లుక్ కూడా గ్రాఫిక్సేనా... ప్రభాస్ రాజా సాబ్ లుక్ పై ట్రోల్స్!
ప్రభాస్ ప్రతి సినిమాలో ఆయన లుక్ విమర్శల పాలు అవుతుంది. రాజా సాబ్ విషయంలో కూడా ఇది కంటిన్యూ అయ్యింది. గ్రాఫిక్ చేసి వదిలారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. ఆయన నటించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలు భారీ వసూళ్లు రాబట్టాయి. ఇండియా వైడ్ రికార్డ్స్ నమోదు చేశాయి. ఇప్పటికీ బాహుబలి 2 రికార్డ్స్ టచ్ చేసిన సినిమా రాలేదు. ప్రభాస్-రాజమౌళి ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో రాజమౌళి బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తాడని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. మొత్తంగా బాహుబలి 2 రికార్డ్స్ ఆర్ ఆర్ ఆర్ బ్రేక్ చేయలేకపోయింది. కాబట్టి ప్రభాస్ రేంజ్ వేరు అని తేలిపోయింది.
అయితే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కి అసలు కష్టాలు మొదలయ్యాయి. ఆయన సినిమాలు ఆ స్థాయిలో ఆడటం లేదు. ఆ విషయం పక్కన పెడితే... ప్రభాస్ లుక్ విమర్శల పాలు అవుతుంది. సాహో నుండి మొదలుపెడితే ఇప్పటి వరకు ప్రభాస్ ఒక్క చిత్రంలో కూడా లుక్ సెట్ కాలేదు.
ప్రభాస్ అతిగా తాగి ఆరోగ్యం పాడు చేసుకున్నాడనే వాదన ఉంది. ఆయన వాయిస్ కూడా మారిపోయింది. డైలాగ్స్ అర్థం కావడం లేదు. సలార్ మాత్రమే ఓ మోస్తరు విజయం అందుకుంది. బాహుబలి 2 తర్వాత విడుదలైన అన్ని సినిమాలు ప్లాప్ అయ్యాయి.
ఈ పరాజయాల్లో ప్రభాస్ కి కూడా వాటా ఉంది. ప్రభాస్ లుక్ సరిగా లేదు. ఆయన డూప్ తో మూవీని లాగించేస్తున్నారనే పుకార్లు ఉన్నాయి. ఆదిపురుష్, కల్కి చిత్రాల్లో ప్రభాస్ లుక్ కి నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. లేటెస్ట్ మూవీ రాజా సాబ్ విషయంలో కూడా ఇది కంటిన్యూ అయ్యింది.
అసలు ప్రభాస్ లుక్ ని గ్రాఫిక్ చేసి వదిలారు. ఇదంతా ఈజీగా అర్థం అవుతుంది. అసలు ఫస్ట్ లుక్ కూడా గ్రాఫిక్ చేసి విడుదల చేయడం ఏమిటీ? ప్రభాస్ పేస్ ఏఐ లో చేశారు అనిపిస్తుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
Prabhass
మరోసారి ప్రభాస్ మూవీ నెగిటివ్ కామెంట్స్ తో షురూ అయ్యింది. కల్కి లుక్ విడుదల చేసిన చిత్ర యూనిట్ విమర్శలు రావడంతో డిలీట్ చేసి మరో లుక్ వదిలారు. ఒక దశలో అందంలో ప్రభాస్ కి పోటీ ఇచ్చిన ప్రభాస్ నుండి ఇవి ఊహించని పరిణామాలు..