MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Love Insurance Kompany: OTT లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

Love Insurance Kompany: OTT లో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?

ప్రదీప్ రంగనాథన్ హీరోగా వచ్చిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK) సినిమా థియేటర్లలో మంచి విజయం తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలో రిలీజ్ కాబోతోందంటే? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 24 2026, 08:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కలెక్షన్లు..
Image Credit : X

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కలెక్షన్లు..

ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సైన్స్-ఫిక్షన్ రొమాంటిక్ సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' (LIK). థియేటర్లలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.9.93 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.
Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటిటి రిలీజ్
Image Credit : X

లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓటిటి రిలీజ్

నయనతారకు చెందిన రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మించాయి. ఇప్పుడు 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఓటీటీ రిలీజ్‌పై అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. మే 15 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని అంటున్నారు. కానీ, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ప్రదీప్ రంగనాథన్ - విఘ్నేష్ శివన్ కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఓటీటీలో కూడా ఈసినిమాకు భారీ రెస్పాన్స్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు. 

Related Articles

Related image1
Bachelor Heroes: ప్రభాస్ నుంచి రామ్ పోతినేని వరకు.. టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోలు ఎవరంటే?
Related image2
Allu Arjun : అల్లు అర్జున్ మనసు దోచుకున్న హీరోయిన్, బన్ని ఒక్క పాటకైనా డ్యాన్స్ చేయాలని ఆశపడ్డ బ్యూటీ ఎవరు?
34
వరుసగా 100 కోట్ల సినిమాలు..
Image Credit : X

వరుసగా 100 కోట్ల సినిమాలు..

గతంలో ప్రదీప్ నటించిన 'లవ్ టుడే', 'డ్రాగన్', 'డ్యూడ్' సినిమాలు వరుసగా ₹100 కోట్లు వసూలు చేసి హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఆ తర్వాత LIK రిలీజైంది. ఇందులో 'లవ్ టుడే' సినిమాకు ప్రదీప్ స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రదీప్, ఈ తరం మాస్ హీరోగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్‌తో పాటు కృతి శెట్టి, ఎస్.జె. సూర్య, మిస్కిన్, సునీల్ రెడ్డి, సీమాన్, యోగి బాబు, గౌరీ కిషన్ వంటి పెద్ద స్టార్ కాస్ట్ ఉంది.
44
ఎన్నో అడ్డంకుల తరువాత థియేటర్లలోకి..
Image Credit : X

ఎన్నో అడ్డంకుల తరువాత థియేటర్లలోకి..

ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. రవి వర్మన్, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ చేయగా, ప్రదీప్ ఇ. రాఘవ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. ప్రదీప్ ఇతర సినిమాలతో పోలిస్తే 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' ఓ మోస్తరు విజయాన్నే సాధించింది. ప్రదీప్ కెరీర్‌లో 100 కోట్లు వసూలు చేయని తొలి సినిమాగా ఇది నిలిచింది. వచ్చే వారం ధనుష్ సినిమా థియేటర్లలోకి రానుంది. కాబట్టి, ఆ సినిమా వచ్చేవరకు LIK థియేటర్లలో ఆడుతుందని భావిస్తున్నారు. 

నిజానికి, ఈ కథలో మొదట శివకార్తికేయన్ హీరోగా నటించాల్సింది. ఈ కాంబోపై 2019లోనే ప్రకటన వచ్చింది. కానీ బడ్జెట్ సమస్యల వల్ల షూటింగ్ మొదలవకముందే ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో విఘ్నేష్ శివన్ కొన్ని ఏళ్లు ఈ కథను పక్కనపెట్టి, చివరికి ప్రదీప్ రంగనాథన్‌కు చెప్పి ఓకే చేయించుకున్నారు. ఈ సినిమా మొదలై దాదాపు 3 ఏళ్లు అయింది. ఎన్నో అడ్డంకుల తర్వాత LIK రిలీజైంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 OTT: ఒకే సినిమా, రెండు ఓటీటీలు.. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' స్ట్రీమింగ్ ప్లాన్ అదుర్స్!
Recommended image2
Roja Selvamani: రోజాకి హీరోలెవ్వరూ ఎందుకు ప్రపోజ్ చేయలేదో తెలుసా..ఇన్నేళ్లకు నిజం బయటపడింది
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్
Related Stories
Recommended image1
Bachelor Heroes: ప్రభాస్ నుంచి రామ్ పోతినేని వరకు.. టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోలు ఎవరంటే?
Recommended image2
Allu Arjun : అల్లు అర్జున్ మనసు దోచుకున్న హీరోయిన్, బన్ని ఒక్క పాటకైనా డ్యాన్స్ చేయాలని ఆశపడ్డ బ్యూటీ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved