో రామరాజు షాక్ అవుతాడు.

Related Articles

Related image1
Illu Illalu Pillalu: భాగ్యం శాడిజం, సాగర్ ని చావబాదిన రామరాజు, నీకు పిల్లల్ని పెంచడం రాదన్న నర్మద తండ్రి
Related image2
Illu Illalu Pillalu Today Episode March 2: నర్మదను కొట్టిన వేదవతి, ముక్కలైన రామరాజు కుటుంబం
33
సాగర్‌ను కొట్టేందుకు వచ్చిన పెద్దోడు
Image Credit : Jio hotstar

సాగర్‌ను కొట్టేందుకు వచ్చిన పెద్దోడు

ఈ లోపు పెద్దోడు కల్పించుకొని ‘నాన్నను పట్టుకొని ఆ మాటలు ఏంట్రా’ అని కోప్పడతాడు. సాగర్ పెద్దోడిని పక్కకు నెట్టేసి ‘ప్రతిదీ మీకు ఇష్టం వచ్చినట్టే చేస్తారు, మాకు మా జీవితం నచ్చినట్టు బతకాలని ఉంటుంది. ఏరోజైనా మా ఇష్టాలు గురించి అడిగారా? ఎంతసేపు ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పడమే. మీకు మీరే పిల్లల్ని గొప్పగా పెంచామని ఫీల్ అవుతున్నారు. మాకు నడక నేర్పుతున్నామనుకున్నారు కానీ కుంటోళ్ళని చేశారు. బతకడం చేతకాకుండా టార్చర్ చేస్తున్నారు’ అని అంటాడు. దాంతో పెద్దోడికి కోపం వచ్చి నాన్న గురించి నోటికి వచ్చినట్టు వాగితే చెంప పగలగొడతా అని చేతులు ఎత్తుతాడు. దానికి సాగర్ ‘కొట్టు.. నువ్వు నాన్న దగ్గర భక్తి అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆయన దగ్గర బానిసలా బతుకుతున్నావ్’ అని అంటాడు. 

ఈ లోపు ధీరజ్ కూడా కోపంగా సాగర్ మీదకి వస్తాడు. ‘అటు నాన్నని, ఇటు అన్నయ్యని నోటికి ఏదో వస్తే అది మాట్లాడేస్తావా’ అని అరుస్తాడు. అప్పుడు సాగర్ ‘నువ్వు కూడా కొడతావా? కొట్టు.. నీ లైఫ్ నువ్వు బతుకుతున్నావు. నాన్నని ఎదిరించి నీ హక్కు అంటావు. అదే పని నేను చేస్తే ఎదిరించడం అంటావ్’ అని అంటాడు. ఈ లోపు వేదవతి వచ్చి మీలో మీరు గొడవ పెడుతుంటే మేము ఏమైపోవాలి అని ఏడుస్తుంది. సాగర్ ఆగకుండా నర్మదని తీసుకొని బయటికి వచ్చేస్తాడు. రామరాజు కుటుంబం ముక్కలు కావడం భద్రావతి, సేనపతి, విశ్వక్ లు చూసి ఆనందంతో పొంగిపోతారు.

ఇక రామరాజు కొడుకు వెళ్లిపోవడం చూసి బాధతో అలా నిల్చుండిపోతాడు. అతడి వెనకే శ్రీవల్లి, భాగ్యం, ఇడ్లీ బాబాయిలు డాన్సులు వేస్తారు. సాగర్ వెళుతూ వెళుతూ వేదవతితో ‘అమ్మా.. వనజ వాళ్లకి ఇవ్వాల్సిన 20 లక్షలు ఇచ్చేసాను. అంటే నా డబ్బులతోనే ఉద్యోగం కొనుక్కున్నా. ఎవరికో నచ్చలేదని వదిలేయాల్సిన అవసరం లేదు’ అని నర్మద చెయ్యి పట్టుకుని బయటికి వెళ్లిపోతాడు. నర్మద మాత్రం వద్దని వారిస్తూనే ఉంటుంది. ధీరజ్, ప్రేమ కూడా వచ్చి వారితో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Modern Missamma: పెళ్లి వద్దు, సింగిల్ లైఫ్ ముద్దు అంటున్న హీరోయిన్.. మోడ్రన్ మిస్సమ్మ ఫస్ట్ సింగిల్ అదుర్స్
Recommended image2
Jagamae Sangeetham: సుష్మిత కొణిదెల నిర్మించిన క్రేజీ సిరీస్ ఓటీటీలోకి.. ఎందులో, ఎప్పటి నుంచి అంటే..
Recommended image3
Brahmanandam: పెళ్లిళ్లు చేసింది వాడే.. కానీ ఇప్పుడు ప్రేమగా పలకరింపు లేదు, బ్రహ్మానందం సోదరుడి ఆవేదన
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu: భాగ్యం శాడిజం, సాగర్ ని చావబాదిన రామరాజు, నీకు పిల్లల్ని పెంచడం రాదన్న నర్మద తండ్రి
Recommended image2
Illu Illalu Pillalu Today Episode March 2: నర్మదను కొట్టిన వేదవతి, ముక్కలైన రామరాజు కుటుంబం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved