కమల్ హాసన్ సినిమాలో ప్రభాస్, పాన్ ఇండియాను షేక్ చేయబోతున్న కల్కి కాంబో..
ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబోలకు క్రేజ్ బాగా ఉంటుంది. అనుకోని స్టార్ కాంబినేషన్స్ కూడా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తుంటాయి. అలాంటి కాంబోగా ప్రభాస్ , కమల్ హాసన్ కాంబినేషన్ నిలిచింది.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీ సినిమాలో నటించి మెప్పించాడు లోకనాయకుడు కమల్ హాసన్. ఇక ఇఫ్పుడు ప్రభాస్ వంతు వచ్చింది. కమల్ హాసన్ సినిమాలో ప్రభాస్ కనిపించబోతున్నాడు. ఈ వార్తలోనిజం ఎంత..? ఏ సినిమాలో ఈ ఇద్దరు స్టార్లు కనిపించబోతున్నా సినిమా ఏంటి..? దర్శకుడు ఎవరు..? ఈ వార్తలో నిజం ఎంత..? వివరాల్లోకి వెళ్తే..?
Also Read: రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడు..? రహస్య ప్రేమ వెనుక నిజానిజాలు..?
లోకనాయకుడు కమల్ హాసన్ వరుస సినిమాలతో అలరించబోతున్నాడు. ప్రయోగాలకు పెట్టిందిపేరుగా నిలిచిన ఆయన.. ఆతరువాత చేస్తూ వస్తున్న సినిమాలు పెద్దగా వర్కౌట్ అవ్వడంలేదు.
ఎక్కువ ప్లాప్ లు మూటగట్టుకుంటూ.. మార్కెట్ ను కొల్పోయిన కమల్ హాసన్ ను ఒక్క సారిగా టాప్ లోనిలబెట్టిన సినిమా విక్రమ్. ఇక కమల్ హాసన్ పని అయిపోయింది. పొలిటికల్ గా ఏమైనా ఉంటే చూసకోవడమే అని అనుకుంటూ.. గుసగుసలాడుతూ వచ్చిన జనాలకు గట్టిగా బుద్దిచెప్పాడు.
Also Read: పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ వేసుకున్న బట్టలు ఎక్కడివో తెలుసా..? వాటి ప్రత్యేకత ఏంటంటే..?
Vikram movie
లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఈసినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి.. కమల్ హాసన్ ఫిల్మ్ కెరీర్ లోనే టాప్ సినిమాగా నిలిచింది. పడిపోతున్న కమల్ పిల్మ్ కెరీర్ ను మళ్లీ నిలబెట్టింది సినిమా. దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ కు కూడా పాన్ ఇండియా ఇమేజ్ ను తీసుకువచ్చిన సినిమా విక్రమ్. అయితే ఈసినిమా క్లైమాక్స్ లో విక్రమ్ కు సెకండ్ పార్ట్ మూవీ ఉంటుందని హింట్ ఇచ్చాడు.
Ulaga Nayagan Kamal
ఇక త్వరలో విక్రమ్ 2 పట్టాలెక్కడానికి రెడీ అవుతుంది. అయితే ఈసినిమా స్టార్ట్ అవ్వడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మణిరత్నం సినిమాలో కమల్ హాసన్, రజినీకాంత్ సినిమాతో లోకేష్ కనకరాజ్ ఇద్దరు ఫుల్ బిజీగా ఉన్నారు. రజినీకాంత్ కూలిసినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది.
సో ఈమూవీ అయిపోగానే విక్రమ్ 2 వర్క్ ను ఫినిష్ చేసుకుంటాడట. మణిరత్నం సినిమా పూర్తి అవ్వగానే కమల్ హాసన్ లోకేష్ తో జాయిన్ అవ్వబోతున్నడని సమాచారం. అయితే ఇక్కడే మరో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈసినిమాలో ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని తెలుస్తోంది. కమల్ హాసన్ తో ప్రభాస్ కు మంచి సంబధం ఉంది.
ఇద్దరిమధ్య స్నేహం కారణంగా కమల్ హాసన్ అడగ్గానే ప్రభాస్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ఈసినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో తెరెక్కించబోతున్నట్టు సమాచారం. మరి ఈ ప్రాజెక్ట్ఎప్పుడు పట్టాలెక్కబోతోంది. ఎలా ఉండబోతోంది. ఈ వార్తలో నిజం ఎంత అనేది చూడాలి.