MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun : అల్లు అర్జున్ మనసు దోచుకున్న హీరోయిన్, బన్ని ఒక్క పాటకైనా డ్యాన్స్ చేయాలని ఆశపడ్డ బ్యూటీ ఎవరు?

Allu Arjun : అల్లు అర్జున్ మనసు దోచుకున్న హీరోయిన్, బన్ని ఒక్క పాటకైనా డ్యాన్స్ చేయాలని ఆశపడ్డ బ్యూటీ ఎవరు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాన్నకర్లేదు. ఆయనజోడీగా నటించాలని, కలిసి డ్యాన్స్ చేయాలని చాలా మంది హీరోయిన్లు పోటీపడుతుంటారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఓ హీరోయిన్ తో నటించాలని మనసులో మాట బయటపెట్టాడు. ఇంతకీ ఎవరా హీరోయిన్? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 24 2026, 06:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అల్లు అర్జున్ తో సినిమా అంటే ?
Image Credit : Asianet News

అల్లు అర్జున్ తో సినిమా అంటే ?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా అంటే బాలీవుడ్ హీరోయిన్లు కూడా ఎగిరి గంతేస్తుంటారు. స్టైలీష్ లుక్స్ తో, డ్యాన్సింగ్ స్టార్ గా ఉన్న బన్నీతో నటించడాన్ని హీరోయిన్లు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. బాలీవుడ్ టాలీవుడ్ ను పెద్దగా పట్టించుకోని రోజుల్లో కూడా, అల్లు అర్జున్ స్టైలకు కు పడిపోయిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. అల్లు అర్జున్ మాత్రం ప్రతీ హీరోయిన్ తో ఒకేరకంగా ఉంటారు. 

తన కో స్టార్స్ బాగా నటించారని అనేస్తుంటాడు. ఎవరికీ స్పెషల్ గా క్రెడిట్ ఇచ్చేయడు. కానీ తనతో నటించని ఓ హీరోయిన్ గురించి మాత్రం అల్లు అర్జున్ చేసిన పాజిటీవ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆమె నటనకు పడిపోయిన ఐకాన్ స్టార్.. ఆమెతో ఓ సినిమా.. కనీసం ఓ పాట చేసినా చాలు అన్నాడు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు సాయి పల్లవి.

25
సాయి పల్లవిపై ఐకాన్ స్టార్ కామెంట్స్
Image Credit : Asianet News

సాయి పల్లవిపై ఐకాన్ స్టార్ కామెంట్స్

సాయి పల్లవి మీద అల్లు అర్జున్ తన మనసులో మాటను ఓ ఈవెంట్ లో వెల్లడించాడు. బన్ని మాట్లాడుతూ.. '' నేను సాయిపల్లవి గారి ప్రేమమ్ సినిమాను ఫస్ట్ చూశాను.. ఆతరువాత ఫిదా చూశా, తరువాత MCA సినిమా చూశా, ఆమె ఎక్ట్రార్డినరీ నటి, అందులో డౌటే లేదు... కానీ సాయి పల్లవి గారిని చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది... ఆమెతో సినిమా చేస్తే.. సీన్ కంటే ముందు సాంగ్ చేయడానికి ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే సాయి పల్లవి చేసిన వచ్చిందే సాంగ్ చూసి నేను ఫిదా అయ్యాను. ఆ పాటను ఎన్ని సార్లు చూశానంటే.. నేను చూసినన్ని సార్లు సాయి పల్లవి గారు కూడా చూసి ఉండరు. అంతలా ఆ పాటకు పడిపోయాను అని ఐకాన్ స్టార్ అన్నారు.

Related Articles

Related image1
Sravanthi Chokarapu: స్రవంతి చొక్కారపు భర్త ఎవరు? ఏం చేస్తారు? రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు?
Related image2
Balakrishna: బాలకృష్ణ ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు? మీరు ఊహించని నటి
35
అల్లు అర్జున్ ఫేవరెట్ హీరోయిన్
Image Credit : instagram

అల్లు అర్జున్ ఫేవరెట్ హీరోయిన్

''అంతే కాదు ఆ సాంగ్ లో ఆమె డ్యాన్స్ ఎంతలా నచ్చిందంటే.. నా ఫేవరెట్ డ్యాన్సర్, ఫేవరెట్ పెర్ఫామర్, యాక్ట్రస్, ఫేవరెట్ హీరోయిన్ అన్ని సాయి పల్లవి గారు మీకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. పబ్లిక్ లోనే కాదండీ.. సెలబ్రిటీలలో కూడా మీకు అభిమానులు ఉన్నారు. ఓ స్టార్ హీరో కూడా మీకు వీరాభిమాని, కానీ అతను ఎవరు అనేది మాత్రం పేరు చెప్పను అని అల్లుఅర్జున్ సాయి పల్లవి గురించి చెప్పిన మాటలు తెగ వైరల్ అయ్యాయి. ఇవి గతంలో చేసిన కామెంట్స్.. అయినా ఇప్పుడు కూడా మరోసారి సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

45
ఐకాన్ స్టార్ సినిమాలు..
Image Credit : Allu Arjun/ Instagram

ఐకాన్ స్టార్ సినిమాలు..

ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం పాన్ ఇండియా ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. బన్నితో సినిమా చేయాలంటే 1000 కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే, పాన్ ఇండియా సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. పుష్ప సినినిమాతో అల్లు అర్జున్ ఇమేజ్ ఇండియా అంతటా పాకింది. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్ లో రాకా సినిమా చేస్తున్నాడు బన్ని.

 ఈసినిమాకు 800 కోట్లకుపైగా బడ్జెట్ ను ఖర్చు చేస్తున్నాడు. రీసెంట్ రాకా నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ ను చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఈ సినిమా తరువాత మరో తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో.. మూవీ అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు.

55
సాయి పల్లవి విషయానికి వస్తే..
Image Credit : instagram

సాయి పల్లవి విషయానికి వస్తే..

సాయి పల్లవి ప్రస్తుతం బాలీవుడ్ ఎంట్రీపై దృష్టి పెట్టింది. 4000 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణ సినిమాలో ఆమె సీతగా నటిస్తోంది. రణ్ బీర్ కపూర్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఈసినిమాతో పాటు సౌత్ లో మరికొన్ని సినిమాలు సాయి పల్లవి ఖాతాలో ఉన్నాయి. రామాయణ్ సినిమా హిట్ అయితే, సాయి పల్లవి రేంజ్ మారిపోతుందనడంలో ఎటువంటిసందేహం లేదు. ఇప్పటికే ఆమె రెమ్చునరేషన్ భారీ స్థాయిలో పెరిగినట్టు తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
అల్లు అర్జున్
సాయి పల్లవి
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Geetha Madhuri: అక్కడ చాలా చూశా, అవి మొత్తం బయటపెడితే కాపురాలు కూలిపోతాయ్..బాంబు పేల్చిన సింగర్ గీతా మాధురి
Recommended image2
Sravanthi Chokarapu: గులాబీ రంగు చీరలో మెరిసిపోతున్న చందమామ
Recommended image3
Sneha in Swimming Pool: స్విమ్మింగ్‌ పూల్‌లో స్నేహని ఇలా చూసి ఉండరు
Related Stories
Recommended image1
Sravanthi Chokarapu: స్రవంతి చొక్కారపు భర్త ఎవరు? ఏం చేస్తారు? రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు?
Recommended image2
Balakrishna: బాలకృష్ణ ఫస్ట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు? మీరు ఊహించని నటి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved